pizza
Rogue motion poster launch
పూరి జ‌గ‌న్నాథ్ `రోగ్‌` మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 February 2017
Hyderaba
d

'బద్రి' నుంచి 'ఇజమ్‌' వరకు తన సినిమాల్లోని హీరో క్యారెక్టరైజేషన్‌గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా వుండేలా చూసుకుంటూ రెగ్యులర్‌ సినిమాలకు భిన్నమైన సినిమాలను రూపొందించే డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పుడు మరో డిఫరెంట్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యంగ్‌ హీరో ఇషాన్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ)తో ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతున్నారు డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి వచ్చిన ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగాయి. ఈరోజు ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో మోష‌న్ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశారు. త్వ‌ర‌లోనే రోగ్ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved