pizza
Howrah Bridge pre release function
'హౌరా బ్రిడ్జ్‌' ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

30 January 2018
Hyderabad

 

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్‌ వి ఈ స్టూడియోస్‌ ప్రై.లిమిటెడ్‌ బ్యానర్‌ పై రాహుల్‌ రవీంద్రన్‌, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రేవన్‌ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'హౌరా బ్రిడ్‌'. శేఖర్‌ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మినిష్టర్‌ పత్తిపాటి పుల్లారావు, నారా రోహిత్‌, రాహుల్‌ రవీంద్రన్‌, నిఖిల్‌, సాయికార్తీక్‌, శేఖర్‌ చంద్ర, ప్రతాని రామకృష్ణ గౌడ్‌, చాందిని చౌదరి, జె.ఎన్‌.రాజు, నవీన్‌ చంద్ర, రాజా రవీంద్ర, అశ్విన్‌కుమార్‌ సహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను నారా రోహిత్‌ విడుదల చేసి మినిష్టర్‌ పత్తిపాటి పుల్లారావుకి అందించారు.

మినిష్టర్‌ పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ - ''రాహుల్‌ రవీంద్రన్‌, చాందిని చౌదరి, నిర్మాతలు చరణ్‌, రేవన్‌ యాదు మంచి సినిమాను తీశారు. మంచి కథతో మన ముందుకు రాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

నారా రోహిత్‌ మాట్లాడుతూ - ''ఫిబ్రవరి 3న విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్‌ను సాధించాలి. శేఖర్‌ చంద్ర మ్యూజిక్‌ బావుంది. చరణ్‌గారికి నిర్మాతగా తొలి చిత్రమిది. సినిమా పెద్ద సక్సెస్‌ను అందుకోవాలి. ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు'' అన్నారు.

ప్రతాని రామకృష్ణ మాట్లాడుతూ - ''రాహుల్‌ రవీంద్రన్‌ నిర్మాతలకు కావాల్సిన హీరో కాబట్టి సినిమా పెద్ద హిట్‌ కావాలి. ఇలాంటి హీరోలకు సక్సెస్‌ రావాలి. రాహుల్‌ రవీంద్రన్‌, చాందిని చౌదరి జోడి చూడటానికి బావున్నారు'' అన్నారు.

నవీన్‌ చంద్ర మాట్లాడుతూ - ''రాహుల్‌ నా హృదయానికి దగ్గరైన వ్యక్తి. నిర్మాతలు సినిమాను బాగా ప్రమోట్‌ చేస్తున్నారు. సాంగ్స్‌ చాలా బావున్నాయి'' అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ - ''రాహుల్‌ రవీంద్రన్‌ నాకు ఫేవరేట్‌ నటుడు. దర్శకుడు రేవన్‌ యాదు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర సహా యూనిట్‌కి అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి నిర్మాతలకు మంచి పేరు తేవాలి'' అన్నారు.

సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ''శేఖర్‌ అందించిన ఆల్బమ్‌ బావుంది. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

నిఖిల్‌ మాట్లాడుతూ - ''కథను నమ్మి నిర్మాతలు సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. రాహుల్‌ నటుడు, దర్శకుడుగా రాణిస్తున్నాడు. శేఖర్‌ చంద్ర నాకు కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నవాడా వంటి హిట్‌ చిత్రాలకు మ్యూజిక్‌ అందించాడు. యూనిట్‌కు అభినందనలు'' అని తెలిపారు.

చాందిని చౌదరి మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నటించడం వల్ల నటిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ప్రమోషన్స్‌ విషయంలో భారీగా ఖర్చు పెడుతున్నారు. రేవన్‌ యాదుగారు ఓ విజన్‌తో సినిమాను స్టార్ట్‌ చేశారు. ఈ సినిమాలో నన్ను సెలక్ట్‌ చేసుకున్నందుకు ఆయనకు థాంక్స్‌. సినిమా రిచ్‌గా వచ్చింది. రాహుల్‌ రూపంలో నాకు ఈ సినిమాతో మంచి స్నేహితుడు దొరికాడు. నిజాయితీగా నటిస్తాడు. తనతో వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. మనాలి రాథోడ్‌ చక్కగా నటించింది. మంచి ప్రేమకథ. శేఖర్‌ చంద్రగారు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. పాటలు చాలా క్యాచీగా ఉన్నాయి. టీం ఎఫర్ట్‌ సక్సెస్‌ సాధిస్తుందని నమ్ముతున్నాం'' అన్నారు.

దర్శకుడు రేవన్‌ యాదు మాట్లాడుతూ - ''దర్శకుడిగా ఇది నాకు రెండో చిత్రం. సినిమాను ఇన్నోవేటివ్‌గా తీశాం. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. సినిమా ఇంత బాగా రావడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతగానో సహకారం అందించారు. శేఖర్‌ చంద్ర మంచి సంగీతం అందించారు. చల్లాభాగ్యలక్ష్మిగారు, శ్రీమణిగారు మంచి సాహిత్యాన్ని అందించారు. మంచి నేపథ్య సంగీతం కుదిరింది. రాహుల్‌, చాందిని చక్కగా నటించారు'' అన్నారు.

హీరో రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ''సినిమా బాగా వచ్చింది. ప్రమోషన్స్‌ విషయంలో కూడా చాలా ఎగ్రెసివ్‌గా ఉన్నారు. రేవన్‌ యాదు మంచి డిగ్నిటి ఉన్న క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసి నాకు ఇచ్చారు. ఆయనకు థాంక్స్‌. చాందినీ, మనాలి చక్కగా నటించారు. విజయ్‌ మిశ్రా విజులవ్‌గా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. శేఖర్‌ ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇచ్చారు. ఇదొక లవ్‌లీ అనుభవమున్న జర్నీ'' అన్నారు.

లలిత్‌ చరణ్‌ మాట్లాడుతూ - ''సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌, చాందిని, మనాలి, రావు రమేష్‌, ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, మ్యూజిక్‌: శేఖర్‌ చంద్ర, లిరిక్స్‌: శ్రీమణి, డా.చల్లా భాగ్యలక్ష్మి, రచనా సహకారం: సాయికృష్ణ, శ్యామ్‌, ఏక్సిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాజు, కథ- దర్శకత్వం: రెవన్‌ యాదు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved