pizza
Laos Motion pictures production No. 1 movie launch
లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం ప్రారంభం!
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 December 2016
Hyderaba
d

లావోస్ మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నోయ‌ల్, శ్రీ ,అర్జున్ మీన‌న్,ఎస్తార్ హీరోహీరోయిన్లుగా కృష్ణ‌మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి సంయుక్తంగా ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి వ‌ద్ద మ‌గ‌ధీర‌, మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన క్రాంతి వడ్ల‌మూడి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం ముహూర్తం ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన `ల ఓ ల్` చిత్ర ద‌ర్శ‌కుడు జ‌గ‌దీష్ త‌ల‌సిల పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నిచ్చారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ...``రాజమౌళి గారి వ‌ద్ద డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌లు చిత్రాల‌కు ప‌ని చేసి ఎంతో అనుభవాన్ని సంపాదించిన క్రాంతి వ‌డ్ల‌మూడి ఓ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్ చెప్ప‌డంతో న‌చ్చి.. ఈ సినిమాను ఈ రోజు మా సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించాం. క‌థకు త‌గ్గ న‌టీటుల‌ను ఎంపిక చేశాము. డిసెంబ‌ర్ 19న తొలి షెడ్యూల్ ప్రారంభించ‌నున్నాం. అలాగే రెండో షెడ్యూల్ జ‌న‌వ‌రి 3 నుంచి ఉంటుంది. రెండు షెడ్యూల్స్ లో సినిమాను కంప్లీట్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు క్రాంతి వ‌డ్ల‌మూడి మాట్లాడుతూ...``స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా సాగే చిత్ర‌మిది. త్వ‌ర‌లో టైటిల్ తో పాటు చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం`` అన్నారు.

నోయ‌ల్, శ్రీ, అర్జున్ మీన‌న్,ఎస్తార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః చేత‌న్ మ‌ధురాంత‌కం; స‌ంగీతంః గీతా పూనిక్; ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, డైలాగ్స్ః టైమ్ నాని; ఆర్ట్ః డి.ర‌మేష్ బాబు; పిఆర్వోః వంగాల కుమార‌స్వామి (బాక్సాఫీస్‌) ;ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బి.సి.చౌద‌రి; నిర్మాత‌లుః కృష్ణ మోహ‌న్, న‌రేన్, శ్రీరామ్ కందుకూరి; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః క్రాంతి వ‌డ్ల‌మూడి

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved