pizza
Karthikeya entertainments production.1 movie launch
కార్తికేయ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రొడక్ష‌న్ నెం.1 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Karthikeya entertainments production.1 movie launch
Follow Us


19 October 2018
Hyderabad


సుధీర్, ఆద్యా ఠాగూర్‌, అదితి హీరో హీరోయిన్లుగా కార్తికేయ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 కొత్త చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. ప్ర‌ణ‌య్ ద‌ర్శ‌కుడు. కార్తికేయ నిర్మాత‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

ద‌ర్శ‌కుడు ప్ర‌ణ‌య్ మాట్లాడుతూ - `` న్యూ జ‌న‌రేష‌న్ ల‌వ్ అండ్ లైఫ్ స్టోరి. కొన్ని రెఫ‌న్స్‌ల ఆధారంగా క‌థ త‌యారు చేసుకున్నాను. న‌వంబ‌ర్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంది`` అన్నారు.

హీరో సుధీర్ మాట్లాడుతూ - ``టీవీ సీరియ‌ల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించాను. హీరోగా నా తొలి చిత్రం. ఆద్యా ఠాగూర్‌, అదితి క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంది.క‌చ్చితంగా సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఉటుంది. హీరోగా నాకు మంచి బ్రేక్ తెచ్చేసినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ కుషేంద‌ర్ మాట్లాడుతూ - ``క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా చేయాల‌నుకున్న డైరెక్ట‌ర్ ఉన్న‌ట్లుండి లవ్ అండ్ లైఫ్ స్టోరీ క‌థ‌ను త‌యారు చేశారు. క‌థ అద్భుతంగా రావ‌డంతో ఇదే కాన్సెప్ట్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాం. అవకాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

సుధీర్, ఆద్యా ఠాగూర్‌, అదితి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: విఠ‌ల్, సంగీతం: కుషేంద‌ర్‌, ఎడిట‌ర్‌: గ్యారీ, నిర్మాత‌: కార్తికేయ‌, ద‌ర్శ‌కత్వం: ప‌్ర‌ణ‌య్‌.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved