pizza
Hushaaru pre release function
`హుషారు` ప్రీ రిలీజ్‌ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

8 December 2018
Hyderabad

బెక్కెం వేణుగోపాల్‌, రియాజ్‌ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం 'హుషారు'. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్‌, దక్ష నగార్కర్‌, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ సీడీని, ఆడియో సీడీల‌ను హీరో శ్రీవిష్ణు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ - ```హుషారు` పాట‌లు చాలా వైర‌ల్ అయ్యాయి. నాకు ర‌ధ‌న్ సంగీతం అందించిన అందాల రాక్షసి పాట‌లంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాకు డిఫ‌రెంట్ మ్యూజిక్ అందించాడు. యూత్‌కి క‌నెక్ట్ అయ్యే మ్యూజిక్‌ను అందించాడు. బెక్కెం వేణుగోపాల్‌గారు ప్యాష‌నేట్ నిర్మాత‌. ఆయ‌న ప్యాష‌న్ వ‌ల్ల‌నే, ఈ సినిమా ఇంత అందంగా ఉంది. సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి`` అన్నారు.

మ‌ధుర శ్రీధ‌ర్ మాట్లాడుతూ - ``రెగ్యుల‌ర్‌గా క్వాలిటీ సినిమాలు తీసే చిన్న నిర్మాత‌ల్లో బెక్కెం వేణుగోపాల్‌గారు ఒక‌రు. ఎంతో మంది కొత్త‌వాళ్ల‌ని ఇంంట్ర‌డ్యూస్ చేశాడు. త‌ను చిన్న సినిమాల‌ను ఇంట్రెస్టింగ్ సినిమాలుగా మ‌లుస్తుంటాడు. అలా త‌ను చేసిన సినిమాల్లో `ప్రేమ ఇష్క్ కాద‌ల్` అంటే నాకు చాలా ఇష్టం. `సినిమా చూపిస్త మావ` కూడా ఇష్టం. త‌ర్వాత నేనులోక‌ల్ సినిమా కూడా ఇష్టం. అలాగే `హుషారు` సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మ‌ల‌చ‌డం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాకు తెలుసు. టెరిఫిక్ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌ని కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను. సినిమా చాలా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

రాజ్‌కందుకూరి మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష ఈ క‌థ‌ను ఏడాదిన్న‌ర క్రితం నాకు చెప్పాడు. చాలా బావుంది. షూటింగ్ ఎప్ప‌టి నుండి స్టార్ట్ చేస్తాం అన్నాను. అయితే త‌ను `లేదు సార్‌..బెక్కెం వేణుగోపాల్‌గారితో సినిమా చేస్తున్నాం. మీ అబ్బాయి ఇందులో యాక్ట్ చేస్తారా? అని అడ‌గ‌టానికి వ‌చ్చాను` అన్నాడు. నేను త‌ను ఇంకా యు.ఎస్‌లోనే ఉన్నాడ‌ని స‌మాధానం చెప్పాను. ఈ సినిమాలో న‌టించిన యంగ్ టీమ్‌ను క‌లిశాను. అంద‌రిలో పాజిటివిటీ క‌న‌ప‌డుతుంది. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది. డిసెంబ‌ర్ 14 కోసం వెయిట్ చేస్తున్నాను`` అన్నారు.

రాహుల్ రామ‌కృష్ణ మాట్లాడుతూ - ``గోపీగారు బాగా స‌పోర్ట్ చేశారు. శ్రీహ‌ర్ష నెరేష‌న్ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. పిచాక్ సాంగ్‌ను శ్రీహ‌ర్ష చ‌క్క‌గా డైరెక్ట్ చేశాడు. అలాగే మందు సాంగ్ కూడా అంద‌రికీ న‌చ్చుతుంది. డిసెంబ‌ర్ 14న ఈ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియ‌ర్‌ను రెస్పాన్సిబుల్‌గా చూడాల‌ని ప్రేక్ష‌కులను కోరుకుంటున్నాను`` అన్నారు.

ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ - ``ప‌దేళ్ల సినీ జ‌ర్నీలో చాలా మంది నిర్మాత‌ల‌ను క‌లిశాను. ఒక్కొక్క‌రు ఒక్కో కార‌ణంతో సినిమాలు చేస్తుంటారు. అయితే కొంద‌రు నిర్మాత‌లు మాత్ర‌మే సినిమాలు గురించి ఆలోచిస్తుంటారు. అలాంటి వారిలో బెక్కెం వేణుగోపాల్‌గారు ఒక‌రు. సినిమాను ప్రేమించి, ఇష్ట‌ప‌డి చేయాల‌ని చెప్పే వ్య‌క్తి. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష చాలా కాన్ఫిడెంట్ ఉన్న వ్య‌క్తి. దాని వ‌ల్లే గోపీగారితో సినిమా చేయ‌గ‌లుగుతున్నాడు. పాట‌లు బావున్నాయి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు. సినిమా పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

శ్రీవిష్ణు మాట్లాడుతూ - ``ఐదేళ్ల క్రితం గోపీగారితో క‌లిసి ప్రేమ ఇష్క్ కాద‌ల్ సినిమా చేశాను. నేను చేస్తున్న సినిమాలు గురించి త‌ను చెబుతుంటాను. ఆయ‌న జ‌డ్జ్‌మెంట్ తీసుకుంటూ ఉంటాను. ఆయ‌నతో మంచి ప‌రిచ‌యం ఉంది. ఆయ‌న ఆఫీస్‌లోనే డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌ను క‌లిసేవాడిని. సాంగ్స్ విన్న‌ప్పుడూ చాలా బాగా న‌చ్చింది. ముఖ్యంగా ఉండిపోరాదే.. సాంగ్ చాలా బాగా న‌చ్చింది. రాజ్‌తోటగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించి ఎంటైర్ టీమ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్‌తోట మాట్లాడుతూ - ``నీదినాది ఒకే క‌థ‌`, `అర్జున్ రెడ్డి` త‌ర్వాత నేను ప‌నిచేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

తేజ‌స్ కంచెర్ల మాట్లాడుతూ - ``నేను, ప‌వ‌న్ సాధినేనిని క‌లిసి ఓ సినిమా చేద్దామ‌నుకుంటే.. ఆయ‌న వ‌ల్ల శ్రీహ‌ర్ష‌ను క‌లిశాను. అక్క‌డ నుండి నేను, శ్రీహ‌ర్ష ట్రావెల్ చేస్తూ చేసిన సినిమా ఇది. పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మా అంద‌రినీ టీమ్‌గా చేసి ప్రోత్రాహ్సం ఇచ్చిన గోపీగారికి థాంక్స్‌. మంచి జ్ఞాప‌కాల‌ను, స్నేహితుల‌ను ఇచ్చిన మంచి సినిమా ఇది`` అన్నారు.

ద‌క్షా న‌గార్క‌ర్ మాట్లాడుతూ - ``నేను వేరే సినిమా కోసం వ‌స్తే హుషారు చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో ఓ సాంగ్ విని సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. శ్రీహ‌ర్ష సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. డిసెంబ‌ర్ 14న సినిమాను చూసి ఎంజాయ్ చేయండి`` అన్నారు.

అభిన‌వ్ మాట్లాడుతూ - ``అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా జాయిన్ అయిన నేను సినిమాలో వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో న‌టించాను. అవ‌కాశం ఇచ్చిన శ్రీహ‌ర్ష‌గారికి థాంక్స్‌. మా బాబాయ్ బెక్కంగారు చాలా ప్యాష‌న్‌తో చేసిన సినిమా. స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

ప్రియ వ‌డ్ల‌మాని మాట్లాడుతూ - ``మా అంద‌రికీ త‌ప్ప‌కుండా మంచి భ‌విష్య‌త్ ఇచ్చే సినిమా అవుతుంద‌ని త‌ప్ప‌కుండా చెప్ప‌గ‌ల‌ను. అంద‌రం క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.

రమ్య ప‌సుపులేటి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చిన శ్రీహ‌ర్ష‌, బెక్కెం వేణుగోపాల్‌గారికి థాంక్స్‌. కొత్త‌వాళ్లంద‌రం చేసిన సినిమా. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

దినేష్ మాట్లాడుతూ - ``శ్రీహ‌ర్ష కొనుగంటి, బెక్కెం వేణుగోపాల్‌గారికి థాంక్స్‌. ఆయ‌న వ‌ల్లే నేను ఈ స్టేజ్‌పై నిల‌బ‌డి ఉన్నాను. యంగ్ టీం చేసిన ప్ర‌య‌త్నం. త‌ప్ప‌కుండా మంచి సినిమా అవుతుంది. పాట‌ల‌కు చాలా హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 14న సినిమాను చూసి మ‌మ్మ‌ల్ని స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఇదొక ప్ర‌యాణం యూత్ అందరికీ మేం డేడికేట్ చేస్తున్నాం. కాబ‌ట్టి ఇది మీ మూవీ. రేపు సినిమా చూస్తే స్క్రీన్‌పై మిమ్మ‌ల్ని మీరు చూసుకుంటారు`` అన్నారు.

తేజు మాట్లాడుతూ - ``అన్న‌పూర్ణ‌లో ఫిలిమ్ కోర్సు చేశాను. నేను నాన్న నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాను. ఈ సినిమాకు వ‌న్ ఆఫ్ ది లీడ్‌గా న‌టించాను. ఈ అవ‌కాశం ఇచ్చిన గోపీగారికి థాంక్స్‌. ఈ సినిమా కోసం ప‌దిహేను కిలోల బ‌రువు పెరిగాను. సినిమాటిక్‌గా ఎక్క‌డా అనిపించ‌దు.

ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ - ``నాకు ఈ సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్‌గారికి థాంక్స్‌. సినిమాలో న‌టించిన‌వాళ్లు కొత్త‌వాళ్లు అయినా మెచ్యూర్డ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారు. రాజ్‌తోట‌, విజ‌య్‌, స‌న్ని, ర‌ధ‌న్‌.. అందరికీ థాంక్స్‌. ఈ సినిమాలో మేజిక్ జ‌రిగింది. అది సినిమాలో చూడాల్సిందే. ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. జర్నీ అటు ఇటూగానే వ‌చ్చింది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌`` అన్నారు.

బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``నేను ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సినిమాలు చేశాను. ప్ర‌తి సినిమా ఓ ఎక్స్‌పీరియెన్స్‌గానే భావిస్తాను. ఇది కూడా ఓ ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సినిమా ప‌రంగా నాకు నేను అప్ డేట్ అయ్యాను. ఈ టీమ్ న‌న్ను సినిమాలో ఇన్‌వాల్వ్ చేశారు. కాబ‌ట్టి కొత్త విష‌యాలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. కొత్త‌వాళ్ల‌తో సినిమా చేసి వాళ్లు అనంద‌ప‌డుతుంటే నాకు గ‌ర్వంగా ఉంది. అంద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``బెక్కెం వేణుగోపాల్ గారంటే ఇండ‌స్ట్రీలో అంద‌రికీ ఇష్టం. ముఖ్యంగా కొత్త‌గా వ‌చ్చిన న‌టీన‌టుల‌కు ఆయ‌నెంతో ఇష్టం. మంచి క‌థ‌ను ఆయ‌న ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌దులుకోడు. ఎంతో మంచి కొత్త‌వాళ్ల‌ను ఎంక‌రేజ్ చేసిన వ్య‌క్తి. చిన్న సినిమాను తీసి దాన్ని పెద్ద లెవ‌ల్‌లో ఎలా రిలీజ్ చేయాలో తెలిసిన వ్య‌క్తి. సినిమా చూపిస్త మావ అంత పెద్ద హిట్ కావాలి. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌, న‌టీన‌టులకు, ర‌ధ‌న్‌, రాజ్ తోట స‌హా ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved