pizza
Hyderabad Love Story Platinum Disc Function
‘హైదరాబాద్ లవ్ స్టోరి’ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్
ou are at idlebrain.com > News > Functions
Follow Us

09 May 2016
Hyderabad

ఎస్.పద్మజ సమర్పణలో ఎస్.ఎన్.ఆర్.ఫిల్మ్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, రేష్మి మీనన్, జియా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం హైదరాబాద్ లవ్ స్టోరి. రాజ్ సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న సందర్భంలో చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో ..,

సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘’నాకు నిర్మాత ఎస్.ఎన్.రెడ్డితో మంచి పరిచయం ఉంది. మేమిద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాం. ఇప్పుడు ఇద్దరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాం. ఈ సినిమా రాహుల్ కు మంచి బ్రేక్ రావాలి. దర్శకుడు రాజ్ సత్య కష్టం తెరపై కనపడుతుంది. విజువల్ గా సినిమా చాలా గ్రాండ్ గా ఉంది. తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ‘’మంచి టీంతో కలిసి వర్క్ చేశాను. ఈ బ్యూటీఫుల్ ఎక్స్ పీరియెన్స్ ను మరచిపోలేను. నిర్మాత రెడ్డిగారు క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. వచ్చే నెల సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సునీల్ కశ్యప్ పాటలకు మంచి ఆదరణ లభించింది. అలాగే ఇప్పుడు సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

సునీల్ కశ్యప్ మాట్లాడుతూ ‘’డైరెక్టర్ రాజ్ సత్య చాలా కష్టపడ్డారు. పక్కా ప్లానింగ్ తో సినిమాను రూపొందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి మ్యూజిక్ కుదిరింది నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

Manisha Tagore interview gallery

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘’పాటలు చూశాను. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టు తెలుస్తుంది. రాహుల్ రవీంద్రన్ చాలా అందంగా కనపడుతున్నాడు. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి యూనిట్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘’సినిమా తీయడం కంటే పబ్లిసిటీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి, కరెక్ట్ టైంలో సినిమాను విడుదల చేసుకోవాలి. అలా ఎలా చిత్రంతో సక్సెస్ కొట్టిన రాహుల్ ఈ చిత్రంతో మరో సక్సెస్ ను అందుకుంటాడు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్, మనీష్ ఠాగూర్, అచ్చిబాబు, దర్శకుడు రాజ్ సత్య తదితరులు పాల్గొని చిత్రయూనిట్ ను అభినందించారు.

సి.కల్యాణ్ చిత్రయూనిట్ కు ప్లాటినం డిస్క్ లను అందించారు.

రావు రమేష్, తాగుబోతు రమేష్, అంబటి శ్రీను, చంటి, రమా ప్రభ, మధుమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బి.వి.అమర్ నాథ్ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహ నిర్మాత: ఎస్.శ్రీ లక్ష్మి, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి, రచన-దర్శకత్వం: రాజ్ సత్య.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved