నందు, తేజస్విని ప్రకాష్ హీరో హీరోయిన్స్ గా ఇ.రాజమౌళి సమర్పణలో ఎ.ఎస్.పి.క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన చిత్రం‘కన్నుల్లో నీ రూపమే’ బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఇ.రాజమౌళి క్లాప్ కొట్టగా ప్రియాన్ష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బిక్స్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భాస్కర్ బాసాని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
హీరో నందు మాట్లాడుతూ``దర్శకుడు యు.ఎస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినప్పటికీ సినిమాల మీద ఇష్టంతో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో కోర్సు నేర్చుకుని ఇక్కడకు వచ్చి ఆరు నెలలు స్క్రిప్ట్‌పై వర్క్ చేశారు. కంప్లీట్ కామెడి థ్రిల్లర్ చిత్రమిది. నేను ఇప్పటి వరకు చేసిన రోల్స్ లో ఇది చాలా డిఫరెంట్ రోల్. నా కెరీర్‌కు మరో మెట్టులా ఉంటుందని భావిస్తున్నాం. సన్నిఅనే పాత్రలో కనపడతాను. హీరోయిన్ తేజస్విని కన్నడ, తెలుగులో సినిమాలు చేసింది. మంచి టీంతో చేయనున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
Glam gallery from the event
నిర్మాత భాస్కర్ బాసాని మాట్లాడుతూ ``రేపటి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి షెడ్యూల్‌ను ఈ నెలలో పూర్తి చేసి జూలైలో సెకండ్ షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఆగస్టులో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్‌గారు చాలా మంచి కథ, స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. సాకేత్ మంచి సంగీతానందించారు. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
డైరెక్టర్ బిక్స్ మాట్లాడుతూ``ప్రొడ్యూసర్‌గారు కథ విని సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. సినిమాలో 80శాతం ఎమోషనల్ కామెడితో సాగుతుంది. జూన్, జూలైలో చిత్రీకరణను, ఆగస్ట్‌లో పోస్ట్ ప్రొడక్షన్‌ను పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేసేలా ప్రణాళికలు చేస్తున్నాం. సాకేత్ మంచి మ్యూజిక్ అందించారు`` అన్నారు.
హీరోయిన్ తేజస్విని ప్రకాష్ మాట్లాడుతూ ``తెలుగులో సినీ మహాల్, ప్రతిక్షణం సినిమాల్లో నటించాను. తెలుగులో ఇది నా మూడో సినిమా. మంచి పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న చిత్రమిది``అన్నారు.
ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్, సినిమాటోగ్రాఫర్ విశ్వకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సాకేత్ కొమండూరి, ఆర్ట్ః ప్రేమ్ కుమార్, కొరియోగ్రఫీః ఆట సందీప్, సాహిత్యంః అనంత్ శ్రీరాం, శ్రీమణి, నిర్మాతః భాస్కర్ భాసాని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః బిక్స్.