సునీల్ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.2 చిత్రం సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రారంభమైంది.ఎన్.శంకర్ దర్శక నిర్మాణంలో రూపొందనుంది. మలయాళ సినిమా టు కంట్రీస్ చిత్రానికి ఇది రీమేక్. తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఈ సినిమా సాంగ్ రికార్డింగ్‌ను ప్రారంభించారు. టీ న్యూస్ ఎం.డి.సంతోష్ కుమార్ స్క్రిప్ట్ అందించారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
హీరో సునీల్ మాట్లాడుతూ - ``టు కంట్రీస్ సినిమా చూడగానే నచ్చింది. మలయాళంలో దిలీప్‌గారు చేసిన సినిమా ఇది. ఆయన సినిమా గతంలో నేను పూలరంగడు పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించాను. ఆయన సినిమాలు అచ్చి రావడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. డిఫరెంట్ కామెడి ఉంటుంది. పూలరంగడు సినిమాకు డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన ఈ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నాడు. అలాగే గోపీసుందర్‌తో తొలిసారి వర్క్ చేస్తున్నాను. మ్యూజిక్ ఫ్రెష్‌గా ఉంటుంది. నా స్టయిల్‌లో ఉంటూ సరదాగా సాగే సినిమా ఇది'' అన్నారు.
గోపీ సుందర్ మాట్లాడుతూ - ''మలయాళ మాతృకకు నేనే మ్యూజిక్ అందించాను. సునీల్‌గారు చేస్తున్న తెలుగు రీమేక్‌కు కూడా నేనే మ్యూజిక్ అందించడం ఆనందంగా ఉంది. శంకర్‌గారితో వర్క్ చేయడం హ్యాపీగా, కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను'' అన్నారు.
శ్రీధర్ సీపాన మాట్లాడుతూ - ''సునీల్‌గారితో పూలరంగడు, భీమవరం భుల్లోడు చిత్రాలు తర్వాత చేస్తున్న మూడో సినిమా. రెండు సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. ఎన్.శంకర్‌గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం. మంచి సంభాషణలు అందించడానికి ప్రయత్నిస్తాను'' అన్నారు.
దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ - ''మా స్నేహితులు చెప్పడంతో మలయాళ సినిమా టు కంట్రీస్ మూవీ చూశాను. నాకు నచ్చడంతో సునీల్‌గారికి యాప్ట్ అవుతుందనిపించి, వారిని కూడా సినిమానోసారి చూడమని అన్నాను. ఆయనకు కూడా విపరీతంగా నచ్చడంతో సినిమా మొదలైంది. దాదాపు అక్కడ 55 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం కామెడి ఎంటర్‌టైన్మెంట్ అయినా అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. దిలీప్‌గారు సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఈ పాత్ర సునీల్‌గారు తప్ప ఎవరూ చేయలేరు. నా సినిమాలన్నీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్. ఇది యూనివర్సల్ మూవీ. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇళయరాజాగారి తర్వాత అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా గోపీసుందర్ కనిపించారు. మాతృతకకు కూడా ఆయనే సంగీతం అందించారు. ఓరిజినల్‌లో కూడా కొన్సి సాంగ్స్‌తో పాటు కొత్త సాంగ్స్ కూడా యాడ్ చేస్తాం. శ్రీధర్‌సీపాన మంచి డైలాగ్స్ రాస్తున్నారు. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సినిమా షూటింగ్ జరుగుతుంది. పదిహేను రోజులు హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తాం. తర్వాత షెడ్యూల్ అవుట్ డోర్‌లో ఉంటుంది. 70 శాతం సినిమా అమెరికాలో చిత్రీకరిస్తాం. రెండు దేశాల మధ్య సున్నితమైన అంశాలతో జరిగే సినిమా. అలాగే ఓరిజినల్ ప్లేవర్ మిస్ కాకుండా స్క్రిప్ట్‌ను బెటర్ మెంట్ చేసి మన నెటివిటీకి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కిస్తాం. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనకు సూత్రధారి రాజారవీంద్ర ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు'' అన్నారు.
ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరాం, టీన్యూస్ సి.ఇ.వో.నారాయణరెడ్డి, రసమయి బాలకిషన్, బి.గోపాల్, క్రాంతిమాధవ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి గోపాలకృష్ణ, కె.అచ్చిరెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: గోపీసుందర్, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.