pizza
Bullet movie launch
ప్రారంభ‌మైన `
బుల్లెట్‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 August 2016
Hyderaba
d

కీర్త‌నా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ర‌వివ‌ర్మ‌పూజిత‌నేహ‌దేశ్‌పాండే హీరో హీరోయిన్లుగా ర‌వితేజ్ ద‌ర్శక‌త్వంలో వెంక‌టేష్‌.హెచ్ నిర్మిస్తున్న కొత్త చిత్రం `బుల్లెట్‌సోమ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ చిత్ర తొలి స‌న్నివేశానికి గూడూరు గోపాల్ క్లాప్ కొట్టగానిర్మాత వెంక‌టేష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

హీరో ర‌వివ‌ర్మ మాట్లాడుతూ ``హీరోగా నా తొలి చిత్రం. ఆరు నెల‌లుగా ఈసినిమా కోసం యూనిట్ అంద‌రం క‌ష్ట‌ప‌డుతున్నాం. వ‌చ్చే వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. డిఫ‌రెంట్ పాయింట్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రం. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

Glam gallery from the event

నిర్మాత వెంక‌టేష్.హెచ్ మాట్లాడుతూ ``మా బ్యాన‌ర్‌లో రానున్న మూడో చిత్రం. ద‌ర్శ‌కుడు చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాను. నెక్ట్స్ వీక్ నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. కంటిన్యూ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం`` అన్నారు.

గూడూరు గోపాల్ మాట్లాడుతూ ``మంచి క‌థ‌తో చేస్తున్న ఈ బుల్లెట్ చిత్రం పాయింట్ విన్నాను. చాలా బాగా న‌చ్చింది. మంచి టీం కుద‌రింది. అంద‌రికీ న‌చ్చే ఓ చిత్ర‌మ‌వుతుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌వితేజ్ మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడిగా నా తొలి చిత్రం. స‌బ్జెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. డ్ర‌గ్స్‌మాఫియా నేప‌థ్యంలో సాగే చిత్రం. సినిమాను క‌మ‌ర్షియ‌ల్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిస్తాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తాం. అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌గారికి థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ పూజిత‌నేహాదేశ్ పాండేర‌చ‌యిత నివాస్‌మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజ్‌కిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

షాయాజీ షిండేఅజ‌య్‌వెన్నెల‌కిషోర్‌పృథ్వీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి పాట‌లుః పెద్దాడ‌మూర్తిమాట‌లుః నివాస్‌సంగీతంః రాజ్ కిర‌ణ్‌కెమెరాః ప్ర‌భుఫైట్స్ః వెంక‌ట్‌ఎడిట‌ర్ః ఉద్ధ‌వ్‌ప్రొడ్యూస‌ర్ః వెంక‌టేష్‌.హెచ్‌క‌థ‌,స్క్రీన్ ప్లే,ద‌ర్శ‌కత్వంః ర‌వితేజ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved