జె యన్ ఆర్ మూవీస్ పతాకంపై శుభకరి సమర్పణలో మోహన్ కృష్ణ, జాహిదా సామ్ జంటగా జె యన్ ఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం `భద్రగిరి`. ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం ఫిలింనగర్ లోని సాయిబాబా టెంపుల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రసన్న కుమార్ తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా పొత్తూరు సర్పంచ్ జగన్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...``భద్రగిరి` టైటిల్ చాలా ఫోర్స్ గా ఉంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్ తో ఉండే కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ అని టైటిల్ ద్వారా తెలుస్తోంది. చిత్ర యూనిట్ కు నా శుభాకంక్షలు`` అని అన్నారు.
చిత్ర దర్శకుడు జనార్ధన్ బోదాసు మాట్లాడుతూ...``నా తొలి సినిమా `నీకోసం నేనున్నా`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. `భద్రగిరి` నా రెండో సినిమా. `బావ మరదలు` చిత్రంతో హీరోగా పరిచయమైన మోహన్ కృష్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. జబర్దస్త్ టీమ్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్తో `భద్రగిరి` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెల రెండో వారం నుంచి షెడ్యూల్ ప్రారంభిస్తాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం`` అని అన్నారు.
హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ...`` చాలా రోజులుగా దర్శకుడు జనార్ధన్ బోదాసు గారితో పరిచయం ఉంది. `బావ మరదలు` నా తొలి సినిమా. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. నా రెండో సినిమాగా `భద్రగిరి` సినిమా చేస్తున్నా. కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ప్రారంభించాం. టైటిల్ తగ్గట్టుగా నా పాత్ర చాలా ఫోర్స్ తో ఉంటుంది. జూన్ లో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తాం`` అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ జాహిదా సామ్ మాట్లాడుతూ...``తెలుగులో నా తొలి సినిమా ఇది. అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలని`` చెప్పారు.