pizza
Kerintha movie launch
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 June 2014
Hyderabad

కేరింత పూజాకార్యక్రమాలు...

అప్‌కమింగ్‌ మరియు కొత్తనటీనటులు లీడ్‌రోల్స్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు శిరీష్‌-లక్ష్మణ్ లు నిర్మిస్తోన్న 18వ చిత్రం కేరింత.సాయికిరణ్‌ అడవి దర్శకుడు . యూత్‌ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సోమవారంనాడు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్ధ కార్యాలయంలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.దేవుడి పటాలపై చిత్రీకరించిన మూహూర్తపు షాట్‌కు వినాయక్‌ క్లాప్‌ నివ్వగా,అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా,శ్యాంప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.పలువురు నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్లోన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ..కేరింత సినిమా కోసం మేము గత రెండేళ్లుగా పక్కాగా స్క్ర్రిప్ట్‌ వర్క్‌ చేశాము.అందరు కొత్త వాళ్లను లీడ్‌రోల్స్‌ నటింపచేయనున్నాము.అందుకోసం స్టార్‌ హంట్‌ను నిర్వహించటం జరిగింది.మా బ్యానర్‌లో వచ్చిన ఆర్య ,బోమ్మరిల్లు,కొత్త బంగారులోకం తరహాలో ప్రెష్‌నెస్ ఉన్న సినిమా ఇది.ఈనెల 23నుంచి చిత్రీకరణ ప్రారంచించనున్నాము.సెప్టెంబర్‌లో సినిమాను కంప్లీట్‌ చేసి అక్టోబర్‌లో కేరింత ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకువస్తామన్నారు...

ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి..స్క్ర్రిప్ట్‌ కో ఆర్డినేటర్: హరి ,సంగీతం : మిక్కీ జే.మేయర్‌,కెమెరా: విశ్వ సహ నిర్మాతలు : శిరీష్‌ లక్ష్మణ్‌ ,నిర్మాత : దిల్‌రాజు ,దర్శకత్వం : సాయి కిరణ్ అడవి.. ఆగస్ట్ల్‌లో సునీల్‌ సినిమా: సునీల్‌ హీరోగా మా బ్యానర్లో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాము.వాసువర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాను ఆగస్ట్‌లో సెట్స్‌ మీదకు తీసుకురానున్నాము.నాన్‌స్టాప్ ఎంటర్‌టైనర్ గా ఉండే ఈ సినిమా అబ్రాడ్‌లో మొదలై ఇండియాలో పూర్తవుతుంది.మర్యాదరామన్న తరహాలో సునీల్‌కు హీరోగా మంచి పేరును తీసుకువచ్చే చిత్రమిదని దిల్‌రాజు తెలిపారు.

Movie Name : KERINTHA
Banner : Sri Venkateswara Creations
Producer : Raju
Co- Producer : Sirish & Lakshman
Director : Sai Kiran Adavi
Dialogue Writer : Abburi Ravi
Script Co-Ordinator : Hari
Music Director : Mickey J. Mayor
Lyrics : Ramajogayya Sastry
Cinematography : Vishwa
Art Director : RamaKrishna
Choreography : Vijay
Co- Director : Tirupathi

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved