pizza
Lime Light productions new film launch
శివ జొన్నల గడ్డ హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ కొత్త చిత్రం ప్రారంభం!!
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 June 2018
Hyderabad

శివ జొన్నలగడ్డ హీరోగా లైం లైట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి వసుంధర సమర్పణలో ప్రొడక్షన్‌ నెం-1 గా ఓ చిత్రం రూపొందుతుంది . టీ. రమేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ద్వారా సురేష్‌ రెడ్డి అక్కల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సభ, లిఖిద హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు ఫిలించాంబర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూబ్లిహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ తొలి సన్నివేశానికి క్లాప్‌నివ్వగా ‘పోలీస్‌ పవర్‌’ నిర్మాత గుద్దేటి బసవప్ప కెమెరా స్విచాన్‌ చేశారు. ప్రసన్నకుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ...‘‘నా చిత్రాల కు దర్శకత్వశాఖలో పని చేసిన నా శిష్య బృందం అంతా కలిసి నాతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా ఓ పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్నా. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉంటాయని’’ అన్నారు.

దర్శకుడు సురేష్‌ రెడ్డి అక్కల మాట్లాడుతూ...‘‘డైరక్టర్‌గా నా తొలి సినిమా ఇది. క్రైమ్‌, లవ్‌, రొమాన్స్‌ తో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఈ నెల రెండో వారం లో షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో , సెకండ్ షెడ్యూల్ బెంగళూరు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ...‘‘జొన్నల గడ్డ శివ వరుసగా సినిమాలు తీస్తూ...తన చిత్రా ద్వారా ఎంతో మంది నూతన కళాకారుల ను పరిచయం చేస్తున్నాడు. తన శిష్య బృందం అంతా కలిసి చేస్తోన్న ఈ ప్రయత్నం ఫలించాని’’ అన్నారు.

‘పోలీస్‌ పవర్‌’ నిర్మాత గుద్దేటి బసవప్ప మాట్లాడుతూ...‘‘జొన్నలగడ్డ శివ వరుస చిత్రాలతో ముందుకెళ్తున్నాడు. తన శిష్య బృందం నిర్మి స్తోన్న ఈ చిత్రం విజయవంతం కావాలని’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు శివరాం, హీరోయిన్స్‌ లిఖిద, సభ పాల్గొని అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు.

శివరాం, చేతన్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: అనిల్‌కుమార్‌, సంగీతం:సాయి, ఎడిటర్‌: అనిల్‌ సందేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సతీష్‌ మట్టా, ప్రొడ్యూసర్‌: టి.రమేష్‌, డైరక్టర్‌: సురేష్‌ రెడ్డి అక్కల.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved