pizza
O Pilla Neevalla motion poster launch
క్రేజీ డైరెక్ట‌ర్ పూరి ఆవిష్క‌రించిన‌ `ఓ పిల్లా నీ వ‌ల్లా` మోష‌న్ పోస్ట‌ర్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 January 2017
Hyderaba
d

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో .. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో, మార్చిలో సినిమా రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ క్యూరియ‌స్‌గా ఉంద‌ని పూరి ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ``ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మ‌ద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్ అవుతాయి. ఫిబ్ర‌వ‌రి ఆడియో విడుద‌ల చేసి, మార్చిలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పూరి చేతుల‌మీదుగా మోష‌న్‌పోస్ట‌ర్‌ లాంచ్ చేయ‌డం, ఆయ‌న ప్ర‌శంసించ‌డం.. సంతోషాన్నిచ్చింది. పూరి స‌ర్‌కి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved