pizza
4x4 Movie Launch
'ఫోర్ ఇన్ టు ఫోర్' మూవీ ప్రారంభం
ou are at idlebrain.com > News > Functions
Follow Us

09 May 2016
Hyderabad

చేజ‌ర్ల ఇంద్ర‌కుమార్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ హీరోగా శివ(అపురూప్‌) ద‌ర్శ‌క‌త్వంలో నూత‌న చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి త‌మ్మారెడ్డి భ‌రద్వాజ క్లాప్ కొట్ట‌గా, సి.క‌ల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ద‌ర్శ‌కుడు శివ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌ర్శ‌కుడు శివ‌(అపురూప్) మాట్లాడుతూ ``నా ద‌ర్శ‌క నిర్మాణంలోనే ఈ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం ద్వారా మా ఫ్యామిలీ మెంబ‌ర్ అయిన ప్ర‌శాంత్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఫోర్ ఇన్ టు ఫోర్ అంటే న‌లుగురు వ్య‌క్తుల జీవితాల్లో జ‌రిగిన యదార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాను. అలాగే ప్లాస్టిక్‌ను నిర్మూలించి ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌తో ఉండేలా కాన్సెప్ట్‌ను రూపొందించాను. మా సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

హీరో ప్ర‌శాంత్ మాట్లాడుతూ ``హీరోగా నేను చేస్తున్న మొద‌టి చిత్ర‌మిది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ నిహాల్ మాట్లాడుతూ ``గాయ‌కుడిగా నేను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాను. ఇప్పుడు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉంది. సినిమాను పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కోలా భాస్క‌ర్ స‌హా చిత్రయూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

ప్ర‌శాంత్, ప్రియాంక హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో తాగుబోతు ర‌మేష్‌, వేణు త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత ప‌ర్య‌వేక్ష‌ణః మ‌ణిశ‌ర్మ‌, సంగీతంః నిహాల్‌, కెమెరాః నాని చ‌మిడి శెట్టి, క‌థా స‌హ‌కారంః సాయి సునీల్‌, మాట‌లుః క్రాంతి స‌కినాల‌, ఫైట్స్ః దేవ‌రాజ్‌, నిర్మాణంః అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శివ‌(అపురూప్‌).

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved