09 June 2016
Hyderabad
విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలో, శతాబ్ది టౌన్ షిప్ సమర్పణలో 35 మంది సినీ మరియు టీవీ నటీమణులతో మొట్టమొదటిసారిగా కెవ్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. టీవి డైరెక్టర్ కె.విక్రమాదిత్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శతాబ్ది టౌన్ షిప్ అధినేత కె.శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా..
కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ''విక్రమాదిత్య చెప్పిన ఐడియా నచ్చడంతో ఈ కెవ్ కబడ్డీ కార్యక్రమాన్ని మేమే స్పాన్సర్ చేయాలనుకున్నాం. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. టీవీ ఆర్టిస్ట్స్ తో కబడ్డీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. జూలై నెలలో ఈ పోటీలను నిర్వహించాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
నటి కవిత మాట్లాడుతూ.. ''ఈ కబడ్డీ పోటీలకు నేను ఒక మెంటర్ గా వ్యవహరించడం ఆనందంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీభాయ్, రాణి రుద్రమదేవి, మాంచల, రజియా సుల్తానా ఇలా మంచి పేర్లతో టీంలను ఫాం చేస్తున్నారు'' అని చెప్పారు.
నటి శ్రుతి మాట్లాడుతూ.. ''లేడీ ఆర్టిస్ట్స్ అందరూ కలిసి కబడ్డీ ఆడడం జనరంజకంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. స్పోర్ట్స్ లో కూడా ఆర్టిస్ట్స్ ముందు ఉంటారని నిరూపించుకోవడమే మా ఉద్దేశ్యం'' అని చెప్పారు.
ప్రభాకర్ మాట్లాడుతూ.. ''విక్రమ్, శ్రీవాణిలు చాలా కష్టపడి ఎదుగుతున్నారు. యాక్టింగ్, డాన్స్ ఇన్స్టిట్యూట్ లను స్థాపించారు. కెవ్ కబడ్డీ అనే మరో ఆలోచనతో ప్రేక్షకులను అలరించనున్నారు'' అని చెప్పారు.
శ్రీవాణి మాట్లాడుతూ.. ''నా భర్త విక్రమ్ కు వచ్చిన ఆలోచన ఇది. మేము ఈ ఐడియా చెప్పగానే మాకు సపోర్ట్ చేస్తున్న లేడీ ఆర్టిస్ట్స్ అందరికీ మా కృతజ్ఞతలు'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో విక్రమ్, జ్యోతి రెడ్డి, నవీన, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.