pizza
Babu Baga Busy pre-release function
`బాబు బాగా బిజీ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 April 2017
Hyderabad

 

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం `బాబు బాగా బిజీ`. బాలీవుడ్ హిట్ చిత్రం `హంటర్‌` చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. నవీన్ మేడారం దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ చిత్రంలో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

సునీల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ - ''పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డైరెక్టర్‌ నవీన్‌ మేడారంగారు సినిమాను ఎంతో తపనతో తెరకెక్కించారు. అభిషేక్‌గారు చాలా మంచి నిర్మాత ఆయనతో మరో సినిమా చేయాలని ఉంది. అవసరాల శ్రీనివాస్‌గారు మంచి నటుడు. ఈ చిత్రంలో తన నటనతో ఇంకా మెప్పిస్తారు'' అన్నారు.

శ్రీముఖి మాట్లాడుతూ - ''టీవీ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్స్‌లో ఇప్పటి వరకు పాల్గొనలేదు. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం నవీన్‌గారు. ఇద్దరం నిజామాబాద్‌కు చెందినవాళ్ళం. హంటర్‌ సినిమా చూశాను. బాబు బాగా బిజీలో నేను చాలా చిన్న క్యారెక్టర్‌ చేశాను. అవసరాలతో జెంటిల్‌మన్‌లో కూడా నటించాను. ఆయన థర్డ్‌ ప్రాసెస్‌ నాకు బాగా నచ్చుతుంది. ఎంత రిస్కీ స్టెప్‌ అయినా తీసుకుని చేసినందకు అవసరాలకు హ్యాట్సాఫ్‌. సుప్రియ చాలా బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసింది. అభిషేక్‌గారికి ఈ సినిమా నిర్మాతగా మంచి పేరు తేవాలి'' అన్నారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ - ''రొమాంటిక్‌ చిత్రం. సినిమాపై పాజిటివ్‌ లక్షణాలు కనపడుతున్నాయి. నవీన్‌కు మంచి చిత్రంగా ఇది పేరు తేవాలి. అభిషేక్‌కు కనకాభిషేకం కురవాలని కోరుకుంటున్నాను. అవసరాల మంచి ఆర్టిస్ట్‌, ఏ పాత్ర అయినా చేయగలడు. కుర్రాళ్ళకు కిర్రెక్కించే సినిమా అవుతుంది. టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

సుప్రియ ఐసాల మాట్లాడుతూ - ''హంటర్‌ సినిమాను టాలీవుడ్‌లో చేయడమేంటని ముందు ఆలోచించాను. డైరెక్టర్‌ను హంటర్‌లో నా పాత్రను అలాగే చేస్తారా అని అడిగాను. అవునండి అలాగే ఉంటుందని ఆయన అన్నారు. ఆయనలో నిజాయితీ నచ్చి నేను సినిమా చేయడానికి రెడీ అయ్యాను. ఇంత మంది గొప్ప ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవసరాలగారు హ్యుజ్‌ స్టెప్‌ తీసుకున్నారు. డిఫరెంట్‌ లేయర్‌ రోల్‌. ఆయన కెరీర్‌లో గ్రేట్‌ టచ్‌ ఉండే సినిమా అవుతుంది'' అన్నారు.

నవీన్‌ మేడారం మాట్లాడుతూ - ''ఇలాంటి ఫిలింను టాలీవుడ్‌లో తీయాలంటే గట్స్‌ కావాలి. తెలుగులో నాకు ఇది తొలి సినిమా. ఈ సినిమా చేయడానికి కారణం అభిషేక్‌ నామాగారు. సినిమాలో అనుకున్న దానికంటే ఎక్కువ మెటీరియల్‌ ఉంటుది. ముగ్గురు స్నేహితులు కలిసి మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. అవసరాలగారు తప్ప మరెవరినీ ఈ రోల్‌లో ఊహించుకోలేదు. ఆయన కూడా సినిమా చూడగానే సినిమా చూడటానికి సిద్ధమయ్యారు. సినిమాలో వల్గారిటీ కనపడదు. మిస్తి, తేజస్విని మడివాడ, సుప్రియ చక్కగా నటించారు. సినిమా చూస్తుంటే రియల్‌ లైఫ్‌ను చూస్తున్నట్లు అనిపిస్తుంది. సునీల్‌ కశ్యప్‌కు క్లాసికల్‌ మ్యూజిక్‌లో మంచి పట్టున్న మ్యూజిక్‌ డైరెక్టర్‌. పది సాంగ్స్‌ ఉన్నాయి. ప్రతి సాంగ్‌ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. కరుణాకర్‌ అడిగర్ల ఒక సాంగ్‌ మినహా అన్నీ తనే చక్కటి సాహిత్యమిచ్చాడు. ఒక సాంగ్‌ను సుద్ధాల అశోక్‌తేజగారు రాశారు. బాలు మహేంద్రగారి వద్ద 15 సంవత్సరాలు పనిచేసిన సురేష్‌ భార్గవ ప్రతి సీన్‌ను గొప్పగా చూపించాడు. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు'' అన్నారు.

అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమాలో ట్రిక్కి కంటెంట్‌తో ఉందని సినిమా చేయలేదు. రేపు సినిమా విడుదలైన తర్వాత ఆ విషయం అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. నేను నా ఇంజనీరింగ్‌ పూర్తికాగానే సోషల్‌ సైకాలజీలో మాస్టర్స్‌ స్టార్ట్‌ చేసి ఆపేశాను కానీ నాకు జనాన్ని స్టడీ చేయడమంటే చాలా ఇష్టం. అందువల్లనే సినిమా రంగంలోకి వచ్చాను. బాబుబాగా బిజీలో సైకాలాజికల్‌ కంటెంట్‌ బాగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌ కాబట్టే నేను సినిమా చేశాను. దర్శక నిర్మాతలు సినిమాపై ఎక్కడా టెంప్ట్‌ కాకుండా సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో చేసిన మిస్తి, సుప్రియ, తేజస్వి మడివాడ అందరూ గౌరవంతో పనిచేశారు. సునీల్‌గారు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. టీజర్‌, ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేను ఫలితం ఆశించకుండా సినిమాలు చేశాను. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

ఈ కార్యక్రమంలో రఫీ, ప్రియదర్శన్‌, మాస్టర్‌ నిఖిల్‌, శివరాం, వీరయ్యనాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved