pizza
Allari Naresh's Selfie Raja song launch
సెల్ఫీరాజా` సాంగ్ లాంచ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

06 July 2016
Hyderabad

కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ అనతి కాలంలోనే యాభై చిత్రాలను పూర్తిచేసి సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ ఏదో కొత్తదనంతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తూ డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తున్నారు నరేష్‌. తాజాగా అల్లరి నరేష్‌ నటిస్తున్న చిత్రం 'సెల్ఫీరాజా'. సాక్షిచౌదరికామ్నరానావత్‌ హీరోయిన్స్‌గా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై. లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్స్‌ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం'సెల్ఫీరాజా'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ నెల 15న రిలీజ్‌కి రెడీ అవుతోంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్‌ని డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని జూలై 6న హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో చిత్ర యూనిట్‌ సమక్షంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్‌సాక్షిచౌదరిదర్శకుడు ఈశ్వరరెడ్డికమెడియన్స్‌ పృధ్వీనల్ల వేణుతాగుబోతు రమేష్‌రచ్చ రవినాగినీడుగేయ రచయితలు గణేష్‌ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కిషోర్‌ గరికపాటి విచ్చేయగా చిత్ర నిర్మాత చలసాని రామబ్రహ్మం చౌదరి బొకేలతో అతిథులకు స్వాగతం పలికారు. సీనియర్‌ జర్నలిస్ట్స్‌ పసుపులేటి రామారావువినాయకరావుసాయిరమేష్‌ఆనంద్‌ సంయుక్తంగా 'సెల్ఫీరాజాఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

సీనియర్ పాత్రికేయులు వినాయకరావు మాట్లాడుతూ - ''నరేష్‌ ఏ సినిమా చేసినా చాలా డిఫరెంట్‌గాకొత్తగా ఉంటుంది. 'సెల్ఫీరాజాకూడా చాలా వెరైటీ టైటిల్‌. గోపీ ఆర్ట్స్‌ అధినేత గోపిగారు అత్యంత సన్నిహితులు. చాలా కాలం తర్వాత వారి అబ్బాయి చౌదరి ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌ అయి మా చౌదరి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ''మద్రాసులో ఆంధ్రజ్యోతి ఆఫీసు పక్కనే గోపి ఆర్ట్స్‌ సంస్ధ ఆఫీసు ఉండేది. అప్పట్నుంచి గోపిగారు మంచి స్నేహితులు. ఇప్పుడు వారి అబ్బాయి నిర్మిస్తున్న 'సెల్ఫీరాజాచిత్రం అత్యంత ఘన విజయం సాధించి చౌదరికి మరిన్ని లాభాలు తేవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సీనియర్ ఫోటోగ్రాఫర్ సాయిరమేష్‌ మాట్లాడుతూ - ''అల్లరి నరేష్‌ తన ప్రతి సినిమా ద్వారా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. ఈ టైటిల్‌ చాలా ఎట్రాక్షన్‌గాక్యాచీగా ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా సూపర్‌హిట్‌ అవుతుంది. నరేష్‌కిచౌదరికి ఈ సినిమా సక్సెస్‌ కావాలి'' అన్నారు.

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ''ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌గోపి ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న 'సెల్ఫీరాజాసినిమాకి వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈమధ్యనే ఈడోరకం ఆడోరకం', 'సుప్రీమ్‌చిత్రాలు సక్సెస్‌ అయి యాభై రోజులు ఫంక్షన్స్‌ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాం. 'సెల్ఫీరాజా'కూడా యాభై రోజుల ఫంక్షన్‌ జరుపుకుంటామని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సాంగ్స్‌ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆడియోతో పాటు సినిమా కూడా పెద్దహిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

Glam gallery from the event

దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ - ''నరేష్‌ సినిమా వస్తుందంటే అందులో కొత్తగా ఉంటుందని ఆడియన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. మా గురువు ఇవివి గారితో చౌదరిగారు సినిమాలు తీశారు. మళ్లీ అదే బ్యానర్‌లో నాతో సినిమా తీయడం లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చిన నరేష్‌కి చాలా థాంక్స్‌. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్ధ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ రెగ్యులర్‌గా సినిమాలు తీస్తున్నందుకు అనీల్‌ సుంకరగారికికిషోర్‌ గరికపాటికి నా ధన్యవాదాలు. ఈ చిత్రంలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమా కూడా అలాగే కొత్తగా ఉంటుంది. రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే సినిమా ఇది. 'సెల్ఫీరాజాటైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా ఉంటుంది.అతనికి సెల్ఫీ వీక్‌నెస్‌. సెల్ఫీ వల్ల మంచిచెడు రెండూ జరుగుతాయి. మా సెల్ఫీరాజా నోటి దూల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వచ్చాయివాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది మెయిన్‌ కధాంశం. సాయికార్తీక్‌ ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్స్‌ ఇచ్చాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి అనీల్‌గారికిచౌదరిగారికికిషోర్‌కి సక్సెస్‌ రావాలి'' అన్నారు.

నటుడు నాగినీడు మాట్లాడుతూ - ''చలసాని గోపిగారి అబ్బాయి చౌదరి ఈ సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అనీల్‌ సుంకరగారు ఈ సినిమాకి ఎంతో సహకరించారు. సాయికార్తీక్‌ అందించిన పాటలు చాలా బాగున్నాయి. నరేష్‌ సినిమాల్లో ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏమిటనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా నరేష్‌ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది చాలా క్యూరియాసిటీగా ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌ అయి చౌదరికిఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారికి మరిన్ని లాభాలు రావాలి'' అన్నారు.

కమెడియన్స్‌ పృధ్వీ మాట్లాడుతూ - ''సెల్ఫీరాజాచిత్రంలో నరేష్‌ది టైలర్‌మేడ్‌ క్యారెక్టర్‌. నరేష్‌కి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ టైటిల్‌ ఇది. యాక్టింగ్‌పరంగా,డాన్స్‌లపరంగా నరేష్‌ ఈ సినిమాలో ఇరగదీశాడు. ఫ్రెష్‌ లుక్‌తో చాలా కొత్తగా ఈ సినిమా ఉంటుంది. అలాగే జబర్దస్త్‌ టీమ్‌ వేణురచ్చ రవిచమ్మక్‌చంద్ర చేసిన కామెడీ సూపర్బ్‌గా ఉంటుంది. డబ్బింగ్‌ చెప్పేటప్పుడే మేమంతా బాగా నవ్వుకుని ఎంజాయ్‌ చేశాం. సినిమాలో ప్రతి సీన్‌ హైలైట్‌గా ఉంటుంది. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. టీమ్‌ అంతా మంచి ఎఫర్ట్‌తో వర్క్‌ చేశారు. నరేష్‌ గత చిత్రాలన్నింటినీ ఈ సినిమా బ్రేక్‌ చేస్తుంది. ఎక్స్‌ట్రార్డినరీ హిట్‌ అవుతుందీ సినిమా'' అన్నారు.

తాగుబోతు రమేష్‌ మాట్లాడుతూ - ''అలామొదలైందితర్వాత అనీల్‌ సుంకర పిలిచి తన ప్రతి సినిమాలో మంచి అవకాశాలు ఇచ్చారు. నేను ఇవివి గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నన్ను చూసి పెద్ద కమెడియన్‌వి అవుతావు మంచి క్యారెక్టర్‌ ఇస్తాను అన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేరు. ఈ సినిమాలో కమెడియన్‌గా అందరికీ రీచ్‌ అవుతాను. మా నరేష్‌ మాకు క్యారెక్టర్స్‌ ఇస్తున్నారు. ఈ సినిమా అదిరిపోతుంది. పెద్ద హిట్‌ అయి ఈ సినిమా అందరికీ మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

రచ్చ రవి మాట్లాడుతూ - ''షూటింగ్‌ అంతా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు కూడా కడుపుబ్బ నవ్వుకున్నాం. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఫస్టాఫ్‌సెకండాఫ్‌లో వచ్చే కామెడీ అందరికీ బాగా నచ్చుతుంది'' అన్నారు.

పాటల రచయిత గణేష్‌ మాట్లాడుతూ - ''సీమటపాకాయ్‌'లో ఒక పాట రాశాను. ఈ చిత్రంలో కూడా రాశాను. సాయికార్తీక్‌ అద్భుతమైన ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

కమెడియన్‌ వేణు మాట్లాడుతూ - ''నరేష్‌తో కలసి 10 సినిమాల్లో యాక్ట్‌ చేశాం. ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు నవ్వుతూనే ఉంటారు. డెఫినెట్‌గా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌అవుతుంది'' అన్నారు.

హీరోయిన్‌ సాక్షిచౌదరి మాట్లాడుతూ - ''వెరీ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌. నరేష్‌కి పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ టైటిల్‌. ఇట్స్‌ ఎ అమేజింగ్‌ ఫిలిం. గోపి ఆర్ట్స్‌ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

హీరో నరేష్‌ మాట్లాడుతూ - ''త్రీ ఇయర్స్‌ బ్యాక్‌ రీమేక్‌ రైట్స్‌ తీసుకుని అందులో ధర్టీపర్సెంట్‌ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్నో మార్పులు చేసి ఈ సినిమా చేశాం. శ్రీధర్‌ సీపానడైమండ్‌ రత్నబాబువిక్రంరాజు నలుగురు రైటర్స్‌ ఈ సినిమాకి వర్క్‌చేశారు. టీమ్‌ అంతా కలిసి హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కొట్టాలన్న కసితో పనిచేశారు. చౌదరిగారు నాన్నగారితో 'నేటిగాంధీసినిమా తీశారు. చాలాసంవత్సరాల తర్వాత మళ్లీ నాతో సినిమా చేస్తున్నారు. గోపి ఆర్ట్స్‌లో మంచిహిట్‌ కొట్టాలి అని కాన్ఫిడెంట్‌గా ప్రతి ఒక్కరూ పనిచేశారు. నాకు ఇవివి సినిమా ఎలాగోఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కూడా నా ఓన్‌ ప్రొడక్షన్‌లాంటిదే. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంటుంది. 60 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. అందులో 40 రోజులు ఫైట్‌మాస్టర్‌ విజయ్‌ ఛేజ్‌లుయాక్షన్‌ సీన్స్‌ కంపోజ్‌ చేశారు. అలాగని యాక్షన్‌ సినిమా కాదు. ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ. స్పూఫ్‌ల్లాంటివి ఉండవు. 'సెల్ఫీరాజా'కి ఒక సమస్య ఎదురవుతుంది. దీని నుండి బయట పడడానికి రకరకాల గెటప్‌లు వేస్తుంటాడు. సెల్ఫీల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ వస్తాయి అనేది చాలా కొత్తగా చూపించాం. ఈ సినిమాలో సాయికార్తీక్‌ ఐదు మంచి సాంగ్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశాం. రెండో పాట వైజాగ్‌థర్డ్‌ సాంగ్‌ విజయవాడఫోర్త్‌ సాంగ్‌ వరంగల్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నాం. ఈ సినిమాని బాగా ప్రమోట్‌ చేసి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved