pizza
Goodachari success meet
`గూఢ‌చారి` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 August 2018
Hyderabad

అడివిశేష్‌, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ స‌మ‌ర్ప‌ణ‌లో.. శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా.. అభిషేక్ నామ‌, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢ‌చారి`. ఆగ‌స్ట్ 3న సినిమా విడుద‌లైంది. ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర విడుద‌ల చేశారు. సోమ‌వారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది.. ఈ కార్య‌క్ర‌మంలో...

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ - ``ఒక సినిమాలో హీరోగా న‌టిస్తే చాలు అనుకున్నాను. కానీ ముప్పై ఏళ్లు అంద‌రూ నాకు స‌పోర్ట్ అందించారు. `గూఢ‌చారి`తో న‌టుడిగా ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అప్ప‌ట్లో నా తొలి షాట్‌కి చిరంజీవిగారు క్లాప్ కొట్టడం నాకు ఇంకా గుర్తుంది. అప్ప‌ట్లో ఓ స్టార్ పుట్ట‌బోతున్నాడ‌ని నేను అనుకున్నాను. కానీ ప్లాప్ స్టార్ అని త‌ర్వాత తెలిసింది. 3-4 సంవ‌త్స‌రాల్లో ..10-12 సినిమాలు ప్లాపులు త‌ర్వాత కూడా నేను ఇక్క‌డ ఉన్నానంటే కార‌ణం మీ ఆద‌ర‌ణే. ప్ర‌తి ఒక్క‌రి పేర్లు చెప్ప‌లేను. 130 మంది సినిమాలు చేశాను. అంద‌రికీ థాంక్స్‌. ఇక గూఢ‌చారి సినిమా గురించి చెప్పాలంటే.. చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. నా 30 ఏళ్ల కెరీర్‌లో ఇది బెస్ట్ సాయంత్రం అని భావిస్తున్నాను. ఎందుకంటే కెమెరా ముందు త‌ప్ప నేను బ‌య‌ట న‌టించ‌లేను. నా కోసం ఈ ఫంక్ష‌న్ చేశారంటే.. నా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఆ రోజున శేష్‌ని, శ‌శిని న‌మ్మి నిర్మాత‌లు సినిమాపై డ‌బ్బు ఖ‌ర్చు పెట్టారు. నేను కూడా న‌మ్మే సినిమా చేశాను. సినిమా చూసిన త‌ర్వాత డ‌బ్బులు తీసుకోకుండా సినిమా చేసుంటే బావుండేద‌నిపించింది. టీమ్ క‌ష్ట‌ప‌డ‌లేదు.. గొడ్డు చాకిరీ చేశారు. సినిమాకు.. డ‌బ్బుకు సంబంధం లేదు. ప్రేక్ష‌కుడి సోల్‌కు క‌నెక్ట్ కావాలంతే.. చాలా మంది సినిమా బ‌డ్జెట్‌ను అవ‌స‌రం లేకున్నా పెంచేస్తుంటారు. అలాంటిది ఈ సినిమా టీమ్‌ను చూస్తుంటే ఇలాంటి టీమ్‌లో ప‌నిచేశామ‌నే గ‌ర్వంగా అనిపించింది. సినిమా అంటే విప‌రీత‌మైన ప్యాష‌న్ ఉన్న టీమ్ ఇది. సినిమాలో నేను గొప్ప‌గా చేశాన‌ని అనుకోలేదు.. డైరెక్ట‌ర్ గొప్ప‌గా చేయించాడు. శ‌శ‌కి, శేష్‌కి, శ‌నీల్‌కి ఉన్న అండ‌ర్ స్టాండింగ్ చూస్తే.. భార్త భ‌ర్త‌ల మ‌ధ్య ఇలాంటి అండ‌ర్ స్టాండింగ్ ఉంటే చాలనిపించింది. వీళ్ల‌లో ఎవ‌రైనా నెక్స్‌ట్ సినిమా చేసేట‌ప్పుడు నాకు క‌థ చెప్ప‌న‌క్క‌ర్లేదు. డేట్స్ చెప్పండి చాలు వ‌చ్చి చేసేస్తాను. అంతలా నాకు న‌చ్చారు. మూడేళ్లు ప‌ని లేకుండా నా కెరీర్ అయిపోయిందా అని అనుకుంటున్న స‌మ‌యంలో లెజెండ్ సినిమా అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంత‌ని చెప్పాలో కూడా ఆలోచించాను. నేను త‌క్కువ చెబుదామ‌ని అనుకుంటున్న త‌రుణంలో.. వాళ్లు చాలా ఎక్కువ చెప్పారు. అందుకు కార‌ణం నేనో.. మా నాన్న‌గారంటే ఉన్న గౌర‌వ‌మో నాకు తెలియ‌దు. నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో నా వెనుక ఉన్న అనీల్‌గారు .. 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ గూఢ‌చారి సినిమాలో కూడా అనీల్‌గారున్నారు. అలాగే నాగార్జుగారు.. త‌న‌కు సంబంధం లేకున్నా.. ఈ సినిమాకు వ‌చ్చి ప్ర‌మోట్ చేశారు.. నాగార్జున అంటే అదే. త‌ను చాలా జెన్యూన్‌గా చెప్పాల్సిందంతా చెప్పేశాడు. శ్రీచ‌ర‌ణ్ సినిమాకు అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. ఇక మా సుప్రియ ఇందులో మంచి రోల్ చేసింది. ఈ సినిమాను ఇండ‌స్ట్రీలో అంద‌రూ చూడాలి. ఎంతలో చేశారో తెలుసుకోవాలి. కొంద‌రు సిగ్గుప‌డాలి. ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

అనీల్ సుంక‌ర మాట్లాడుతూ - ``జ‌గ‌ప‌తిబాబుగారు చాలా పెద్ద యాక్ట‌ర్ అయినా.. ఆయ‌న పేరుని కానీ.. ఫోటోని కానీ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఆయ‌న రివీల్ కాగానే సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక చిన్న సినిమాగా విడుద‌లైన గూఢ‌చారి ఈ వారం 25 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను అందుకోనుంది. స్క్రీన్‌పై టీమ్ వ‌ర్క్ క‌న‌ప‌డుతుంది`` అన్నారు.

అబ్బూరి ర‌వి మాట్లాడుతూ - ``నేను లైఫ్‌లో నేను మ‌ర‌చిపోలేని సినిమాల్లో గాయం ఒక‌టి. ఆ సినిమాలో జ‌గ‌ప‌తిబాబుగారి గొంతు కోసం సినిమా చూశాను. అలాంటి జ‌గ‌ప‌తిబాబుగారితో ఈ సినిమాలో ప‌నిచేశాను. శేష్‌, శ‌శి నా కంటే చిన్న‌వారు ఎక్కువ పొగ‌డ కూడ‌దు`` అన్నారు.

శ‌నీల్ డియో మాట్లాడుతూ - ``జ‌గ‌ప‌తిబాబుగారి సినిమాలు చూసి వావ్ అనుకున్నాను. గొప్ప న‌టుడాయ‌న‌. చాలా స్వీట్ హార్టెడ్ ప‌ర్స‌న్‌`` అన్నారు.

శ‌శికిర‌ణ్ తిక్క మాట్లాడుతూ - ``శేష్, అబ్బూరి ర‌విగారు కూర్చుని క‌థ రాశారు. రానా క్యారెక్ట‌ర్ డిజైన్ చేసి ఎవ‌రా అని ఆలోచించిన‌ప్పుడు మాకు జ‌గ‌ప‌తిబాబుగారే గుర్తుకు వ‌చ్చారు. అంత సీనియ‌ర్ ప‌ర్స‌న్ అయినా ఎంతో కంఫ‌ర్ట్ జోన్ క్రియేట్ చేసి న‌టించారు`` అన్నారు.

వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - ``ప్ర‌కాశ్‌రాజ్‌గారు, జ‌గ‌ప‌తిబాబుగారు పిల్ల‌ర్స్‌లా ఈ సినిమాకు ప‌నిచేశారు. సినిమా క‌లెక్ష‌న్స్ పెరుగుతున్నాయి`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved