pizza
Manmadhudu 2 pre release function
`మన్మథుడు 2` డైరీస్ ఈవెంట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 August 2019
Hyderabad

కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా...

దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ```మన్మథుడు 2` మొదలవ్వడానికి కారణం నాగార్జునగారే. నా ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ఒక వారం ముందు నాగార్జునగారు ఇంటికి పిలిచి మాట్లాడారు. సినిమా చూశాను టేకింగ్ చాలా బావుంది. ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను నువ్వు కూడా అది చూడు. నీతో అలాంటి సినిమా ఒకటి చేయాలని అనుకుంటున్నాను అనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం. ఫ్రెంచ్ సినిమాను చూసి దాన్ని నాగ్ గారికి సెట్టయ్యే విధంగా మలుచుకుంటే బావుంటుందని అనుకున్నా. డిఫరెంట్‌గా ఆయన రోల్ కి తగ్గట్టు స్టోరీని డెవలప్ చేశాం. నాగార్జున పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది`` అన్నారు.

సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ మాట్లాడుతూ ``దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అందరి నుంచి చాలా మంచి నటనను రాబట్టారు. ఆయన ముందు నుంచి నటుడు కాబట్టి ఆర్టిస్ట్‌గా ఆలోచించి ప్రతి సీన్‌ను యాక్ట్ చేసి చూపించేవారు. ప్రతి డైలాగ్ , ప్రతి సీన్ ఈజీగా చేయించాడు. అందరం ఎలాంటి ఈగోస్ లేకుండా లేకుండా అందరూ కలిసి మెలిసి పని చేశారు. మా హీరో, ప్రొడ్యూసర్ చాలా బాగా మాతో హ్యాపీ గా వర్క్ చేశారు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు పడి పడి నవ్వాను. నాగార్జున నుంచి మరో రూపాన్ని ఈ సినిమాలో చూస్తారు. క్రెడిట్ మొత్తం డైరెక్టర్‌దే. ఈ సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది`` అని అన్నారు.

అక్కినేని అమల మాట్లాడుతూ ``చిత్ర యూనిట్ అందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. సినిమా కోసం మీ అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నాను. `మన్మథుడు 2` అందరికి నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మాట్లాడుతూ ``మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సాఫీగా వర్క్ సాగింది. ముందుగా నాగార్జునగారికి థ్యాంక్స్ . `ఆర్ఎక్స్ 100` సినిమా తరువాత నేను చేస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ మూవీ. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ టాలెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. తన ఐడియాలు బాగా షేర్ చేసుకుంటారు. నా లోనా.. అనే సాంగ్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. లాంగ్ బ్యాక్ నేను రెడీ చేసిన ఈ సాంగ్ వినిపించగానే ఆయన సినిమాలో యాడ్ చేశారు`` అన్నారు.

దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ```మన్మథుడు 2` సినిమాకు నన్ను ఆహ్వానిస్తారని అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ మొదట్లో నేను చేసిన `మన్మథుడు` నాకు మంచి గుర్తింపును ఇచ్చింది. అప్పట్లో అదే నాకు పెద్ద సినిమా. ఆ సినిమా దర్శకుడు కె.విజయభాస్కర్, నాగార్జునగారికి నేను ఎప్పటికి ఋణపడి ఉంటాను. సినిమా టీజర్ చాలా బావుంది. డైరెక్టర్ టేకింగ్ కూడా చాలా బావుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ భరద్వాజ్ కి కూడా నా అభినందనలు. సినిమాలో నటించిన వారందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఇక నాగార్జున గారు ఎప్పుడు ఒకేలా కనిపిస్తారు. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఎల్లప్పుడు పాధ్ బ్రేకర్ గా ఆదర్శంగా నిలుస్తున్నారు`` అన్నారు.

మన్మథుడు డైరెక్టర్ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ```మన్మథుడు` సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్ చేయాలంటే అదృష్టం ఉండాలి. చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు. `మన్మథుడు` సినిమా స్టార్ట్ చేసినప్పుఫు ఎప్పుడు స్టార్ట్ చేశామో ఎప్పుడు ఫినిష్ చేశామో కూడా తెలియదు. త్రివిక్రమ్ అప్పట్లో మంచి మాటలు అందించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను`` అన్నారు

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ``రాహుల్ మొదట కథ చెప్పినప్పుడు ఫస్ట్ నెరేషన్‌లోనే అవంతిక క్యారెక్టర్ చేయాలని అనుకున్నా. కెరీర్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. రాహుల్ `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` ముందు నుంచి నాకు తెలుసు. ఇక నాగ్‌సర్ తో వర్క్ చేయడం ఎప్పటికీ మరచిపోలేను. ఆయన్ని అందరూ ఎందుకు కింగ్ అంటారో ఇప్పుడు అర్ధమైంది. చిత్ర యూనిట్ మొత్తాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అందరికి ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాను`` అన్నారు.

అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ `` ఈ మధ్య నాన్న ప్రీ రిలీక్ ఈవెంట్స్ కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ముందేమో అందరూ బ్రదర్స్ లాగా ఉన్నారని అనేవారు. సరే లే లుక్స్‌తో మ్యానేజ్ చేయవచ్చు అని అనుకున్నా. కానీ ఇప్పుడు కంటెంట్ కూడా అలాగే అటెంప్ట్ చేస్తున్నారు నాన్న. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఒక లవ్ స్టోరీని ఫ్రెష్‌గా ప్రజెంట్స్ చేస్తున్నారు అంటే రియల్ గా అమేజింగ్ నాన్న. ఒక హిట్టోస్తే మళ్ళీ మేము అదే ప్యాట్రన్‌లో మరో రెండు సినిమాలు సేఫ్‌గా చేస్తుంటాం. ప్లాప్ వస్తే జాగ్రత్తగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాం. కానీ నాన్న మాత్రం హిట్టొచ్చినా ప్లాప్ వచ్చినా ప్రతి స్టెప్ డేరింగ్‌గా తీసుకుంటారు. అందుకే ఆయనను కింగ్ అంటారు. మా అందరికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మొదటి సినిమా `చి.ల.సౌ` చూడగానే నాన్నకు చెప్పాను. తప్పకుండా అతనితో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక మంచి సినిమా చేయాలని చెప్పాను. అది రెండో సినిమాకే కుదిరింది. భవిష్యత్‌లో కూడా ఆయనతో వర్క్ చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. యూనిట్‌లో ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకు చాలా థ్యాంక్స్. మన ఆడియెన్స్ అనే కాదు బాలీవుడ్‌లో అందరూ మనం ఏం చేస్తున్నారో చూస్తున్నారు. `మన్మథుడు 2` ఈ ఇయర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నాను. మన సినిమాలను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తున్నారు. డబ్ చేస్తున్నారు. మన దర్శకులకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి. రాహుల్ కూడా అదే స్థాయికి చేరుకోవాలని అనుకుంటున్నాను`` అన్నారు.

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ``ఈ సినిమాకు `మన్మథుడు` టైటల్ ఎందుకు పెట్టమంటే.. ఒరిజినల్ `మన్మథుడు` ఉమెన్స్‌ని ద్వేషిస్తాడు. కానీ ఈ మన్మథుడు ఉమెన్స్‌ని లవ్ చేస్తాడు. సర్కిల్‌ని ఫినిష్ చేయాలి కదా అందుకే.. `మన్మథుడు 2` అని టైటిల్ సెట్ చేశాం. ఏడాది క్రితం ఒక ఫ్రెంచ్ సినిమా చూశాను. నా వయసుకు తగ్గ సినిమా ఇది అనిపించింది. ఏ వయసులో అయినా లవ్ చేయవచ్చు. అది ఈ సినిమాలో కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఒరిజినల్ `మన్మథుడు` నాకు మెమరబుల్ మూవీ. అప్పటి దర్శకుడు విజయ భాస్కర్‌గారి టేకింగ్ అద్భుతం. ఇక ఈ `మన్మథుడు 2`కి కూడా రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా వర్క్ చేశాడు. పోర్చుగల్‌లో 40 రోజుల పాటు షూటింగ్ చేశాం. తోటి నటీనటులు చాలా చక్కగా యాక్ట్ చేశారు. రోజు వెన్నెలకిషోర్ నాతో కలిసి బాగా తినేవాడు. ఇది ఒక వండర్‌ఫుల్ జర్నీ. నేను కెరీర్‌లో ఇంత స్టయిలిష్ గా ఎప్పుడు కనిపించలేదు. చాలా బాగా కనిపించడానికి ప్రధాన కారణం సినిమాటోగ్రాఫర్ సుకుమార్ ముఖ్యకారణం. నన్ను చాలా బాగా చూపించారు. ఇక రకుల్‌తో పని చేయడం చాలా ఈజీ. ఆమె చాలా హార్డ్ వర్కర్. అలాగే మంచి మనస్తత్వం గల అమ్మాయి. చాలా టాలెంటెడ్ కూడా. ఆమెతో వర్క్ చేయడం చాలా బావుంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన వర్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు న్వవుతూనే ఉంటాం. అది గ్యారెంటీ. మొన్న నాగ చైతన్య `మజిలీ` సినిమాతో హిట్ కొట్టాడు. నిన్న `ఓ బేబీ` సినిమాతో మా కోడలు సక్సెస్ అందుకుంది. రేపు ఆగస్ట్ 9న వాటికంటే ఎక్కువ ఆకట్టుకునే విధంగా `మన్మథుడు 2` రాబోతోంది. `ఆర్.ఎక్స్ 100`‌కి మ్యూజిక్ అందించిన చైతన్ భరద్వాజ్ ఈ సినిమాలో మూడు మంచి పాటలు కంపోజ్ చేశాడు. అతను బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. వేడుకకు వచ్చిన అక్కినేని అభిమానులందరికి చాలా కృతజ్ఞతలు`` అన్నారు.

 

 

Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved