pizza
Guntur Talkies 2 movie launch
'
గుంటూరు టాకీస్‌-2' ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 October 2016
Hyderaba
d

ఆర్‌.కె.స్టూడియోస్‌ అధినేత రాజ్‌కుమార్‌.ఎం నిర్మాణ సారథ్యంలో గుంటూరు టాకీస్‌ సీక్వెల్‌ 'గుంటూరు టాకీస్‌-2' సినిమా లాంచనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా....

రాజ్‌కుమార్‌.ఎం మాట్లాడుతూ - ''మా బ్యానర్‌లో విడుదలైన గుంటూరు టాకీస్‌ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యిందో తెలిసిందే. ఇకపై మా బ్యానర్‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా 'రాజా....మీరు కేకసినిమాను రూపొందించాం. ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. ఇప్పుడు మా బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.3గా గుంటూరు టాకీస్‌ సీక్వెల్‌ గుంటూరు టాకీస్‌-2 సినిమా చేయడానికి సిద్ధమయ్యాం. గుంటూరు టాకీస్‌లో గిరి క్యారెక్టర్‌ చేసిన నరేష్‌గారి నటనకు చాలా మంచి అప్రిసియేషన్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్‌లో నరేష్‌గారు నటిస్తున్నారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్‌గారి శిష్యుడు కిరణ్‌ స్క్రీన్‌ప్లేకథను అందిస్తున్నారు. గుంటూరు టాకీస్‌ చిత్రంలో మేం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మిస్‌ అయ్యామని అన్నారు. ఇప్పుడు ఈ గుంటూరు టాకీస్‌-2 చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆట్టుకునేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలో చెన్నైకు చెందిన ప్రముఖ హీరోయిన్‌ కూడా నటిస్తుండటం విశేషం. సన్నిలియోన్‌ ఈ చిత్రంలో ఒక డాన్‌ క్యారెక్టర్‌లో కనపడుతున్నారు. 20రోజుల పాటు సన్నిలియోన్‌ రోల్‌ను చిత్రీరించనున్నాం. ఇప్పటి వరకు సన్నిలియోన్‌ ఐటెమ్‌ సాంగ్‌ చేసింది కానీ దక్షిణాదిన ఆమె ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాను తెలుగుతమిళంహిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దసరాకు చిత్రీకరణను స్టార్ట్‌ చేసి మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నాం.ఈ సినిమాను నేను డైరెక్ట్‌ చేస్తాను'' అన్నారు.

Glam gallery from the event

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ - ''గుంటూరు టాకీస్‌ కొత్తజోనర్‌ కామెడి ఫిలింగా మాస్‌యూత్‌ ఆడియెన్స్‌ను ఆట్టుకుంది. ఆ చిత్రంలో నేను చేసిన గిరి రోల్‌కు చాలా మంచి పేరు వచ్చింది. మళ్లీ గుంటూరు టాకీస్‌ సినిమాకు సీక్వెల్‌ మూవీ చేయడానికి రాజ్‌కుమార్‌గారు సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్‌లో కూడా నేను ఓ రోల్‌ చేస్తున్నాను. అలాగే ఈ సీక్వెల్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్స్‌కు తీసుకొస్తుంది. సన్నిలియోన్‌ దక్షిణాదిన సాంగ్స్‌లో కాకుండా పాత్రలో నటిస్తున్న సినిమా కూడా ఇదే. సినిమాను ముంబైలో ఓ సెట్‌ వేసి చిత్రీకరిచండానికి సన్నాహాలు చేస్తున్నారు'' అన్నారు.

వినీత్‌ మాట్లాడుతూ - ''తెలుగులో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. గుంటూరు టాకీస్‌ చిత్రం నాకు ఎంతోనచ్చిన చిత్రం. ఈ సినిమా సీక్వెల్‌లో నేను యాక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

కిరణ్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు నేను కథస్క్రీన్‌ప్లే అందిస్తున్నాను. గుంటూరు టాకీస్‌ కన్నా మంచి కథకామెడిఎగ్జయిట్‌మెంట్‌ ఉండే చిత్రమే గుంటూరు టాకీస్‌ -2''అన్నారు.

ఈ కార్యక్రమంలో అదితిసింగ్‌హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: రామ్‌రెడ్డిమ్యూజిక్‌: శ్రీచరణ్‌ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ఆర్ట్‌: మారిష్‌డైరెక్టర్‌: రాజ్‌కుమార్‌.ఎం


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved