pizza
Marana Mrudangam movie launch
ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ హీరోగా మరణమృదంగం ప్రారంభం!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 January 2020
Hyderabad

ఫ్యామిలీ స్టార్ హీరో శ్రీకాంత్ ని యాక్షన్ రివెంజ్ స్టార్ గా చూపిస్తూ లక్ష్మి రెడ్డి రెబ్బ సమర్పణలో మల్టీ కలర్ ఫ్రేమ్స్ బ్యానర్ పై వెంకటేష్ రెబ్బ దర్శకత్వంలోమధు రెబ్బ, చిరంజీవి వబ్బిలిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం"మరణమృదంగం". ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో 27-01-2020 సోమవారం

ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లాప్ నివ్వగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మరణమృదంగం" దర్శకులు

ఎ.కోదండ రామిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటి

సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ... నాకు చాలా ఇష్ట‌మైన టైటిల్‌తో నా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెంక‌టేష్ రెబ్బ మొద‌టిసారి క‌థ చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. ఇప్పుడున్న ట్రెండ్ ని బ‌ట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవ‌కాశాలున్నాయి. ప‌క్కా ప్లానింగ్‌తో అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ పూర్తి చేసి విడుద‌ల చేస్తాం. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన అనిల్‌రావిపూడిగారికి, కోదండ‌రామిరెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు" అన్నారు.

డైరెక్ట‌ర్ వెంక‌టేష్‌రెబ్బ మాట్లాడుతూ... శ్రీ‌కాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయ‌న సినిమాకే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అనే నా అదృష్టంగా భావిస్తున్నాను. రైట‌ర్ తుల‌సీ దాస్‌గారు మంచి క‌థ‌ని అందించారు. నాకు స‌పోర్ట్ చేస్తున్న ప్రొడ్యూస‌ర్ మ‌ధురెబ్బ‌గారికి ధ‌న్య‌వాదాలు" అన్నారు.

ప్రొడ్యూసర్ మ‌ధురెబ్బ‌ మాట్లాడుతూ - "తపన అందరి డైరెక్టర్స్ కి ఉంటుంది కానీ తపనతో పాటు క్రియేటివ్
ఆలోచనలు టెక్నాలజీ పై అవగాహన మేకింగ్ కంఫర్బులిటి కొందరికే ఉంటాయి. అలాంటి దర్శకుడు మా వెంకటేష్ రెబ్బ, అతను చెప్పిన కథ కథనం నచ్చి శ్రీకాంత్ గారితో ఈ సినిమా నిర్మిస్తున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది" అన్నారు.

సాంకేతిక నిపుణులు:
కథ; స్క్రీన్ ప్లే; దర్శకత్వం : వెంకటేష్ రెబ్బ,
నిర్మాతలు : మధు రెబ్బ, వబ్బిలిశెట్టి చిరంజీవి.
సహా నిర్మాతలు : పాల వలన గౌరీ శంకర్, M. N. రాజు
కథ,మాటలు: డి. తులసి దాస్,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు,
డి ఓ పి: G.L.బాబు,
సంగీతం: మంత్ర ఆనంద్,
ఫైట్స్ P.సతీష్,
ఆర్ట్:మధురెబ్బ,
P.R.O. వంశీ శేఖర్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved