pizza
Drushya Kavyam Firstlook Launch
‘దృశ్కావ్యం’ ట్రైలర్ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 February 2016
Hyderabad

పుష్యమి ఫిలింమేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హీరో నిఖిల్ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

హీరో నిఖిల్ మాట్లాడుతూ ‘’దర్శక నిర్మాతలు సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తులు. మంచి టీంతో చేసిన ప్రయత్నం. ట్రైలర్ కొత్తగా కనపడుతుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్ గా అనిపిస్తున్నాయి. మార్చి 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి. అప్పుడే మరిన్ని మంచి, కొత్త చిత్రాలకు రావడానికి అవకాశం ఉంటుంది’’ అన్నారు.

దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’దర్శకుడిగా తొలిచిత్రం. అందరికీ నచ్చేలా ప్రతి సీన్ ను డిజైన్ చేసుకుని తెరకెక్కించాం. సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్, టెక్నిషియన్స్ మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేయడంతో సినిమా అందమైన దృశ్యకావ్యంలా రూపొందింది. ప్రాణం కమలాకర్ అందరితో పోటీపడి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఇది హర్రర్ చిత్రాలకు డిఫరెంట్ గా ఉంటుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ. మార్చి 18న విడుదలకు సిద్ధమవుతుంది. అందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.

 

Karishma Kulkarni Glam gallery from the event

మధునందన్ మాట్లాడుతూ ‘’దర్శకుడికి నిర్మాతగా కూడా అనుభవం ఉండటంతో పాటు ఆయన కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. రీరికార్డింగ్ చాలా బావుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి దర్శక నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు నిర్మించడానికి మూలం కావాలి’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం కమలాకర్ మాట్లాడుతూ ‘’ఎక్స్ ట్రార్డినరీ కథ. సింగిల్ ఫైట్, ఐటెంసాంగ్ లేకుండా సాగే కథ ఇది. మంచి ప్యాషనేట్ దర్శక నిర్మాతలు. సినిమా మార్చి 18న విడుదలవుతుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ కశ్మీరా కులకర్ణి, రచ్చరవి, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శానమోని తదితరులు పాల్గొన్నారు.

అలీ, పృథ్వీ, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, షాని, జీవా, మేల్ కోటి, సుమన్ శెట్టి తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: సంతోష్ శానమోని, సంగీతం: ప్రాణం కమలాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved