pizza
Bhale Manchi Chowka Beram pre release function
'భలే మంచి చౌక బేరమ్‌' ప్రీ రిలీజ్ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 September 2018
Hyderabad

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ళ సతీష్‌కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'భలే మంచి చౌక బేరమ్‌'. అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 'అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌,'పంతం' వంటి చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ 'భలే మంచి చౌక బేరమ్‌' చిత్రాన్ని సమర్పించడం విశేషం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. సినిమా ట్రైల‌ర్ల‌ను స‌ప్త‌గిరి, పృథ్వి విడుద‌ల చేశారు. బిగ్ సీడీని వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు.

స‌ప్త‌గిరి మాట్లాడుతూ ``సినిమా పెద్ద హిట్ కావాలి. మారుతిగారు ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న సినిమాల‌న్నీ పెద్ద హిట్ అవుతున్నాయి. ఆయ‌న చిన్న సినిమాల మీద న‌మ్మ‌కంతో నిర్మిస్తున్న సినిమాలు కూడా పెద్ద హిట్ కావాలి. వాటికి ఈ సినిమా ఆద్యం కావాలి`` అని అన్నారు.

వినాయ‌క్ మాట్లాడుతూ ``భ‌లే మంచి చౌక‌బేర‌మ్ పెద్ద హిట్ కావాలి. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాలి. మా రాజా ర‌వీంద్ర‌కు ఇంకా మంచి పేరు రావాలి`` అని అన్నారు.

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ ``క‌ష్ట‌ప‌డి సంపాదించేవాడు ఎవ‌రైనా బేర‌మాడుతారు. త‌ప్ప‌కుండా ఎక్క‌డో ఒక‌చోట బేర‌మ్ ఆడే ఉంటాం. మారుతి ఓ ద‌ర్శ‌కుడిగా ఉండి, త‌న‌కొచ్చే ఐడియాల‌ను తాను స్ట్రీమ్‌లైన్ చేసి, మ‌రొక‌రికి అప్పజెప్ప‌డం గ్రేట్‌. నిర్మాత స‌తీష్‌కుమార్‌గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ల నాన్న‌, మా నాన్న ఫ్రెండ్స్. ద‌ర్శ‌కుడికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. రాజా ర‌వీంద్ర‌కు చాలా పెద్ద హిట్ కావాలి`` అని అన్నారు.

నిర్మాత సతీష్ మాట్లాడుతూ ``మా అరోళ్ల గ్రూప్ నుంచి వ‌స్తున్న తొలి సినిమా ఇది. మారుతిగారి కాన్సెప్ట్ తో సినిమా తీశాం. భ‌లే మంచి చౌక బేరాన్ని అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నాం. రాజా ర‌వీంద్ర‌, నూక‌రాజు, న‌వీద‌, యామిని అంద‌రూ చాలా బాగా న‌టించారు. వీళ్లందరూ చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. విజ‌య‌వాడ‌, గుంటూరు, శ్రీకాకుళంలో ప్ర‌మోష‌న్స్ కి వెళ్లారు. మా టీమ్‌కి చాలా థ్యాంక్స్. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న చాలా స‌పోర్ట్ చేశారు. రిలీజ్‌కి రాధామోహ‌న్‌గారు చేసిన స‌పోర్ట్ ని మ‌ర్చిపోలేను. ఆయ‌న ఆక్సిజ‌న్‌లాగా ప‌నిచేశారు. మా ద‌ర్శ‌కుడు ముర‌ళీ చాలా క‌ష్ట‌ప‌డి, చాలా బాగా ప్లాన్ చేసి తీశారు. ఈ సినిమాలో ట్విస్ట్, కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది. అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కులు అంద‌రూ చూడాల‌ని కోరుకుంటున్నా. మా ర‌వి చాలా యాక్టివ్‌గా ఉంటూ సినిమా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. మ్యూజిక్ డైర‌క్ట‌ర్ హ‌రిగారు మంచి పాట‌లిచ్చారు. జె.బి.గారికి కంగ్రాట్స్. రాజా ర‌వీంద్ర చాలా మంచి పాత్ర చేశారు. ఆయ‌న ఈ సినిమాతో ఇంకా పెద్ద స్టేజ్‌కి వెళ్లాలి`` అని అన్నారు.

ముస్త‌ఫా మాట్లాడుతూ ``మంచి క్యార‌క్ట‌ర్ చేశాను. మారుతిగారికి, ముర‌ళీగారికి చాలా థాంక్స్ `` అని చెప్పారు.

యామిని మాట్లాడుతూ ``ముర‌ళీగారు, ర‌వి ఈ సినిమాకు రెండు పిల్ల‌ర్స్ లాగా ఉన్నారు. ర‌వి ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆయ‌న త‌ప్ప‌కుండా మంచి రైట‌ర్ అవుతారు. న‌వీద్‌కి ఫీవ‌ర్ వ‌చ్చింది. త‌ను సినిమాలో చాలా బాగా చేశారు. నూక‌రాజును సినిమా షూటింగ్ స‌మ‌యంలో చాలా ఏడిపించేవాళ్లం. మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌కీ, రాధామోహ‌న్‌గారికి ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థాంక్స్. నూక‌రాజుకు కేరింత‌లో ఎంత మంచి పేరొచ్చిందో అంద‌రికీ తెలుసు. మేం టూర్‌కి వెళ్తే అంద‌రూ బావ‌న బావ‌నా.. అని అంటున్నారు. ఈ సినిమా విడుద‌ల‌య్యాక ఆయ‌న్ని స‌లీమ్ గా అంద‌రూ గుర్తుంచుకుంటారు. ఈ సినిమా సెకండాఫ్‌లో రాజార‌వీంద్ర‌గారి కేర‌క్ట‌ర్ హైలైట్ అవుతుంది. ఆయ‌న సినిమాల‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగాను. కామెడీ కూడా చాలా బావుంటుంది. మిస్ కాకుండా అంద‌రూ చూడండి..`` అని చెప్పారు.

నూక‌రాజు మాట్లాడుతూ ``రోజులు మారాయిలో మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాలోనూ చాలా మంచి పాత్ర ఇచ్చారు. మారుతిగారు నాకు ఫోన్ చేసి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. అంద‌రికీ చాలా థాంక్స్. అక్టోబ‌ర్ 5న అంద‌రూ థియేట‌ర్ల‌లో చూస్తార‌ని ఆశిస్తున్నాను. ఈ సినిమాను తీసుకున్న రాధామోహ‌న్‌గారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న వ‌ల్ల ఈ సినిమా స్థాయి పెరిగింది`` అని అన్నారు.

మారుతి మాట్లాడుతూ ``ఏ చిన్న సినిమా మొద‌లు కావాల‌న్నా ముందు న‌మ్మాల్సింది నిర్మాతే. ఎందుకంటే చాలా రిస్క్ చేసి సినిమా చేస్తారు నిర్మాత‌లు. పూర్తి రిస్క్ ఉంటుంది చిన్న సినిమా. ఆ చిన్న సినిమాల వ‌ల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వ‌దులుకోవ‌డం లేదు. అలాంటి చిన్న సినిమాను న‌మ్మి ముందుకొచ్చారు స‌తీశ్‌గారు. ఆయ‌న చాలా లైక్ మైండెడ్ పీపుల్ ఆయ‌న‌. రాధామోహ‌న్‌గారు సినిమాను చూసి ప్రేమించి రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమా మీద మేం ఆల్రెడీ రిస్క్ చేస్తే, ఆయ‌న ఆల్రెడీ చూసి రిస్క్ చేసి ముందుకెళ్తున్నాం. అరోళ్ల గ్రూప్‌, సత్య‌సాయి ఆర్ట్స్ మీద ఈ సినిమా చేస్తున్నాం. చిన్న థాట్ నుంచి వ‌చ్చిన క‌థ ఇది. దాన్ని ర‌వితో డిస్క‌స్ చేశాను. త‌ను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. కాన్సెప్ట్ ఫిల్మ్ ని అంద‌రూ మౌత్‌టాక్‌తో స్ప్రెడ్ చేస్తార‌ని ఆశిస్తున్నాను.ఇ ది ఇన్నొవేటివ్ కాన్సెప్ట్. అంద‌రికీ న‌చ్చుతుంది. న‌వీద్ చాలా బాగా చేశాడు. మ‌హానుభావుడులో చిన్న పాత్ర చేశాడు. ఇందులో పూర్తి స్థాయి పాత్ర చేశాడు. కెరీర్ ఉంటుంది అత‌నికి. నూక‌రాజు చాలా మంచి ఆర్టిస్ట్. యామిని కేర‌క్ట‌ర్ బావుంటుంది. రాజా ర‌వీంద్ర సీనియ‌ర్ ఆర్టిస్ట్. ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న వ్య‌
క్తి ఆయ‌న‌`` అని చెప్పారు.

కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ``మా సంస్థ‌లో వ‌చ్చిన ప్ర‌తి సినిమాకూ స‌పోర్ట్ చేసి, స‌క్సెస్ ఇచ్చేది మీడియానే. ఈ సినిమా మొత్తం త‌యారు చేసి సిల్వ‌ర్ ప్లేట్ట‌ర్‌లో నా చేతికిచ్చి రిలీజ్ చేయ‌మ‌ని అన్నారు. అంత‌క‌న్నా చౌక‌బేర‌మ్ దొర‌క‌దు. ఇదే నాకు భ‌లే మంచి చౌక బేర‌మ్‌. ఈ సినిమాను నేను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ న‌చ్చింది. మారుతిగారు చాలా బాగా చేశారు. యూనిక్ కాన్సెప్ట్ ఇది. క‌న్‌ఫ్యూజ‌న్‌, డార్క్ కామెడీ, యాక్ష‌న్ అన్నీ ఉన్నాయి. ముస్త‌బా చాలా బాగా న‌టించారు. ఆయ‌నకు న‌టుడిగా ఇది తొలి సినిమా అయినా, చాలా బాగా చేశారు. ఆయ‌న పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. ఆయ‌న‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా మంచి భ‌విష్య‌త్తు ఉంది. కేరింత నూక‌రాజు కామెడీ చాలా బాగా చేస్తారు. కామెడీ ముందు పుట్టిందా? ఈయ‌న ముందు పుట్టారా? అనేది నాకు ఇంట్ర‌స్ట్ అనిపించే విష‌యం. ఎక్స్ ట్రార్డిన‌రీ కామెడీ ఇచ్చారు. న‌వీద్ ఈ సినిమాలో హీరో. కాస్త సిక్ అయ్యాడు. సినిమా మొత్తం చాలా బాగా చేశాడు. యామిని చాలా బాగా చేసింది. ఇంత‌కు ముందు నా సినిమాలు ఒక‌టీ రెండింటిలో చేయ‌మంటే ఆ అమ్మాయి చేయ‌నంది. కానీ ఈ సినిమాలో చేసింది. మారుతి ఇచ్చిన కాన్సెప్ట్ ను ర‌విగారు మ‌లిచారు. దాన్ని ద‌ర్శ‌
కుడు చాలా బాగా తీశారు. సినిమాలో ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. 2.20 గంట‌లు చాలా బావుంటుంది. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను`` అని చెప్పారు.

ద‌ర్శ‌కుడు ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ ``నాకు ర‌వి, ల‌క్కీ ఇద్ద‌రూ చెరో చేయిలాంటివారు. ఈ సినిమా కోసం ముందు మారుతిగారికి ధ‌న్య‌వాదాలు చెబుతున్నా. రోజులుమారాయి సినిమా చూసి ఆయ‌న `నా సినిమాను నేనెలా తీస్తానో.. మీర‌లా తీశారు` అని అన్నారు. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇచ్చారు. రాధామోహ‌న్‌గారు మాతో అసోసియేట్ కావ‌డం మాకు భ‌లే మంచి బేర‌మ్‌. సినిమా అంద‌రికీ త‌ప్ప‌క న‌చ్చుతుంది`` అని అన్నారు.

రాజార‌వీంద్ర మాట్లాడుతూ ``ఈ సినిమాకు ప్రాణం పెట్టి ప‌నిచేశారు ర‌వి. మాడ్యులేష‌న్‌లో చిన్న గ్యాప్ వ‌చ్చినా చాలా ఎమోష‌న్ ఫీల‌య్యేవాడు. థ్రూ అవుట్ సినిమా అత‌ను అంతే ఎగ్జ‌యిట్‌గా ఉన్నాడు. ఈ సినిమాతో మారుతిగారు చాలా మంచి క్యార‌క్ట‌ర్ ఇచ్చారు. ఫ‌స్ట్ సీరియ‌స్‌గా ఉంటుంది, త‌ర్వాత కామెడీ ఉంటుంది. ఆ త‌ర్వాత ఎమోష‌న్ ఉంటుంది. ఇలా చాలా వేరియేష‌న్స్ ఉన్న సినిమా ఇది. అలాగే మా బాల్‌రెడ్డిగారు న‌న్ను చాలా అందంగా చూపించారు. హ‌రిగారు, జె.బి.గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మారుతిగారు ఇలాంటి కాన్సెప్ట్ లు రాస్తున్నందుకు ఆయ‌న‌కు చాలా ధ‌న్య‌వాదాలు. ఇండ‌స్ట్రీలో ఇలాంటి సినిమాలు చేయ‌డం మాట‌లు కాదు. నిర్మాత‌కు న‌చ్చాలి. ద‌ర్శ‌కుడు... ఆర్టిస్టులు వంటివ‌న్నీ కుద‌రాలి. అదంతా చాలా పెద్ద ప్రాసెస్‌`` అని అన్నారు.

పృథ్వి మాట్లాడుతూ ``మా తాడేప‌ల్లిగూడంలో కేజీల లెక్క‌న బ‌ట్ట‌లు ఇచ్చేవారు. అప్పుడు త‌గ్గిస్తారా అని అడిగేవాడిని. ఇప్ప‌టికీ నేను బేర‌మ్ ఆడే బ‌ట్ట‌లు కొంటాను. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. ఇప్పుడొచ్చే సినిమాల్లో ఇది కొత్త పాయింట్‌. మారుతిగారు మాతో సినిమాలు చేయించే విధానం చూస్తే మాకే న‌వ్వొస్తుంది. ఈ పోస్ట‌ర్ మీద రాధామోహ‌న్‌గారి పేరు చూసి థ్రిల్ అయ్యా. రాజారవీంద్ర‌గారు చేసిన పాత్ర‌ల్లో ఇంత ఎమోష‌న్, ఇంత వ‌య‌లెంట్‌గా చేసిన పాత్ర ఇదే. ఈ సినిమా టీమ్ అంద‌రికీ ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి`` అని చెప్పారు.

సంగీత ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నాకు సంగీతం చాలా బాగా వ‌చ్చు. మారుతిగారు న‌న్ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. మంచి పాట‌లు కుదిరాయి`` అని అన్నారు.

పాట‌ల ర‌చ‌యిత పూర్ణాచారి మాట్లాడుతూ ``అవ‌కాశం గొప్ప‌ద‌ని భావిస్తాను. ఈ సినిమాలో అన్ని పాట‌లు రాయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన మారుతిగారికి ధ‌న్య‌వాదాలు. ర‌వి, ల‌క్కీ నాకు ఈ సినిమా విష‌యంలో చాలా స‌హ‌క‌రించారు`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved