ప్రవీణ క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్, మమతా కులకర్ణి, అరోహి హీరో హీరోయిన్లుగా కాటాప్రసాద్ దర్శకత్వంలో నందం రామారావు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘బ్యాంకాక్‌లో..?ఏం జరిగింది’. ఈ సినిమా సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ముహుర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ టి.ఆర్.ఎస్. పార్టీ ఇన్‌చార్జ్ మురళి కెమెరా స్విచ్చాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశలంలో....
జూబ్లీహిల్స్ టి.ఆర్.ఎస్. పార్టీ ఇన్‌చార్జ్ మురళి మాట్లాడుతూ ``కొత్త నటీనటులతో దర్శక నిర్మాతలు చేస్తున్న ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలి. కొత్తగా పరిచయం అవుతున్న హీరో నవీన్ ఈ సినిమాతో మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
దర్శకుడు కాటా ప్రసాద్ మాట్లాడుతూ ``అన్నీ ఎలిమెంట్స్‌తో కూడుకున్న సబ్జెక్ట్ ఇది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. బ్యాంకాక్‌లో 45రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశాం. నవీన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. తనకు మంచి లాంచింగ్ అవుతుంది. నిర్మాతగారు కథ వినగానే ఎంతో సపోర్ట్ చేశారు`` అన్నారు.
నిర్మాత నందం రామారావు మాట్లాడుతూ ``దర్శకుడు ప్రసాద్‌గారు చెప్పిన పాయిట్ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ చిత్రంలో నా అబ్బాయి నవీన్ హీరోగా ఎంట్రీ కావడం ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో నవీన్ మాట్లాడుతూ ``హీరోగా నా తొలి చిత్రం. మంచి పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటించబోతున్నాను. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అన్నారు.
సంగీత దర్శకుడు వేణుగజ్వేల్ మాట్లాడుతూ ``నాలుగు పాటలుంటాయి. ఇప్పటికే రెండు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేసేశాను. మంచి స్క్రిప్ట్. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః వేణు గజ్వేల్, సినిమాటోగ్రఫీః సంతోష్.కె, నిర్మాతః నందం రామారావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంః కాటా ప్రసాద్.