pizza
Sunil Birthday celebrations 2016
చిన్నారుల సమక్షంలో సునీల్ జన్మదిన వేడుకలు!
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 February 2016
Hyderabad

కథానాయకుడు సునీల్ జన్మదిన వేడుకలు నేడు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ స్కూల్ లో చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నాడు. స్కూల్ బాగోగుల కోసం సహాయార్ధం గతంలో 2 లక్షల రూపాయల విరాళాన్ని అందించిన సునీల్.. ఈ ఏడాది చిన్నారుల కోరిక మేరకు వారి చదువుకు అవసరమైన 55 అంగుళాల సామ్ సంగ్ టివి సమకూర్చాడు.

ఇటీవల "కృష్ణాష్టమి" చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్న సునీల్.. ప్రస్తుతం వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "ఈడు గోల్డ్ ఎహే" చిత్రంలో నటిస్తున్నాడు.

ఇకపోతే.. చిన్నారుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడంతోపాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన టివిని సమకూర్చడం, వారితో సంతోషంగా గడపడం పిల్లలకు మానసిక సంతృప్తినిచ్చిందని, సునీల్ ఇదే విధంగా భవిష్యత్ మరింత స్టార్ డమ్ దక్కించుకొని.. ఇదే విధంగా ఎంతో మందికి సహాయపడాలని విక్టోరియా మెమోరియల్ స్కూల్ సిబ్బంది కోరుకొన్నారు!


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved