pizza
Super Rhymes poster launch
`సూప‌ర్‌రైమ్స్` పోస్ట‌ర్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 July 2016
Hyderabad

ఎక్సెల్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో వాజిద్ ఖాన్ నిర్మాత‌గా రామ్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిన్న‌పిల్ల‌ల రైమ్స్ ఆధారంగా నిర్మించ‌బడుతున్న ఇండిపెండెంట్ ఫిలిం `సూప‌ర్‌రైమ్స్‌`. ఈ సినిమా పోస్ట‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఆడిష‌న‌ల్ డిజిపి శంక‌ర స‌త్య‌నారాయ‌ణ‌ ఈ సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం ...

శంక‌ర స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ``ఈ సినిమా పోస్ట‌ర్ చూడ‌గానే చాలా థ్రిల్‌గా ఫీల‌య్యాను. మ‌న భావిభార‌త పౌరులైన పిల్ల‌ల‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. పిల్ల‌ల‌కే కాదు, పెద్ద‌వారికి కూడా సినిమా న‌చ్చే విధంగా ఉంది. ఇలాంటి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను అభినందిస్తున్నాను`` అన్నారు.

చిత్ర నిర్మాత వాజిద్ ఖాన్ మాట్లాడుతూ ``యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. చిన్న‌పిల్ల‌ల‌తో పాటు అంద‌రినీ న‌చ్చే చిత్ర‌మవుతుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు రామ్‌రెడ్డి ప‌న్నాల మాట్లాడుతూ ``సాధార‌ణంగా మ‌నం టెన్ష‌న్‌గా ఉన్న‌ప్పుడు చిన్న‌పిల్ల‌లను చూస్తే టెన్ష‌న్ పోతుంది. అలాంటి చిన్న‌పిల్ల‌ల‌పై యూనిక్ పాయింట్‌తో సినిమా చేద్దామ‌ని నిర్మాత వాజిద్ ఖాన్‌గారిని క‌లిస్తే ఆయ‌న‌కు కూడా పాయింట్ న‌చ్చ‌డంతో ఎంతో ఎంక‌రేజ్ చేశారు. ఇంత వ‌ర‌కు రాని స‌రికొత్త థీమ్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. ఇది పిల్ల‌ల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చే పాయింట్‌. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి, సూప‌ర్‌రైమ్స్‌ను డివిడిల రూపంలో మార్కెట్లోకి విడుద‌ల చేస్తాం`` అన్నారు.

ఈ చిత్రానికి కెమెరాః సి.హెచ్‌.మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీః కిర‌ణ్‌, ఎడిటింగ్ః సంతోష్ నాయుడు, నిర్మాతః వాజిద్ ఖాన్‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్‌రెడ్డి ప‌న్నాల‌.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved