pizza
Khayyum Bhai first look launch by Minister Talasani Srinivas Yadav
మంత్రి త‌ల‌సాని చేతుల మీదుగా `ఖ‌య్యుంభాయ్` ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ
You are at idlebrain.com > News > Functions
Follow Us

04 June 2017
Hyderabad

గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-`ఖ‌య్యుం భాయ్‌`. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న న‌టిస్తున్నారు. భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్ ను ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిద్దిపేట‌కు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఫిలిం చాంబర్ సభ్యులు వెన్నమనేని కిషన్ రావు, కాంబోజి వేంకటేశ్వర్లు. సీ.హెచ్ బాబురావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ, ` సిద్దిపేట కు చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఫిలిం చాంబర్ సభ్యులు వెన్నమనేని కిషన్ రావు సిఎం గా నటించిన చిత్రం ఖ‌య్యూం భాయ్ చిత్రం, మాఫియా డాన్ నయిమ్ ఆరచాకాలను తెలంగాణ ప్రజల కళ్లకు కట్టినట్లు చూపాలని తెలంగాణ ప్రభుత్వం చిత్రికరించిందన్నారు. అలాగే తెలంగాణ ప్రజల్లో మాఫియా ముఠాలను అణిచి వేసే విధానం చైత‌న్య‌వంతంగా ఉంటుంది` అని అన్నారు.

న‌యీమ్ పాత్ర‌ధారి క‌ట్టా రాంబాబు మాట్లాడుతూ `` ఈరోజు తెలంగాణ మంత్రి వ‌ర్యులు చేతుల మీదుగా మా సినిమా పోస్ట‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. భ‌ర‌త్ ఈ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కించారు. మూడు నెల‌ల పాటు ఎంతో క‌ష్ట‌ప‌డి చిత్రీక‌ర‌ణ చేశాం. క‌ష్ట‌మైనా ఇష్టంగా టీమ్ అంతా క‌లిసి ప‌నిచేశాం. ఎడిట‌ర్ గౌతం రాజు గారు సినిమా చూసి మెచ్చుకున్నారు. ధీమాగా ఉండొచ్చ‌ని న‌మ్మ‌కంతో చెప్పారు. ప్రేక్ష‌కులంద‌రికీ కూడా న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.

ఇందులో కీల‌క‌మైన ఏసీపీ పాత్ర‌లో తార‌కర‌త్న న‌టిస్తున్నారు. సినిమాకు ఆ పాత్ర మ‌రో హైలైట్ గా ఉంటుంద‌ని యూనిట్ తెలిపింది.

మౌని (బెంగ‌ళూరు), ప్రియ , హ‌ర్షిత ,రాగిని , సుమ‌న్ , చ‌ల‌ప‌తిరావు, బెనర్జీ, య‌ల్.బి. శ్రీరాం, జీవ, వినోద్, రాంజ‌గ‌న్ ,ఫిష్ వెంక‌ట్ , దాస‌న్న‌, కోటేశ్వ‌రరావు , జూనియ‌ర్ రేలంగి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. కెమెరా: శ్రీ‌ధ‌ర్ నార్ల‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, క‌ళ‌: పి.వి.రాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర, ఫైట్స్‌: విజ‌య్‌, డ్యాన్స్‌: శేఖ‌ర్‌, మాట‌లు: భ‌వానీ ప్ర‌సాద్‌, క‌థ‌-క‌థ‌నం-ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్.

 



 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved