pizza
Shruthilaya Arts Academy - Navarasa Raya award presented to Naresh
ప్రముఖ నటుడు నరేష్ కు ‘అక్కినేని-శృతిలయ’ వెండి కిరీటం, ‘నవరసరాయ’ సత్కారం
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 September 2015
Hyderaba
d

మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నురవీంద్రభారతిలోని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు నరేష్ కు అక్కినేని-శృతిలయ వెండి కిరీటం, నవరసరాయ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ముఖ్య అతిథిగా మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమం సినిమా. ఒకప్పుడు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. శంకరాభరణం వంటి ఎన్నో గొప్ప సినిమాలు మన సంస్కృతిని దేశదేశాలకు వ్యాప్తి చేశాయి. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నరేష్ ను అక్కినేని పేరిట సత్కరించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. సతీసమేతంగా ఈ కార్యక్రమంలో నరేష్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్,జయసుధ, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, కోదండరామిరెడ్డి, సురేష్ కొండేటి, జె.వి.రాజు, ఆర్.ఎన్.సింగ్ తదితరులు పాల్గొన్నారు


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved