pizza
Chitra Sena movie launch
ప్రారంభైన దిలీప్‌కుమార్ సల్వాది "చిత్రసేన"
You are at idlebrain.com > News > Functions
Follow Us


6 April 2019
Hyderabad

ఎస్‌ఆర్‌ఎస్ అసోసియేట్స్, మీటీవీ సమర్పిస్తున్న చిత్రం చిత్రసేన. నర్సింహరాజు రాచూరి, అజయ్ మైసూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దిలీప్ కుమార్ సల్వాది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అజయ్‌మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరాస్వచాన్ చేయగా, లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో...

లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రమిది. పీరియాడిక్ చిత్రాలకు పెద్దపీట పీట వేస్తున్న తరుణంలో పీరియడిక్ చిత్రంగా వస్తుంది. అంతకు ముందు దిక్చూచి చిత్రం తీసిన దర్శకుడు దిలీప్ సల్వాది దీంట్లో హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.

ప్రొడ్యూసర్ అజయ్ మాట్లాడుతూ... నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. అక్కడ నాకు ఒక టీవీ ఛానల్ ఉంది. మీ టీవీ అనే ఛానల్. దిలీప్ నటించిన దిక్సూచి చిత్రం చూశాను నాకు నచ్చింది. ఆయన చెప్పిన కథ నచ్చి ప్రొడ్యూస్ చెయ్యడానికి ఒప్పుకున్నాను. దిలీప్, రాజు మళ్ళీ కాంబినేషన్ బావుంటుంది. గతంలో వీరిరువి కాంబినేషన్‌లో చేసిన దిక్సూచి కూడా విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో మీ ముందుకు వస్తారు.

ప్రొడ్యూసర్ నర్సింహరాజు మాట్లాడుతూ... నేను ఈ చిత్రాని కంటే ముందు దిక్సూచి చిత్రం ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాకి కూడా దిక్సూచి డైరెక్టర్ దిలీప్ కుమార్ సల్వాది హీరోగా నటించి దర్శకత్వం వహించారు. కథను నమ్మి సినిమా చేస్తున్నాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో వస్తుంది అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ... నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఆదే ప్రొడ్యూసర్‌తో కలిసి చెయ్యడం అనేది సంతోషమైన విషయం. అంతే కాక మరో ప్రొడ్యూసర్ అజయ్‌గారు కూడా యాడ్ అయ్యారు. కథ విని నచ్చి వీరిరువురూ ఓకే చేశారు. చిత్ర సేన అంటే ఈ సినిమాలో చిత్ర సేన ఎవరు అన్నది మెయిన్ సస్పెన్స్‌గా నడుస్తుంది. సెకండాఫ్ మొత్తం పీరియాడిక్‌గా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. హీరోయిన్ కోసం వెతుకుతున్నాము. ఇది పీరియాడిక్ స్టోరీ కావడంతో మంచి అమ్మాయి కోసం చూస్తున్నాము. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల చేయాలని అనుకుంటున్నాము. ఏప్రిల్ మూడవ వారంలో దిక్సూచి విడుదల చేస్తాము అని అన్నారు.

టెక్నీషియన్స్
ప్రొడక్షన్ కంట్రోల్ డిజైన్‌ఃరామ్‌లక్ష్మీ సల్వాది, వెంకటేశ్వరరావ్ సల్వాది, ఆర్ట్‌ఃపూనూరి ఆనంద్, విఎఫ్‌ఎక్స్‌ఃదిక్సూచి స్టూడియో
స్ రాబిన్‌సన్,లైన్ ప్రొడ్యూసర్‌ః సైపుమురళి, పిఆర్‌ఓః సాయిసతీష్, ప్రొడ్యూసర్స్‌ః నర్సింహరాజు రాచూరి, అజయ్ మైసూరి, కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వంఃదిలీప్ కుమార్ సల్వాది.

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved