రామ్ కార్తీక్, భాను జంటగా యస్.ఆర్.పి.విజన్స్ బ్యానర్ పై నూతన చిత్రం‘ఇద్దరి మధ్య 18’ మంగళవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ సినిమాను నిర్మిస్తున్నారు. ముహుర్తపు సన్నివేశానికి తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టగా, నిర్మాత శివరాజ్ పాటిల్ కెమెరా స్విచ్చాన్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
నాని ఆచార్య మాట్లాడుతూ‘’ఇప్పటి యూత్ ఐడియాలజీకి దగ్గరగా ఉండే సబ్జెక్ట్. బి.టెక్ ఫైనల్ ఇయర్ చదివే హీరో హీరియన్ మధ్య జరిగే కథ. యూత్, ఫ్యామిలీకి నచ్చే విధంగా ఉంటుంది. సినిమా టాకీ పార్ట్ అంతా హైదరాబాద్ లోనే చిత్రీకరిస్తాం. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు.
నిర్మాత శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ‘’నిర్మాతగా తొలి చిత్రమిది. మంచి కథతో దర్శకుడు అందరికీ నచ్చేలా సినిమా రూపొందిస్తాడని నమ్మతున్నాను’’అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ‘’సినిమా అందరికీ నచ్చేలా ఉంటూనే అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉంటుంది. మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉంది. నాలుగు పాటలు, ఓ బిట్ సాంగ్ ఉంటుంది. సంపగి తరహా మ్యూజిక్ ఉంటుంది. వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు’’ అన్నారు.
Bhanu Sri Glam gallery from the event
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ‘’దృశ్యకావ్యం తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ భాను మాట్లాడుతూ‘’మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆజాద్, సినిమాటోగ్రాఫర్ క్రిష్ తదితరులు పాల్గొన్నారు.
దువ్వాసి మోహన్, మెల్కోటి, రచ్చరవి, రాఘవ, అప్పారావ్, గీతాసింగ్, చిట్టిబాబు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఆర్ట్:బి.రాంచందర్ సింగ్, సినిమాటోగ్రఫీ: కె.ఎం.క్రిష్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: ఎన్.బిక్షపతి, నిర్మాత : శివరాజ్ పాటిల్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాని ఆచార్య.