pizza
Mama Manchu Alludu Kanchu audio success meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 December 2015
Hyderabad

‘మామ మంచు అల్లుడు కంచు’ ఆడియో సక్సెస్ మీట్...

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రమ్యకృష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘మామమంచు..అల్లుడు కంచు’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి తీర్చిదిద్దారు. కోటి, అచ్చు, రఘుకుంచె సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తిరుపతిలోనెహ్రు నగర పాలక ఉన్నత పాఠశాలలో సినీ, రాజకీయ సమక్షంలో ఆడియో సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా.మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లరి నరేష్, అలీ, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కోటి, రఘుకుంచె, ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో...

డా.మోహన్ బాబు మాట్లాడుతూ ‘’సినిమా నటీనటులకు సినిమాయే ఊపిరి, భోజనం. క్రమశిక్షణ, నిజాయితీ కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నాను. తిరుపతి దివంగత ఎమ్మెల్యే వెంకట రమణతో కలిసి నాటకాలు వేశాను. గోలీలు ఆడాను. మరాఠిలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాం. సినిమా వందరోజుల వేడుకును కూడా ఇక్కడే నిర్వహిస్తాం’’ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’మోహన్ బాబుగారి వంటి సీనియర్ నటుడుతో నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్లానింగ్ పక్కాగా ఉండటంతో సినిమాను 40 రోజుల్లో పూర్తి చేశాం. సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

అలీ మాట్లాడుతూ ‘’మోహన్ బాబు గారు గొప్ప నటులు. 560 చిత్రాలకు పైగా నటించడం, 60 చిత్రాలను నిర్మించడం ఆయనకే చెల్లింది. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుంది’’ అన్నారు.

మోహన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసి 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలో ఆయన అభిమానులు కూడా పాల్గొన్నారు.

నటీనటులు :
డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా, సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న, దాసన్న, అంబటి శీను

టెక్నిషియన్స్ :
మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్, విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, కోటి, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved