pizza
Eedo Rakam Aado Rakam Gummadikaya Function
‘ఈడోరకం ఆడోరకం’ గుమ్మడికాయ వేడుక
ou are at idlebrain.com > News > Functions
Follow Us

12 April 2016
Hyderabad

మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలవుతుంది. ఈ సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో అనీల్ సుంకర, జి.నాగేశ్వరరెడ్డి, రాజ్ తరుణ్, సోనారిక, హేబాపటేల్, సాయికార్తీక్, రవిబాబు, విజయ్, డైమండ్ రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ...

అనీల్ సుంకర మాట్లాడుతూ ‘’సినిమా చాలా బాగా వచ్చింది. విష్ణు, రాజ్ తరుణ్ చాలా బాగా యాక్ట్ చేశారు. వీరిద్దరు మధ్య మంచి అవగాహన కుదరడంతో సినిమా ఎంటర్ టైనింగ్ గా కుదిరింది. దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారు సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను ఎంటర్ టైనింగ్ తెరకెక్కించారు. సాయికార్తీక్ సంగీతం బావుంది. కోడి పుంజు సాంగ్ అల్రెడి పెద్ద హిట్టయింది. రాజేంద్రప్రసాద్ గారు, రవిబాబుగారు తమ అనుభవంతో సినిమాలో కామెడి రేంజ్ ను పెంచారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నాం’’ అన్నారు.

రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘’నేను, విష్ణు అన్నయ్య సహా కొందరితో కలసి సినిమా చూశాం. సినిమా చూస్తున్నంత సేపు అందరం నవ్వుతూనే ఉన్నాం. సాధారణంగా సినిమా రిలీజ్ ముందు వరకు టెన్షన్ ఉంటుంది. నాకు టెన్షన్ పోయింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఎగ్జయిట్ మెంట్ ఉంది. విష్ణు అన్నయ్య, సోనారిక, హేబా పటేల్ సహా అందరితో కలిసి యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. రాజేంద్రప్రసాద్, రవిబాబు గారితో నటించడం చాలా హెల్ప్ అయ్యింది. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ అవుతంది. అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం. సినిమా నిర్మాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్’’ అన్నారు.

జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘’విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా అందరూ పోటీ పడి నటించారు. ముఖ్యంగా విష్ణు, రాజ్ తరుణ్ ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో మల్టీస్టారర్ మూవీగా, మంచి ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాను. సినిమా బాగా రావడానికి అనీల్ సుంకర గారి సపోర్ట్ మరచిపోలేను. అలాగే రాజేంద్రప్రసాద్ గారు, రవిబాబుగారు తమ అనుభవంతో సినిమా మేకింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. ఏప్రిల్ 14న సినిమా విడుదలవుతుంది. సినిమా నిర్మాణంలో సహకారం అందించిన అందరికీ థాంక్స్’’ అన్నారు.

సోనారిక మాట్లాడుతూ ‘’విష్ణు, రాజ్ తరుణ్, హేబా, నాగేశ్వరెడ్డిగారు, రాజేంద్రప్రసాద్ గారు, రవిబాబుగారు, కిషోర్ గారు సహా అందరికీ థాంక్స్’’ అన్నారు.

హేబా పటేల్ మాట్లాడుతూ ‘’మంచి టీం తో పనిచేశాను. విష్ణుగారు, రాజ్ తరుణ్, సోనారికతో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. ఏప్రిల్ 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved