pizza
Undha Ledha movie launch
‘ఉందా..లేదా..?’ ప్రారంభమైంది
ou are at idlebrain.com > News > Functions
Follow Us

16 May 2016
Hyderabad

రామకృష్ణ, అంకిత హీరో హీరోయిన్లుగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్ పై అమని గంటి వెంకట శివ ప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మించనున్న కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి  భరద్వాజ క్లాప్ కొట్టగా, ప్రతాని రామకృష్ణ గౌడ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

దర్శకుడు అమని గంటి వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ ‘’సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో రూపొందనున్న చిత్రమిది. స్క్రీన్ ఫ్లే బేస్ మూవీ. మంచి టీం కుదిరింది. అలాగే సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మా  ప్రయత్నాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘’దర్శకుడు చాలా కాలంగా పరిచయం. మంచి కథను రాసుకున్నాడు. ఈ పాయింట్ నాకు చెప్పాడు. చెప్పగానే బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో చిన్న చిత్రాలు చాలా వరకు సక్సెస్ సాధించాయి. అలాగే ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Ankitha Glam gallery from the event

 

నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ ‘’ఈ నెలాఖరున సినిమా రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. ట్రెండ్ సెట్ చేస్తుందని భావిస్తున్నాం’’ అన్నారు.

హీరో రామకృష్ణ మాట్లాడుతూ ‘’చాలా మంచి కథతో రూపొందనున్న చిత్రంలో నటించనుండటం హ్యపీగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ అంకిత ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: నందు జెన్నా, మ్యూజిక్: శ్రీమురళి, సినిమాటోగ్రఫీ:  ప్రవీణ్ కె.బంగారి, నిర్మాత: అయితం ఎస్.కమల్, కథ, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్. 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved