సంపూర్ణేష్ బాబు, చరణ్ తేజ్, రోషన్, హమీదా కీలక పాత్రల్లో నటించిన సినిమా ` భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ`. రాజేష్ పులి దర్శకుడు. మారుతి టీమ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి 8న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చరణ్‌తేజ్ కేక్ కట్ చేసి మాట్లాడారు.
చరణ్‌తేజ్ మాట్లాడుతూ ``మాది గుంటూరు. అయితే పెరిగిందంతా రాజమండ్రిలో. ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నాను. సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కి వచ్చాను. మారుతి, త్రినాథరావు నక్కిన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను. అయితే నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అని మారుతి ఓ రోజు అడిగారు. కానీ నాకు అప్పటికి యాక్టింగ్ మీద ఆసక్తి లేదు. రాజేష్ పులిగారు, సినిమాటోగ్రాఫర్ జోషిగారు కలిసి భద్రమ్ బీ కేర్‌ఫుల్ బ్రదరు సినిమాలో నటించమని అడిగారు. కథ నచ్చడంతో ఒప్పుకున్నాను. ఇందులో షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా కనిపిస్తాను. నేను డైరక్ట్ చేసే హీరోగా సంపూర్ణేష్ బాబు కనిపిస్తాడు. ఈ సినిమా గురించి నేను వినాయక్‌గారితో చెబితే చదువును అశ్రద్ధ చేయొద్దని అన్నారు. మంచి డాక్టర్ అయి ఉచితంగా వైద్యం చేయాలన్నది నా కోరిక. మరోవైపు మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కూడా ఉంది`` అని తెలిపారు.