pizza
Aranya Pre Release function
`అరణ్య` సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది - విక్ట‌రి వెంక‌టేష్‌.
You are at idlebrain.com > News > Functions
Follow Us


21 March -2021
Hyderabad

Proud of Making A Film Like Aranya: Rana Daggubati

Eros International's Latest Multilingual film, Haathi Mere Sathi is releasing as Aranya in Telugu. The movie hits the marquee on 26th of this month across the globe. Victory Venkatesh and Director Sekhar Kammula have attended the Pre-release event of the film in Hyderabad:

Speaking at the event, Venkatesh said, "I watched the film yesterday and I am bowled over by the film. It is a film that has come at the right time teaching the importance of co-existence with the nature. I thank Prabhu Solomon for it. I am really proud of the way Rana has come all this way. His performance is stunning felt if I am looking at Rana. I am stunned and he is outstanding in the film. Everyone got immersed in their characters and the story".

Rana Daggubati said, "We will transport you to a rain forest on 26th. During the course of making this film, I have transformed into a better human being. I am proud of doing such a film which will showcase the ill-effects of Urbanization on elephants and jungles. We are planning Special Premieres for the press ahead of the film".

Sekhar Kammula said, "Rana is as disciplined as his grand father right from the start of his career. He is always humble. He always had a great vision for Telugu Cinema. It is amazing how he emerged as an actor since his debut film, Leader. Aranya seems to have been made on international standards. It seems like a film watchable by everyone in a family".

 

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రీయ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ పార్క్ హ‌యాత్ హోట‌ల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. ముఖ్య అతిథిగా హాజ‌రైన విక్ట‌రి వెంక‌టేష్ అర‌ణ్య మూవీ స్పెష‌ల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు శేఖ‌ర్ క‌మ్ముల‌, రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, హీరోయిన్ జోయా హుస్సేన్‌, మాట‌ల ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా పాల్గొన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శాంతను వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ–‘‘ ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాం. లైవ్‌ యాక్షన్‌ షూట్‌ చేశాం. ఈ సినిమా ఒకే సారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అరణ్య వంటి ఓ వినూత్న సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది`` అన్నారు

సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌ ఫూకుట్టి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ–‘‘సమకాలిన పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుంది అరణ్య సినిమా. ఇందులో డీ గ్లామరస్‌ రోల్‌ అయినా రానా అద్భుతంగా చేశారు. డైరెక్టర్‌ బాగా తీశారు. ఈ సినిమా కోసం టీమ్‌ అందరం ఎంతో కష్టపడ్డాం. మా కష్టాన్ని ప్రేక్షకులు ఆదరించి, సినిమాను హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

డైరెక్టర్‌ ప్రభు సాల్మన్ వీడియో సందేశం ద్వారా‌ మాట్లాడుతూ – ‘‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రేపు థియేట‌ర్ల‌లో అరణ్య సినిమా మాట్లాడుతుంది. రానా, విష్ణువిశాల్, పుల్‌కిత్‌ సామ్రాట్, జోయా, శ్రీయాలతో పాటుగా దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ సాంకేతిక నిపుణులకు కూడ ధన్యవాదాలు. ముఖ్యంగా సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్, శాంతనులకు థ్యాంక్స్‌. ప్రకృతి, ఏనుగులు వంటి వాటిపై అరణ్య వంటి ఓ సినిమా తీసేందుకు సపోర్ట్‌ చేసిన ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థకు థ్యాంక్స్‌`` అన్నారు

రచయిత సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ – ‘‘అరణ్య’ సినిమా టీజర్‌ ట్రైలర్‌ చూస్తుంటే సినిమా రేంజ్‌ ఏంటో అర్థమైపోతుంది. ప్రాణం, మనసుపెట్టి చేస్తే కానీ ఇలాంటి సినిమాలు రావు. రానా తన జీవితాన్ని మర్చిపోయి ఈ సినిమాలోని పాత్రలో జీవించాడు. అరణ్య సినిమా సూపర్‌హిట్‌ కావాలి. ఇలాంటి డిఫరెంట్‌ సినిమాలు వచ్చేందకు అరణ్య ఓ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. నేను మాటలు రాసిన తొలి సినిమా కృష్ణం వందే జగద్గురుమ్‌లో రానా హీరో. నేను రాసిన మొదటి డైలాగ్స్‌ను పలికిన హీరో రానా. ఇప్పుడు నేను ఈ స్టేజ్‌పై ఉన్నానంటే అందుకు ఓ కారణం రానా’’ అని అన్నారు.

హీరోయిన్‌ జోయా హుస్సేన్‌ మాట్లాడుతూ – ``నేను హైదరబాదీ అమ్మాయిని. నా ఫస్ట్‌ తెలుగు మూవీ అరణ్య. రానా, విష్ణు అద్భుతంగా నటించారు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. ఈ సినిమా ప్రేక్షకులకు ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది`` అన్నారు.

విష్ణువిశాల్‌ మాట్లాడుతూ – ‘‘ఇక్కడికి వచ్చిన వెంకటేష్‌గారికి థ్యాంక్స్‌. వెంకటేష్‌గారు సినిమా చూసి చాలా పాజిటివ్‌గా రెస్పాండ్‌ అయ్యారు. తెలుగులో నా తొలి స్ట్రయిట్‌ ఫిల్మ్‌ అరణ్య. ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన రానాగారికి థ్యాంక్స్‌. బాహుబలి వంటి సినిమాలో నటించిన రానా అరణ్య వంటి ఓ డిఫరెంట్‌ సినిమా చేయడం గ్రేట్‌. ఈ సినిమా విడుదల తర్వాత రానా కష్టాన్ని ప్రేక్షకులు మరింత గుర్తిస్తారు. దర్శకుడు ప్రభు సాల్మన్‌ మంచి ఫ్యాషనేట్‌ డైరెక్టర్‌. అడవులు, వాటి ప్రాముక్యత, మనుషుల జీవితాలు అడవులపై ఎలా ఆధారపడి ఉన్నాయి? అన్న అంశాలు ఈ సినిమాలో చక్కగా చూపించారు. డిఫరెంట్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం. నాకు మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. అరణ్య సినిమా ప్రేక్షకులందరికి నచ్చుతుంది. నా తర్వాతి మూడు సినిమాలు తెలుగులో కూడ విడుదల కానున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది``అన్నారు.

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - ``కెమెరా ముందు ఒక వ్య‌క్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖ‌ర్ క‌మ్ములగారు ఆయ‌న కార్య‌క్ర‌మానికి రావ‌డం హ్యాపీగా ఉంది. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్ప‌డానికి ఆయ‌న్ని ఇక్క‌డికి పిలిచాను (న‌వ్వుతూ). సాయి మాధ‌వ్‌గారు, క్రిష్‌గారు క‌లిసి కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. ఆ సినిమాలో సాయి మాధ‌వ్ గారు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది అది ఏంటంటే `చ‌ప్ప‌ట్లంటే వ్య‌స‌నం..ఆ చప్ప‌ట్ల మ‌ధ్య‌న ఒక్క‌డుంటాడు..దీన‌మ్మ ఇది నిజ‌మే క‌దా అని చూస్తుంటాడు..ఆ ఒక్క‌డికోసం నువ్వు నాట‌కం ఆడు`` అని ఇప్పుడు ఆ ఒక్క‌డి కోస‌మే ఈ సినిమా కూడా చేశాను. నాకు చిన్నాన‌లో ఏదోఒక పార్ట్ అవ్వాల‌ని కోరిక ఉండేది. 11సంవ‌త్స‌రాల త‌ర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను..బాగా యాక్టింగ్ చేయ‌గ‌లుగుతున్నాను అని ఆయ‌న్నిఛీఫ్ గెస్ట్‌గా పిల‌వ‌డం జ‌రిగింది. ఈ సినిమాలో మా నాన్న పాత్ర‌కి చిన్నాన వాయిస్ఓవ‌ర్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడివిమ‌ధ్య‌లో..ఏనుగుల ద‌గ్గ‌ర ఉన్నాను. ఆ అనుభ‌వం మాటల్లో చెప్ప‌లేనిది. ఒక రియ‌ల్ రెయిన్ ఫారెస్ట్ మ‌ధ్య‌లో ఉండే ఎక్స్‌పీరియ‌న్స్ మీకు ఈ నెల 26న అర‌ణ్య‌తో తెలుస్తుంది. ఆ అడ‌విలో మ‌నుషులు చేసే అరాచ‌కాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఈ రోజు ఎక్క‌‌డ అడివి ఉన్నా స‌రే ఇలాంటి ఓ స‌మస్య ఉంది. నేను ఈ సినిమా కోసం రెండున్నర సంవత్స‌రాలు అడవిలో ఉన్నా.. నాకు ఆ ఏనుగుల‌తో ఉన్న రిలేష‌న్ వ‌ల్ల నా జీవితంలో ప్ర‌తి మనిషితో నాకున్న రిలేష‌న్ మారిపోయింది. మాములుగా నువ్వు ఎవ‌రు? అని తెలుసుకోవాలి అంటారు కాని ఈ సినిమా నాకు నేను ఎందుకు? అని నేర్పించింది. మీరు ఈ భూమ్మీదే ఉంటారు ఈ భూమికోసం ప‌నిచేస్తే ఆ భూమి తిరిగి మీకు, మీ త‌ర‌త‌రాల‌కు ఇస్తుంది అని ఏనుగులు నేర్పించాయి. ప్ర‌భు సాల్మోన్ ఒక ఫోటో చూసి న‌న్ను సెల‌క్ట్ చేశారు. నాకు ఎంతో నేర్పించిన వ్య‌క్తి అయ‌న‌. ఈ సినిమా థాయిలాండ్‌, కేర‌ళ‌, స‌తార్‌, మ‌హా భ‌లేశ్వ‌రం,. ఇలా ఆరు అడ‌వుల‌లో తీశాం. ఈ సినిమా మా అంద‌రిలో మార్పు తెచ్చింది. జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చిన ఎలా ఈజీగా తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్ర‌పంచంలోకి వెళ్ల‌బోతున్నారు. ఈ అవ‌కాశం ఇచ్చిన ఈరోస్ వారికి నా స్పెష‌ల్ థ్యాంక్స్‌`` అన్నారు.

దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ – ‘‘దర్శకుడు ప్రభు తన ఫేస్‌ను చూసి అరణ్య సినిమాకు తనను హీరోగా తీసుకున్నాడని రానా అన్నారు. కానీ నేను రానా వాయిస్‌ విని లీడర్‌ సినిమాకు హీరోగా తీసుకున్నాడు. లీడర్‌ సినిమా పూర్తయ్యి అప్పుడే పదేళ్లు పూర్తవుతున్నాయి. రానా ఎప్పుడు విభిన్నమైన సినిమాలను చేస్తాడు. డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తాడు. అరణ్య సినిమాలో రానా యాక్టింగ్‌ సూపర్‌గా ఉంటుంది. అరణ్య సినిమాలో ఇంటర్‌నేషనల్‌ స్టాండర్ట్స్‌ కనిపిస్తున్నాయి. అరణ్య సినిమా ప్రేక్షకులు అందరికి నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అండ్‌ కిడ్స్‌లకు కూడా నచ్చే సినిమా ఇది`` అన్నారు

విక్ట‌రి వెంకటేష్‌ మాట్లాడుతూ – ‘‘ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. శనివారం అరణ్య సినిమా చూశాను. అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది. లీడర్, ఘాజీ, బాహుబలి వంటి సినిమాల్లో రానా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తన జర్నీలో యాక్టర్‌గా నేర్చుకుంటున్నాడు అనుకున్నాను. కానీ అరణ్య సినిమాలోని పాత్రలో రానా ఒదిగిపోయిన తీరు చూస్తుంటే ...యాక్టర్‌గా రానా చాలా ఎదిగాడని అనిపిస్తుంది. అరణ్య సినిమాలోని ఫస్ట్‌ ప్రేమ్‌ నుంచే రానా పెర్ఫార్మెన్స్‌ చూసి నేను స్టన్‌ అయ్యాను. ఇండియన్‌ స్క్రీన్‌పై ఓ సరికొత్త పాత్రను రానా చేశాడు. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్న రానాను అభినందిస్తున్నాను. రానా బాడీ లాంగ్వేజ్‌ కూడ పాత్ర సరిపోయింది. చాలా సంతోషంగా కూడా ఉంది. ఒక్కరానానే కాదు. విష్ణువిశాల్, జోయా, ప్రియాంకా ఇలా అందరు వారి వారి క్యారెక్టర్స్‌లో లీనమైపోయారు. ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో షూటింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా జంతువుల హవాభాలను కెమెరాలో షూట్‌ చేయడం కష్టం. కానీ దర్శకుడు ప్రభు సాల్మన్‌ అండ్‌ టీమ్‌ చాలా కష్టపడి తీశారు. ఈ టీమ్‌ అందరు సిన్సియారిటీ, హార్డ్‌వర్క్, డేడికేషన్‌తో ఈ సినిమా చేశారు. మంచి పాజిటివ్‌ ఎనర్జీ కనిపిస్తుంది. అరణ్య సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి`` అన్నారు.

 

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved