pizza
Naga Shourya's Nee Jathaleka Platinum Disc Function
'నీ జతలేక' ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 July 2016
Hyderaba
d

నాగశౌర్య, పారుల్‌, సరయు హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'నీజతలేక'. స్వరాజ్‌ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చిందని చిత్రయూనిట్‌ బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

నిర్మాత జి.వి.చౌదరి మాట్లాడుతూ '' మా బ్యానర్‌లో వస్తున్న తొలి చిత్రం. పాటలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. అలాగే సినిమా చాలా బాగా వచ్చింది. ఆడియో తరహాలోనే సినిమా కూడా మంచి సక్సెస్‌ను సాధిస్తుందని భావిస్తున్నాను. స్వరాజ్‌ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. సపోర్ట్‌ చేసిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత నాగరాజ్‌ గౌడ్‌ మాట్లాడుతూ '' స్వరాజ్‌ సంగీతంలో పాటలు మంచి సక్సెస్‌ను సాధిచడం సంతోషంగా ఉంది. దర్శకుడు లారెన్స్‌ దాసరి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. పాటలులాగానే సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు లారెన్స్‌ దాసరి మాట్లాడుతూ '' నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌గారికి థాంక్స్‌. అలాగే స్వరాజ్‌ నా కథకు తగిన విధంగా మంచి సంగీతాన్ని అందించారు. నాగశౌర్య, పారుల్‌, సరయులు చక్కగా యాక్ట్‌ చేశారు. సినిమాను కూడా ఇలాగే పెద్ద సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

ప్రతాని రామకృష్ణా గౌడ్‌ మాట్లాడుతూ '' సినిమా పాటలు బావున్నాయి. రేపు సినిమా కూడా ఇలాగే ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం'' అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ '' స్వరాజ్‌గారు మంచి సంగీతం అందివ్వగా, బుజ్జిగారు మంచి సినిమాటోగ్రఫీని అందించారు. సినిమాలో పాటలకు మంచి ఆదరణ లభినందుకు హ్యపీగా ఉంది. రేపు సినిమాను కూడా అలాగే సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాం. దర్శకుడు లారెన్స్‌ దాసరిగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సాయివెంకట్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్‌ సరయు, సినిమాటోగ్రాఫర్‌ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యూనిట్‌ సభ్యులకు ప్లాటినమ్‌ డిస్క్‌లను అందజేశారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved