pizza
Dabba Seenu movie launch
‘డబ్బా శీను’ చిత్రాన్ని ప్రారంభించిన దర్శకరత్న దాసరి నారాయణరావు
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 June 2016
Hyderabad

బాబు నాయక్‌, కులకర్ణి మమత హీరో హీరోయిన్లుగా అమూల్య ప్రొడక్షన్స్‌ సమర్పణలో వరంగల్‌ టాకీస్‌ బ్యానర్‌లో రఘు పూజారి దర్శకత్వంలో గుర్రపు విజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘డబ్బా శీను’. ఈ చిత్రం షూటింగ్‌ ఇవ్వాళ ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాసరి నారాయణరావు క్లాప్‌ ఇవ్వగా, మొదటి షాట్‌కి ప్రముఖ దర్శకు సాగర్‌ దర్శకత్వం వహించగా, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, తెలుగు సినిమా సెక్టార్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పూజా కార్యక్రలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు మాట్లాడుతూ "బాబు నాయక్‌ అంటే నాకు ఇష్టం. ఎందుకంటే అతను చేసే హార్డ్‌వర్క్‌ అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కష్టపడితే ప్రతి ఒక్కరూ మంచి ఫలితాలను అందుకుంటారన్నదానికి బాబు నాయక్‌ నిదర్శనం. నా ఆశీస్సులు ఎప్పుడూ బాబు నాయక్‌కు ఉంటాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలి" అని అన్నారు.

ప్రముఖ దర్శకు సాగర్‌ మాట్లాడుతూ "బాబు నాయక్‌ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఒక జర్నలిస్టుగా అతను ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. తను ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి మంచి హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నిర్మాత తుమ్మపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది తమ టాలెంట్‌ని ప్రూవ్‌ చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులు చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఆదరిస్తుంటారు. సినిమాలో విషయం ఉంటే తప్పకుండా సినిమా సూపర్‌ హిట్‌ అవుతుంది. అలాంటి మంచి విషయం ఉన్న చిత్రమే బాబు నాయక్‌ ‘డబ్బా శీను’ చిత్రానికి ఆల్‌ ద బెస్ట్‌" అని అన్నారు.

తెలుగు సినిమా సెక్టార్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ "బాబు నాయక్‌ ఒక పత్రికాధినేతగా, జర్నలిస్టుగా అతను ఎంత కష్టపడుతున్నాడో మాకు తెలుసు. అతను హీరోగా చేస్తున్నాడనగానే మొదటగా నేను ఫోన్‌ చేసి అభినందించాను. తను నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మంచి ఆప్తుడు. "డబ్బా శీను"గా వస్తున్న బాబు నాయక్‌ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

ఈ చిత్రంలో చలపతిరావు, కవిత, చమ్మక్‌ చంద్ర, ఫణి, రచ్చ రవి, చిట్టిబాబు, జూ. రేంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : జె.పి.రామారావు, డ్యాన్స్‌ : బాలు ("పూరంగడు' ఫేమ్‌), పాటలు : చంద్రబోస్‌, కందికొండ, మిట్టపల్లి సురేందర్‌, కాసర్ల శ్యాం, కెమెరామెన్‌ : జి.ఎల్‌.బాబు, ఫైట్‌ మాస్టర్‌ : అవి, పబ్లిసిటీ డిజైనర్‌ : వివ, సంగీతం : రాక్‌ షకీల్‌, కథ : తన్నీరు పాండు రంగారావు, బ్యానర్‌ : వరంగల్‌ టాకీస్‌, సమర్పణ : అమూల్య ప్రొడక్షన్స్‌, నిర్మాత : గుర్రపు విజయ్‌ కుమార్‌, దర్శకుడు : రఘు పూజారి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved