pizza
Lovers Park movie launch
`ల‌వ‌ర్స్ పార్క్‌` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 July 2016
Hyderabad

రెడ్డి మ‌ల్టీప్లెక్స్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో మేడిన్ తెలంగాణ ఫిలింస్ బ్యాన‌ర్‌పై నూత‌న చిత్రం ల‌వ‌ర్స్ పార్క్ శుక్ర‌వారం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది. జ్యోతిరెడ్డి, ఈషా అగ‌ర్వాల్‌, సుమి ఘోష్‌, సిరి, ప్రియాంక ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు విజ‌య్‌రెడ్డి. రెడ్డి మ‌ల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా తొలి స‌న్నివేశానికి సీనియ‌ర్ న‌టి క‌విత క్లాప్ కొట్టారు. ర‌చ‌యిత ఘ‌టికా చ‌లం గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హేమ‌ల‌తా రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. శివ‌కుమార్‌.డి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

సీనియ‌ర్ న‌టి క‌విత మాట్లాడుతూ ``ఇప్పుడు జ‌న‌రేష‌న్‌లో ప్రేమ‌లో విలువ‌లు లేకుండా పోయాయి. కానీ విలువ‌ల‌తో కూడిన ప్రేమ ఎలా ఉంటుంద‌నే కాన్సెప్ట్‌తో ఈ ల‌వ‌ర్స్ పార్క్ చిత్రం రూపొంద‌నుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు`` అన్నారు.

Glam gallery from the event
 

ద‌ర్శ‌కుడు విజ‌య్ రెడ్డి మాట్లాడుతూ ``మినిమ‌మ్ బ‌డ్జెట్‌లో మంచి క్వాలిటీతో కూడిన సినిమాలు చేసి యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికే ఈ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. తెలుగు, త‌మిళంలో సినిమాను రూపొందిస్తాం. ప్రేమ‌లో వాల్యూస్ లేకుండా పోయాయి. అటువంటి వాల్యూస్‌ను గుర్తుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఈ సినిమాలో క‌విత‌, ప్ర‌కాష్ రాజ్ వంటి సీనియ‌ర న‌టీన‌టుల‌తో పాటు నలుగురు హీరోలు, హీరోయిన్స్ న‌టిస్తారు. ల‌వ్‌, రొమాంటిక్ స్టోరీ అయినా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంటుది. ఈ నెల 15నుండి సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం`` అన్నారు.

ఘ‌టికాచ‌లం మాట్లాడుతూ ``క‌థ విన‌గానే సినిమా క‌చ్చితంగా స‌క్సెస్ సాధిస్తుంద‌ని చెప్పాను. చాలా మంచి క‌థ‌. మ‌న తాత‌లు, తండ్రుల‌తో పాటు ఇప్ప‌టి యూత్‌ను ట‌చ్ చేసే చిత్రం`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః ప్ర‌వీణ్(ముంబాయ్‌), ఎడిట‌ర్ః \సోమేశ్వ‌ర్‌, మ్యూజిక్ః నాగు మ‌జాన్‌, రాజ్‌దీప్‌(బాలీవుడ్‌), అసోసియేట్ డైరెక్ట‌ర్ః క‌ల్కి ప్రేమ్‌, చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్ః శాండీ, నిర్మాణంః రెడ్డి మ‌ల్టీప్లెక్స్ మూవీస్, ద‌ర్శ‌క‌త్వంః విజ‌య్ రెడ్డి.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved