pizza
Jaanu pre release function
‘జాను’ ...మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు
You are at idlebrain.com > News > Functions
Follow Us


1 February 2020
Hyderabad

‘జాను’ ...మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని

‘జాను’ చూసిన త‌ర్వాత ఆ హ్యోంగోవ‌ర్‌లో ఉండిపోతాం: దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. నేచుర‌ల్ స్టార్ నాని, వంశీ పైడిప‌ల్లి ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ...17 ఏళ్ల‌లో తొలి రీమేక్‌: దిల్‌రాజు

హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘మా బ్యాన‌ర్ స్టార్ట్ అయ్యి 17 ఏళ్లు అవుతుంది. ఇన్నేళ్ల‌లో మేం ఎప్పుడూ రీమేక్ చేయ‌నేలేదు. మా బ్యాన‌ర్‌లో వ‌స్తోన్న తొలి రీమేక్ ఇది. రీమేక్ చేయాలంటే నాకు భ‌యం. ఎందుకంటే ఒరిజిల్ ఫీల్‌ను మిస్ కాకుండా తెర‌పైకి తీసుకురావ‌డం చాలా క‌ష్టం. త‌మిళంలో ‘96’ సినిమాను రిలీజ్ కంటే ఒక నెల ముందు చూశాను. చూసిన త‌ర్వాత ప్రివ్యూ థియేట‌ర్ నుండి బ‌య‌ట‌కు రాగానే ఈ సినిమాను నేను తెలుగులో రీమేక్ చేస్తానంటూ.. ప్రొడ్యూస‌ర్‌కి చెక్ ఇచ్చేశాను. అందుకు కార‌ణం సినిమా చూసే స‌మ‌యంలో ఎమోష‌న్స్‌తో గుండె బ‌రువెక్కింది. అప్పుడు మా ‘ఎంసీఏ’ షూటింగ్ జ‌రుగుతుంది. ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయాల‌నుకుంటున్నాన‌ని నానితో చెప్పాను. త‌ను కూడా చెన్నై వెళుతున్నాన‌ని చెప్పాడు. అప్పుడు త‌న కోసం ఓ షో ఏర్పాటు చేస్తే.. త‌ను సినిమా చూసి సినిమా ‘క్లాసిక్ సినిమా సార్‌! చాలా బావుంది’అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. త‌మిళంలో సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత మళ్లీ ఆడియెన్స్‌తో క‌లిసి సినిమా చూశాను. నాకు తమిళంలో పూర్తిగా రాకపోయినప్పటికీ ప్రేక్ష‌కుల నుండి వ‌చ్చిన రెస్పాన్స్ చూసి ఎవ‌రు ఏమ‌నుకున్నా..ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని డిసైడ్ అయ్యాను. జానుగా స‌మంత‌ను ఈ సినిమాలో యాక్ట్ చేయించాల‌ని అనుకున్నాను. త‌నని త‌ప్ప‌.. ఆ పాత్ర‌లో మరొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోలేక‌పోయాను. ఈ మ‌ధ్య త‌ను చేస్తున్న సినిమాలన్నీ సూప‌ర్బ్‌గా సెల‌క్ట్ చేసుకుంటుంది. త‌న‌తో మాట్లాడి సినిమాకు ఒప్పించాను. ఇక నా బ్ర‌ద‌ర్ శ‌ర్వాకి ఫోన్ చేసి సినిమా చూడ‌మంటే సినిమా చూసి సూప‌ర్బ్‌గా ఉంద‌ని ఫోన్ చేశాడు. అలా శ‌ర్వా, స‌మంత ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. మా ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన ప్రేమ్‌కుమార్ ‘96’ సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌మిళంలో సినిమా చేసిన త‌న‌తో మాట్లాడి తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌మ‌ని చెప్పాను. త‌మిళంలో చేసిన టెక్నీషియ‌న్సే ఈ సినిమాకు ప‌నిచేశాను. సినిమా స్టార్ట్ చేసిన త‌ర్వాత కెన్యాలో శ‌ర్వా న‌డుపుతున్న జీపు బోల్తా పడింది.. దేవుడి దయవల్ల త‌న‌కు ఏమీ కాలేదు. త‌ర్వాత మ‌రో డిస్ట్ర‌బెన్స్ వచ్చింది. ఏంటి? ఇంత మంచి సినిమాకు ఇన్ని అడ్డంకులు? అని అనుకున్నాను. అయితే అన్నింటినీ ఒక్కొక్క‌టిగా దాటుకుంటూ వ‌చ్చి సినిమాను పూర్తి చేశాం. ఈ సినిమాను చేస్తున్న‌ప్పుడు ‘దిల్‌రాజుకేమైనా మెంటలా? డ‌బ్బింగ్ చేయొచ్చు క‌దా?’ అని చాలా కామెంట్స్ విన్నాను. ఆ ఫీల్‌ను తెలుగులో అలాగే క్యారీ చేశాం. అదే ఫ్లేవ‌ర్‌ను డైరెక్ట‌ర్ ప్రేమ్ తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ఫిబ్ర‌వ‌రి 7న మా ‘జాను’ సినిమాను చూసిన తెలుగు ప్రేక్ష‌కులు వావ్ అంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను. ఈ సినిమా హ్యాంగోవ‌ర్‌లో ఉండిపోతాం. జాను సినిమా చూసిన త‌ర్వాత మ‌న లైఫ్‌లోని మెమొరీస్‌ను ఇంటికి తీసుకెళ్తాం. ఫిబ్ర‌వ‌రి 7న నేను చెప్పిన‌వ‌న్నీ నిజాలు అవుతాయి’’ అన్నారు. మర్యాద ఉన్న సినిమా

వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ - ‘‘రాజుగారు ఈ రీమేక్ చేస్తున్నామ‌ని అనుకున్న‌ప్పుడు వ‌ద్ద‌ని వారించిన వారిలో నేనూ ఒక‌డ్ని. కానీ ట్రైల‌ర్‌ను చూసి షాక‌య్యాను. ప్రేమ్ అదే మూమెంట్స్‌ను తెలుగులో రీ క్రియేట్ చేశాడు. అందుకు కారణం ఈ సినిమా త‌న మ‌న‌సులో నుండి వ‌చ్చిన ఆలోచ‌న. అందుక‌నే అద్భుతంగా ఈ సినిమాను మ‌లిచాడు. ఇక తమిళంలో త్రిష‌..తెలుగులో స‌మంతగా న‌టించిన గౌరికి నేను పెద్ద ఫ్యాన్‌ని. భవిష్యత్తులో తెలుగు సినిమా గురించి రాసేట‌ప్పుడు స‌మంత గురించి కూడా కొన్ని పేజీలు రాసేంత స్థాయికి ఎదిగింది. అయినా స‌మంత విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా ఫెయిలైతే నా కెరీర్ ఏంటి? అని ఇప్ప‌టికీ ఆలోచిస్తుంటుంది. ఆ భ‌యం, ప్యాష‌న్‌తోనే ఇప్పటికీ సినిమాలు చేస్తుంది. నేను డైరెక్ట‌ర్‌గా మారే క్ర‌మం నుండి శ‌ర్వానంద్ తెలుసు. త‌ను అప్ప‌టికీ యాక్ట‌ర్ కాలేదు. ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి చేరాడు. ‘జాను’ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు.. మ‌ర్యాద ఉన్న సినిమా. అదే గౌర‌వం, మ‌ర్యాదతో రాజుగారు సినిమా చేశారు. ఆయ‌న డ‌బ్బు క‌న్నా గౌర‌వం సంపాదించాల‌నుకుంటారు. 96 సినిమా తమిళంలో ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలుగులోనూ అలాగే నిల‌బ‌డుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు. గర్వంగా ఫీలవుతారు

సమంత అక్కినేని మాట్లాడుతూ - ‘‘అభిమానుల‌ను డిస‌ప్పాయింట్ చేయ‌కూడ‌ద‌నే నేను ప్ర‌తీ సినిమాకు భ‌య‌ప‌డుతుంటాను. ప్ర‌తి సినిమాను.. షూటింగ్‌కి వెళ్లే ప్ర‌తిరోజుని నా మొద‌టి సినిమాకు మొద‌టి రోజు వెళ్లేలాగానే ఫీల్ అవుతాను. ప్రేక్ష‌కులు అందిస్తున్న స‌పోర్ట్‌కు థ్యాంక్స్‌. క్లాసిక్ సినిమా రీమేక్ ఇది. దీని గురించి ఇప్పుడు ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది. ఫిబ్ర‌వ‌రి 7 త‌ర్వాత త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. ప్ర‌తిరోజూ ఈ సినిమా షూటింగ్‌లో ఏదో ఒక మేజిక్ జ‌రుగుతూనే ఉండింది. దిల్‌రాజుగారు అడ‌గ్గానే నేను పారిపోయాను. అయినా కూడా ఆయ‌న రెండోసారి అడిగి గొప్ప అవ‌కాశాన్ని ఇచ్చారు. నా రామ్‌లాగా న‌టించిన శ‌ర్వాకు థ్యాంక్స్‌. నా పెర్ఫామెన్స్‌కు ఏదైనా క్రెడిట్ ద‌క్కితే అది శ‌ర్వా వ‌ల్ల‌నే కుదిరింది. ప్రేమ్‌కుమార్‌గారికి థ్యాంక్స్‌. ఆయ‌న మేజిషియ‌న్‌లా మ‌రోసారి మేజిక్‌ని క్రియేట్ చేశాడు. నేను మీ అందరినీ గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేస్తాన‌నే అనుకుంటున్నాను’’ అన్నారు. తొంబై ఏళ్ల వరకు కనెక్ట్ అయ్యే సినిమా

హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ‘‘కొంత మంది హీరోయిన్స్‌తో ప‌నిచేయాలంటే కాస్త ఆలోచించుకుంటాం. నిత్యామీన‌న్‌, సాయిప‌ల్ల‌వి..స‌మంత వంటి వాళ్లు సీన్స్‌ను తినేస్తారు. వీళ్ల‌తో సినిమా అన‌గానే కొంచెం మ‌నం అల‌ర్ట్‌గా ఉండాలి. స‌మంత‌తో తొలిసారి ప‌నిచేశాను. ప్ర‌తి సీన్‌ను వంద శాతం చెక్ చేసుకునే న‌టిస్తుంది. అందుకే త‌ను సూప‌ర్‌స్టార్ అయ్యింది. స‌మంత జానుగా చేయ‌కుంటే ఈ సినిమా లేదు. నాకు ఏదైనా క్రెడిట్ అంటూ వ‌స్తే.. దానికి కార‌ణం స‌మంతే. ఆరు నుండి 90 ఏళ్ల వ‌ర‌కు అంద‌రికీ ఈ సినిమా క‌నెక్ట్ అవుతుంది. ఫ‌స్ట్ ల‌వ్‌ను ఎవ‌రూ మార్చ‌లేరు. చాలా స్వీట్ మెమురీస్ ఉన్నాయి. ర‌మేశ్‌, కిషోర్ క్యారెక్ట‌ర్స్ మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. నా టీమ్ అంద‌రికీ థ్యాంక్స్‌. ఇలాంటి అద్భుత‌మైన సినిమాను ఇచ్చిన శిరీషన్న‌, రాజన్న‌, హ‌ర్షిత్‌ల‌కు థ్యాంక్స్‌. నేను ఈ సినిమాను చూసి ‘క్లాసిక్ మూవీ క‌దా! మ‌నం చేయాలా?’ అన్నాను. ‘నువ్వు న‌న్ను న‌మ్ము’ అని దిల్‌రాజు అన్నారు. ఆయ‌న‌పై న‌మ్మకంతో సినిమా చేశాను. సార‌థి స్టూడియోలో నానితో ఫ్రెండ్‌షిప్ స్టార్ట్ అయ్యింది. నేను, న‌రేశ్‌, నాని క‌లిసి చాలా ట్రిప్స్‌కు వెళ్లాం. త‌న‌కు థ్యాంక్స్‌’’ అన్నారు. మనతో పాటు ఇంటికి తీసుకెళ్లే సినిమా

నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ - ‘‘రాజుగారితో పాటు నాకు ఈ సినిమాను చూడ‌మ‌న్నప్పుడు.. ‘ఇంత మంచి సినిమా, ఎంతో బాగా చేశారు. దీన్ని ట‌చ్ చేయ‌కండి’ అని నా ఒపీనియ‌న్ చెప్పాను. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నార‌ని నా ద‌గ్గ‌ర ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ తెలుగులో ఈ సినిమాను తీయ‌కూడ‌ద‌ని నేను చెప్పేవాడిని. కానీ.. ఈ సినిమాలో శ‌ర్వానంద్‌, స‌మంత చేస్తున్నార‌ని అనౌన్స్ చేయ‌గానే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు చూస్తామా? అనిపించింది. ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు ఆ న‌మ్మ‌కం నిజ‌మైంది. త‌మిళంలో నేను ఏదైతే చూశానో అదంతా పోయింది. ఇప్పుడు రామ్, జాను అంటే శ‌ర్వా, సామ్‌లే గుర్త‌కొస్తున్నారు. త‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమారే ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాబ‌ట్టి ఫీల్ ఎక్క‌డా మిస్ అయ్యుండ‌దు. శ‌ర్వా.. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చినప్పుడు నా తొలి ఫ్రెండ్. శ‌ర్వా, సామ్ ఇద్ద‌రూ మంచి పెర్ఫామెర్స్‌. పోటీ ప‌డి న‌టించారు. శ‌ర్వా ఏ సినిమా చేసినా స‌రే! వాడికి మాత్రం చాలా మంచి పేరు వ‌స్తుంటుంది. ఈ సినిమాకు మంచి పెర్ఫామర్ అవ‌స‌రం. అందుక‌నే త‌మిళంలో విజ‌య్‌సేతుప‌తిని, తెలుగులో శ‌ర్వానంద్‌ని తీసుకున్నారు. ఇక సామ్ గురించి చెప్పాలంటే.. త‌న‌ను చూసి.. త‌ను ఎంచుకుంటున్న సినిమాల‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను. ప్ర‌తి సంవత్స‌రం ప‌ది మంచి సినిమాలున్నాయంటే అందులో రెండు, మూడు స‌మంత సినిమాలుంటున్నాయి. ఇప్పుడు త‌న లిస్టులో మ‌రొక‌టి జాయిన్ అవుతుంది. రాజుగారి కౌంటింగ్ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యింది. మ‌ళ్లీ ఫిబ్రవ‌రి 7 నుండి మళ్లీ స్టార్ట్ అయ్యి మార్చి 25వ‌ర‌కు కంటిన్యూ అవుతుంది. అక్క‌డి నుండి నేను చూసుకుంటా. అలాగే శిరీష్‌గారికి కంగ్రాట్స్‌. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. రాజుగారికి ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొన్ని సినిమాల‌ను చూసి ఎంజాయ్ చేస్తాం. కొన్నింటిని ఎంజాయ్ చేయ‌డ‌మే కాదు.. ఇంటికి కూడా తీసుకెళ‌తాం. అలా ఇంటికి తీసుకెళ్లే సినిమాల్లో ‘జాను’ ఒక‌టి. ఎంటైర్ యూనిట్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు.

జూనియర్ శర్వానంద్‌గా(రామ్ పాత్రలో) నటించిన సాయికిర‌ణ్ మాట్లాడుతూ - ‘‘నాకు అవ‌కాశం ఇచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థ్యాంక్స్‌. ప్రేమ్‌కుమార్‌గారు మేజిషియ‌న్‌. నాకు ఎంతో స‌పోర్ట్ అందించారు. యంగ్ రామ్ పాత్ర‌లో న‌టించినందుకు హ్యాపీగా ఉంది. కిర‌ణ్‌గారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. స‌మంత‌గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో క‌లిసి సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది’’ అన్నారు.

జూనియర్ సమంతగా(జాను చిన్నప్పటి పాత్రలో) నటించిన గౌరి మాట్లాడుతూ - ‘‘96’ సినిమాను నా డెబ్యూ మూవీగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. జాను సినిమాతో అదే పాత్రను చేయడం మరింత అదృష్టంగా భావిస్తున్నాను. ప్రేమ్‌కుమార్‌గారు నా పాత్ర‌ను అద్భుతంగా మ‌లిచారు. స‌మంత‌గారి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో న‌టించ‌డం గౌర‌వంగా ఉంది. మేం మేజిక్‌ను రీ క్రియేట్ చేశాం. ప్రేక్ష‌కుల అభిమానాలు, ఆశీస్సులు ఉంటాయ‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ సినిమాలో ఎంటైర్ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved