pizza
Amar Akbar Anthony pre release function
`అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


10 November 2018
Hyderabad

మాస్ మ‌హారాజా రవితేజ, ఇలియానా జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌(సి.వి.ఎం) నిర్మిస్తోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. నవంబర్‌ 16న సినిమా విడుదలవుతుంది. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ర‌వితేజ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశౄరు. ఈ కార్యక్రమంలో

మాస్‌ మహారాజా రవితేజ మాట్లాడుతూ - ''ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. శ్రీనువైట్ల సినిమా అంటే అలాగే ఉంటుంది. సినిమా షూటింగ్‌లో మేం ఎంత ఎంజాయ్‌ చేస్తూ చేశామో, రేపు సినిమాను స్క్రీన్‌పై చూసి మీరు అంతే ఎంజాయ్‌ చేస్తారు. శ్రీనువైట్లతో తొలిసారి 'నీకోసం' వంటి ఎమోషనల్‌ లవ్‌స్టోరీ చేశాను. ఆ తర్వాత వెంకీ, దుబాయ్‌శీను వంటి ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్స్‌ చేశాను. వెంకీ, దుబాయ్‌శీను కలయికే అమర్‌ అక్బర్‌ ఆంటోని. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య, వెన్నెలకిశోర్‌ కామెడీని డబ్బింగ్‌ చెప్పేటప్పుడే నేను బాగా ఎంజాయ్‌ చేశాను. అంతలా మీకు నచ్చుతుంది. థమన్‌తో ఇది నాకు తొమ్మిదో సినిమా. హిట్‌కి, ప్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్‌హిట్‌ మ్యూజిక్కే ఇస్తాడు తను. తనతో నా జర్నీ ఇలాగే కంటిన్యూ కావాలి. రైటర్‌ వంశీకి మంచి భవిష్యత్‌ ఉంటుంది. రచయిత బాలాజీకి ఆల్‌ ది బెస్ట్‌. ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాశ్‌, అనిల్‌గారికి థాంక్స్‌. మైత్రీ మూవీ మేకర్స్‌తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. వీళ్లతో ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. అంత మంచి ప్రొడక్షన్‌ హౌస్‌ ఇది. ఇలియానా డార్లింగ్‌. ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. శ్రీనువైట్లకున్న కామెడీ, సెన్సాఫ్‌ హ్యుమర్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సూపర్‌గా ఉంటుంది. అతను చేసి చూపించిన దాంట్లో 50 శాతం మేం చేస్తే చాలు మాకు చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌లో తనే కనపడతాడు. తనకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌. మా సినిమాటోగ్రాఫర్‌ వెంకట్‌ దిలీప్‌గారు అద్భుతమైన విజువల్స్‌ అందించారు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

డైరెక్టర్‌ శ్రీనువైట్ల మాట్లాడుతూ - '' కథను నేను, వంశీ రెండు నెలలు పనిచేసి ఓ షేప్‌కు తీసుకొచ్చాం. మాతో పాటు ప్రవీణ్‌, ప్రవీణ్‌ వర్మ అనే మరో ఇద్దరు కలిసి ఎనిమిది నెలలు స్క్రిప్ట్‌ను తయారు చేయడానికి కష్టపడ్డాం. స్క్రిప్ట్‌ మేకింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం. ఈ జర్నీని బాగా ఎంజాయ్‌ చేశాం. ప్రయాణం బావుంటే ఫలితం కూడా బావుంటుందని నమ్మే వ్యక్తుల్లో నేనూ ఒకడి. ప్రేక్షకులు సినిమాను ఆశీర్వదిస్తారనే నమ్మకం హండ్రెడ్‌ పర్సెంట్‌ ఉంది. రవితేజ.. నాకు ట్రబుల్‌ షూటర్‌. నేను డల్‌గా ఉన్నప్పుడు నాకు ఎనర్జీనిచ్చి నన్ను ముందుకు తీసుకొస్తుంటాడు. అలా తను వెంకీ, దుబాయ్‌ శీను సినిమాలకు చేశాడు. ఇప్పుడు అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాకు కూడా చేశాడు. తనకు నాపై ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రవితేజ ఇచ్చిన ఎనర్జీతో ఈ సినిమా చేశాను. తన సపోర్ట్‌తో కొన్ని చాలెంజ్‌లు చేశాం. అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయడానికి కారణం నిర్మాతలే. సినిమాను రెండు సీజన్స్‌లో చేశామంటే నిర్మాతలే కారణం. వారి సహకారం ఎంతో ఉంది. నేను చేసిన సినిమాల్లో లగ్జరీగా చేసిన సినిమా ఇది. వెంకట్‌ అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు. తమన్‌ ఎక్స్‌ట్రార్డినరీ పాటలతో పాటు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఇచ్చాడు. ప్రకాశ్‌ అద్భుతమైన సెట్స్‌ వేశాడు. అలాగే అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. ఇలియానా బ్రిలియంట్‌ పెర్ఫామర్‌. చాలా బాగా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్‌, రవిశంకర్‌, మోహన్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ - ''రవితేజ, శ్రీనువైట్లగారు మా బ్యానర్‌లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. వారికి థాంక్స్‌. ఆరేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతో కమ్‌ బ్యాక్‌ అయ్యింది. ఆమె మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాం. కెమెరామెన్‌ వెంకట్‌, తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. శ్రీనువైట్లగారి స్టయిల్లో టోటల్‌ ఎంటర్‌టైనర్‌. మూవీని ఎక్కువ భాగం యు.ఎస్‌లోనే చేశాం. డైరెక్టర్‌గానే కాదు.. ప్రొడ్యూసర్‌రోల్‌ను కూడా శ్రీనువైట్లగారే తీసుకుని బడ్జెట్‌ను ఎంతో కంట్రోల్‌గా చేశారు. విజువల్‌గా సినిమాను ఎంతో రిచ్‌గా తెరకెక్కించారు. ఎక్కడా వేస్టేజ్‌ ఉండదు. నవంబర్‌ 16న సినిమా విడుదలవుతుంది. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

హీరోయిన్‌ ఇలియానా మాట్లాడుతూ - ''ఈ సినిమాలో శ్రీనువైట్లగారు అడిగారని సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పాను. తెలుగు ప్రేక్షకులను ఎంతో మిస్‌ అయ్యాను. నాపై నమ్మకం ఉంచిన శ్రీనువైట్లగారికి థాంక్స్‌. రవితేజ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయనతో ఎన్నో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అమర్‌ అక్బర్‌ ఆంటోని అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ ''రవితేజ, ఇలియానా 'కిక్‌' అనే సినిమా ఎంత కిక్‌ ఇస్తుందో.. శ్రీనువైట్ల చేసిన 'వెంకీ' ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో అమర్‌ అక్బర్‌ ఆంటోని వాటికి మూడు రెట్లు ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్‌కి అభినందనలు. రవితేజ, శ్రీను సినిమా అంటే అందరికీ ఎంటర్‌టైన్‌మెంటే గుర్తుకు వస్తుంది. శ్రీనువైట్లకి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. రవితేజకి ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ మాట్లాడుతూ - ''వంద సినిమాలకు సంగీతం చేశానంటే రవితేజగారిచ్చిన కిక్కే కారణం. ఐదారు సినిమాలకు ఒకసారి రవితేజగారి సినిమా చేస్తాను. ఆయన శరీరంలో రెడ్‌బుల్‌ నింపేసి వెళ్లిపోతుంటారు. ఆయన కిక్‌ ..ధైర్యం.. నమ్మకం..బలం వల్లే ఇన్ని సినిమాలు చేయగలిగాను. వంద సినిమాల్లో ఎక్కువ సినిమాలు పనిచేసింది రవితేజగారితోనే. అలాగే శ్రీనువైట్లగారితో ఐదు సినిమాలు చేశాను. ఇంత కంటే అదృష్టం ఏం కావాలి. రవితేజను మాస్‌ మహారాజా అని కాకుండా మనసున్న మహారాజ్‌ అని పిలుస్తుంటాను. శ్రీనువైట్లగారంటే నాకెంతో ఇష్టం. ఆయనతో చేసిన ఆల్బమ్స్‌ ఎప్పుడూ మిస్‌ కాలేదు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

తారాగణం:

రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..

సాంకేతిక నిపుణులు :

స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
కథ : శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM)
సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సీఈఓ : చెర్రీ
డీఓపీ : వెంకట్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved