pizza
Kundanapu Bomma First look launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 April 2015
Hyderabad

‘కుందనపు బొమ్మ’ ట్రైలర్ విడుదల

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కుందనపు బొమ్మ. జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘’బాపు రమణలతో నాకు మంచి అనుబంధం ఉంది. వారి ఫ్యామిలీ సభ్యలు కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.
కీరవాణి మాట్లాడుతూ ‘’సినిమా టైటిల్ చాలా బావుంది. ఇద్దరబ్బాయిల్లో అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందనేదే కథ. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.

డైరెక్టర్ ముళ్లపూడి వరా మాట్లాడుతూ ‘’రాఘవేంద్రరావుగారికి 43 కథలు తర్వాత నచ్చిన కథతో తెరకెక్కిన సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోసాగే సినిమా. విజయనగరం, బొబ్బిలిలో సినిమాని చిత్రీకరించాం’’ అన్నారు.

నిర్మాతలు మాట్లాడతూ ‘’సినిమా చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే నెలలో ఆడియో, సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో సుధాకర్ కోమాకుల, చాందిని చౌదరి తదితరలు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథా విస్తరణ- స్క్రీన్ ప్లే: కె.కె.వంశీ, తాళ్లూరి శివ, మాటలు: అనురాధ ఉమర్జీ, పాటలు: కీ.శే.ఆరుద్ర, శివశక్తి దత్తా, అనంత్ శ్రీరాం, కెమెరా: ఎస్.డి.జాన్, నిర్మాతలు: జి.అనిల్ కుమార్ రాజు, జి.వంశీకృష్ణ, దర్శకత్వం: ముళ్లపూడి వరా.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved