pizza
Aame poster launch
`ఆమె`పోస్ట‌ర్ లాంచ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


11 July 2019
Hyderabad

సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ఆమె. `ఆడై` సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అమ‌లా పాల్ బోల్డ్ లుక్ కూడా సంచ‌ల‌నం సృష్టించింది. జులై 19న ఆమె సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌దీప్ కుమార్ ఆమె చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విజ‌య్ కార్తిక్ క‌న్న‌న్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ ఈ చిత్ర తెలుగు హ‌క్కులను సొంతం చేసుకున్నారు. చ‌రిత‌ చిత్ర ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో `ఆమె` చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పోస్ట‌ర్‌ను హీరో శ్రీకాంత్ హైద‌రాబాద్‌లో గురువారం విడుద‌లచేశారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ``ఈ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తుంటే నాకు 25 ఏళ్ల క్రితం వెన‌క్కి వెళ్లిన‌ట్టు అనిపిస్తుంది. నాకు మంచి జీవితాన్ని ఇచ్చిన చిత్రం `ఆమె`. చ‌రితచిత్ర ద్వారా నేను హీరోగా అయ్యాను. ఆ బ్యాన‌ర్‌లో యాక్టివ్‌గా సినిమాలు చేయ‌మ‌ని త‌మ్మారెడ్డిగారికి చాలా సార్లు అడ‌గాను. ఇప్పుడు డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రం `ఆమె`తో ఆయ‌న సిద్ధంగా వ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని చెప్పారు.

నందినిరెడ్డి మాట్లాడుతూ ``ఇండ‌స్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్య‌క్తి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌గారు. ఆయ‌న తీసుకున్న ఆమె చిత్రాన్ని చూశాను. ప్ర‌తి షాటూ హాంటింగ్‌గా అనిపించింది. ప్ర‌తిషాట్‌లోనూ ద‌ర్శ‌కుడు క‌నిపిస్తున్నారు. తెలుగు, సినిమా, త‌మిళ సినిమా కంటెంట్లు ఇప్పుడు చాలా బాగా ఉంటున్నాయి. హీరోయిన్లు కూడా కంటెంట్ల‌ను న‌మ్మి సినిమాలు చేస్తున్నారు. స‌మంత‌, అమ‌లాపాల్‌, న‌య‌న‌తార‌, అనుష్క వంటివారంద‌రూ భావి త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు`` అని అన్నారు.

త‌మ్మారెడ్డి మాట్లాడుతూ ``1979లో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను. ఆమె చేసిన శ్రీకాంత్ 25 ఏళ్లు వెన‌క్కి తిరిగి చూసుకున్నాడు. 70 ఏళ్ల క్రితం సుశీల‌గారు పాడిన ఓ పాట‌ను ఈ సినిమా కోసం మ‌ళ్లీ ఆమెతోనే పాడించామ‌ని మా ద‌ర్శ‌కుడు చెబుతున్నారు. నేను మా చ‌రిత చిత్ర ప‌తాకంపై కోత‌ల‌రాయుడు, మొగుడు కావాలి అంటూ చాలా సినిమాలు చేశాను. చిరంజీవి, సుమ‌న్‌, భానుచంద‌ర్‌, శ్రీకాంత్‌, విద్యాసాగ‌ర్‌, మిక్కీ.జె.మేయ‌ర్‌, మాల‌తి... ఇలా చాలా మంది మా సంస్థ నుంచి వ‌చ్చారు. ఈ 40 ఏళ్ల‌ల్లో ఎన్నో సినిమాలు చేశాం. కానీ నేను `ఆమె`ను చూసి షాక్ అయ్యాను. క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అవుతుంద‌నుకుని ముందు సినిమాలో దిగాం. కానీ చూశాక అస‌లు ఈ క‌థ ద‌ర్శ‌కుడు ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? నిర్మాత ఎలా తీశాడు? వ‌ంటివ‌న్నీ ఆలోచించా. ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా ప్యాష‌న్ ఉండాలి. అది లేనివారు దీన్ని గురించి ఆలోచించ‌డానికి కూడా భ‌య‌ప‌డుతారు. నేను అమ‌లాపాల్ పెర్ఫార్మెన్స్ చూసి షాక‌య్యాను. ఈ జ‌న‌రేష‌న్‌లో ఇంత గొప్ప‌గా పెర్ఫార్మ్ చేసిన వాళ్లు లేరు. ఈ సినిమా చేస్తున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా. నేను ఇప్ప‌టిదాకా మ‌హిళా ఓరియంటెడ్ సినిమాలు,సోష‌ల్ మెసేజ్ ఉన్న సినిమాల‌నే ఎక్కువ‌గా తీశాను. అలాంటి నా జీవితంలో మ‌ర్చిపోలేని చిత్రంగా `ఆమె` మిగులుతుంది. అమ్మాయిలు ధైర్యంగా ముంద‌డుగు వేస్తున్న‌ప్పుడు ప్ర‌శంసించాల్సిన స్థాయిలో ఉన్నాం. అది వ‌దిలిపెట్టి ప్ర‌తిదానికీ అమ్మాయిల‌ను ట్రోల్స్ చేయ‌డం స‌రికాదు`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నాకు తెలుగులో గోవింద గోవింద అని భ‌గ‌వ‌న్నామ స్మ‌ర‌ణ‌, హైద‌రాబాద్ బిర్యానీ త‌ప్ప ఇంకేమీ తెలియ‌దు. అలాంటి నేను తీసిన సినిమా తెలుగులో విడుద‌ల‌వుతున్నందుకు ఆనందంగా ఉంది. మా సినిమాను ఓ సెన్సార్ బోర్డు లేడీ చూసి మెచ్చుకున్నారు. అంత సెన్సిబుల్ సెన్సార్ బోర్డు మ‌న ద‌గ్గ‌ర ఉన్నందుకు ఆనందంగా ఉంది. జులై 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని అన్నారు.

అమ‌లాపాల్ మాట్లాడుతూ ``అబ‌ద్ధాల‌ను, ఫార్ములా సినిమాల‌ను చేసి బోర్ కొడుతున్న స‌మ‌యంలో ఈ ఇండ‌స్ట్రీ నుంచి వెళ్లిపోదామా అని కూడా అనిపించింది. కానీ అలాంటి స‌మ‌యంలో నాకు ఈ స్క్రిప్ట్ వ‌చ్చింది. చ‌దివి ఇంగ్లిష్ సినిమాకు కాపీ ఏమోన‌ని అనుకున్నా. చాలా ధైర్యంగా న‌టించాను. ఈ సీన్ చూసి అనురాగ్ క‌శ్య‌ప్‌గారు అన్న మాట‌ల‌ను అంత తేలిక‌గా మ‌ర్చిపోలేను. ఇందులో న‌గ్న‌త్వం క‌న్నా, నా క‌ళ్ల‌ల్లో ఎక్కువ బాధ క‌నిపించింద‌ని ఆయ‌న అన్నా మాట‌ల‌ను మ‌ర్చిపోలేను. మ్యాడ్ మ్యాక్స్ టీమ్ ఈ సినిమాకు ప‌నిచేశాం. మా నిజాయ‌తీని ప్ర‌శంసిస్తార‌ని ఆశిస్తున్నా`` అని అన్నారు.

న‌టీన‌టులు: అమ‌లా పాల్
టెక్నిక‌ల్ టీం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: ర‌త్నకుమార్
నిర్మాత‌లు: రాంబాబు క‌ల్లూరి, విజ‌య్ మోర‌వెనేని
స‌హ నిర్మాత‌: J. ఫ‌ణీంద్ర కుమార్
సంగీతం: ప‌్ర‌దీప్ కుమార్, ఊర్క‌
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్
మాట‌లు: రాజేష్ A మూర్తి
లిరిక్స్: భువ‌న చంద్ర
సౌండ్ డిజైన్: స‌ంప‌త్ అల్వార్ (MPSE)
సౌండ్ మిక్స్: T. ఉద‌య్ కుమార్
ఆర్ట్ డైరెక్ట‌ర్: విదేశ్
స్టంట్స్: స‌్ట‌న్న‌ర్ స్యామ్
కాస్ట్యూమ్ డిజైన‌ర్: క‌విత J
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: అముధ‌న్ ప్రియ‌న్
క‌ల‌రిస్ట్: G బాలాజీ
VFX ప్రొడ్యూస‌ర్: హ‌రిహ‌ర‌సుథ‌న్
డాన్స్ కొరియోగ్ర‌ఫ‌ర్: M ష‌రీఫ్, అబు

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved