సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే కీలక పాత్రల్లో నటించిన సినిమా కృష్ణాష్టమి. వాసువర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో ఆదివారం జరిగింది.
దిల్ రాజు మాట్లాడుతూ ``స్టార్ హీరో నటించే సత్తా ఉన్న కథ ఇది. సునీల్ సినిమాకు కావలసిన అంశాలను జోడించాం. సినిమా ఎలా వచ్చిందని దర్శకుడు అడిగితే బొటనవేలు చూపించాను. సునీల్‌కి లైన్ చెప్పినప్పుడు వెంటనే చేద్దాం అన్నాడు. తర్వాత వాసువర్మకి ఈ కథ చెప్తే కాదనలేక విన్నాడు. ఇందులో ఏదో మిస్ అయిందని ఆరు నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసి పూర్తి కథను తయారు చేశాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే వాసు వర్మ కూడా ఓ కారణం. కెరీర్ ప్రారంభంలో నా సూపర్‌హిట్టైన 'దిల్', 'ఆర్య', 'బొమ్మరిల్లు' సినిమాలకు నా పక్కనే ఉన్నాడు. అతనిలో గొప్ప రచయిత ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటాడు. 2.50 నిమిషాల అవుట్‌పుట్‌ని 2.15 నిమిషాలకు కుదించాం. బెటర్ అవుట్‌పుట్ కోసం సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి సలహా తీసుకున్నాం. డబ్బింగ్ సమయంలో ప్రీ క్లైమాక్స్‌లో ఏదో వెలితిగా ఉందని డబ్బింగ్ ఇంజనీర్ పప్పు చెప్పిన సలహా కూడా పాటించాం. ఈ నెల 19న విడుదల కాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఆ సంస్థకు మంచి పేరు తీసుకొస్తుంది'' అని అన్నారు.
Nikki Galrani Glam gallery from the event
సునీల్ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదేమో. ఇందులో చాలా అనందంగా కనిపిస్తాను. కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. మనిషి పుట్టాడంటే ఇంటెలిజెంట్‌గా పుట్టాలి. లేదంటే వాసువర్మలాంటి ఇంటెలిజెంట్ ఫ్రెండ్ అయినా ఉండాలి. నా కెరీర్ మంచి సినిమా ఇచ్చాడు. మర్యాద రామన్న సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో..ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను'' అని అన్నారు.
వాసువర్మ మాట్లాడుతూ ''సినిమా హిట్ అవుతుందా లేదా అన్నది దిల్ రాజుగారి ఎక్స్‌ప్రెష న్‌తో చెప్పేయొచ్చు. 'జోష్' సినిమా చూశాక 'సార్ ఏంటి పరిస్థితి అని అడగగానే ఏవరేజ్ సినిమా' అని చెప్పారు. రిలీజ్ అయ్యాక అదే నిజమైంది. ఈ సినిమా చూసి ఆయనెంతో ఆనందంగా ఉన్నారు. ఎలా ఉందని అడిగితే నవ్వుతూ సక్సెస్ సింబల్ చూపించారు. మా అందరి నమ్మకం కూడా అదే. హిట్ సినిమాకు కావలసిన అన్నీ సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. సునీల్ కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. సినిమా బెటర్‌మెంట్ కోసం ఆర్టిస్ట్‌లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కానీ కొందరు నిర్మాతలు అందుకు సహకరించరు. దిల్‌రాజు ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం ఎంత ఖర్చైనా చేస్తారు'' అని అన్నారు.
దినేష్ మాట్లాడుతూ ``దిల్‌రాజుగారి అభిరుచికి తగ్గ పాటలు కుదిరాయి`` అని అన్నారు.
నిక్కీ గల్రాని, గౌతంరాజు, ఛోట.కె.నాయుడు, అనంతశ్రీరామ్, దినేష్, పృథ్వీ తదితరులతోపాటు సినిమా యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.