pizza
Sommi films production No.1 film launch
సొమ్మి ఫిలింస్ మూవీ ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 March 2016
Hyderabad

రంజిత్ సొమి, పల్లక్ లల్వాని జంటగా సొమ్మి ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1చిత్రం శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ప్రారంభమైంది. త్రికోటి పేట దర్శకత్వంలో భరత్ సోమి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . తొలి సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి క్లాప్ కొట్టగా, బొత్స సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

నిర్మాత భరత్ సోమి మాట్లాడుతూ ‘’’సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 4 నుండి ప్రారంభమవుతుంది. సినిమా కథ నచ్చడంతో మా తమ్ముడ్ని హీరోగా పెట్టి సోమ్మి ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమా చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.

దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ ‘’ దిక్కులు చూడకు రామయ్యా తర్వాత ఇది నా రెండో సినిమా. నాలుగైదు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ చిత్రం లవ్, యాక్షన్ ఎంటర్టైనర్’’ అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ ‘’ మా బ్యానర్ రూపొందనున్నమొదటి సినిమా. లెజెండ్ సినిమాకు మాటలు అందించిన రత్నం గారు ఈ సినిమాకు కూడా కథ, మాటలు అందించారు. దర్శకుడు త్రికోటి గారిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు.

పలక్ లల్వాని మాట్లాడుతూ ‘’’సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు థాంక్స్. పాజిటివ్, ఎనర్జిటిక్ టీం తో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. నాకు కథ బాగా నచ్చింది. అదే నమ్మకంతో సినిమా చేయడానికి అంగీకరించాను’’' అని చెప్పారు.

రంజిత్ సోమి, పల్లక్ లల్వాని, అర్జున నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, మ్యూజిక్: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: మురళి కొండేటి, నిర్మాత: భరత్ సోమి, దర్శకత్వం: త్రికోటి పేట


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved