pizza
Natakam pre release function
'నాటకం' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


26 September 2018
Hyderabad

రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో కల్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో ఆశిష్‌ గాంధీ, ఆషిమా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'నాటకం'. శ్రీసాయి దీప్‌ చాట్ల, రాధిక శ్రీనివాస్‌, ప్రవీణ్‌ గాంధీ, ఉమ కూచిపూడి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఆడియో సీడీలను సుధీర్‌బాబు విడుదల చేశారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - ''నిర్మాత రిజ్వాన్‌గారితో మంచి పరిచయం ఉంది. నాటకం సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుండి దీన్ని 'ఆర్‌.ఎక్స్‌ 100'తో పోల్చుతున్నారు. కాబట్టి ఈ సినిమా మా సినిమా కంటే పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. ఎంటైర్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

నిర్మాత సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ - ''నిర్మాతలు సినిమా రంగంలోకి ఓ హిట్‌ సినిమాతో అడుగుపెడుతున్నట్లుగా అనిపిస్తుంది. మా శివం సెల్యులాయిడ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను 300 థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ - ''ఆశిష్‌, నిర్మాతలు, అంజి అందరినీ చూస్తుంటే.. మేం ఆర్‌.ఎక్స్‌ 100 విడుదల సమయంలో ఎంత ఆనందంగా ఉన్నామో వీళ్లు కూడా అంతే ఆనందంగా ఉన్నారని అర్థమైంది. మా సినిమాను నాటకం సినిమా మించి హిట్‌ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

రాహుల్‌ విజయ్‌ మాట్లాడుతూ ''రిజ్వాన్‌, ఖుషిగారితో నాకు పరిచయం ఉంది. చాలా మంచి వ్యక్తులు. టీమ్‌ పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలి'' అన్నారు.

నిర్మాత రిజ్వాన్‌ మాట్లాడుతూ - ''నాటకం సినిమా అందరి హృదయాలకు హత్తుకునే సినిమా అవుతుంది. తదుపరి సుధీర్‌బాబు, శ్రీవిష్ణులతో చేయబోతున్నాం. ఆశిష్‌, ఆషిమా, సాయికార్తీక్‌, అంజి, కల్యాణ్‌ అందరూ పిల్లర్స్‌లా ఈ సినిమాకు పనిచేశారు'' అన్నారు.

నిర్మాత ఖుషి మాట్లాడుతూ - ''రెండు సినిమాలు స్టార్ట్‌ చేసిన తర్వాత నాటకం మూవీ మా దగ్గరకు వచ్చింది. అందరూ కొత్తవాళ్లే సినిమా ఎలా రిలీజ్‌ చేస్తారో అని అనుకుంటున్న తరుణంలో శివం సెల్యులాయిడ్స్‌ సురేశ్‌ రెడ్డిగారు సపోర్ట్‌ చేశారు. ఈ రోజు 300 థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుందంటే సురేశ్‌గారే కారణం. అంజిగారి ఫోటోగ్రఫీ, సాయికార్తీక్‌ మ్యూజిక్‌, కల్యాణ్‌ జి.గోగణ టేకింగ్‌, ఆశిష్‌, ఆషిమా నటన సినిమాకు హైలైట్‌గా ఉంటుంది'' అన్నారు.

సాయికార్తీక్‌ మాట్లాడుతూ - ''నాపై నమ్మకంతో నేను బావుందని చెప్పగానే.. రిజ్వాన్‌, ఖుషిగారు సినిమాను కొన్నారు. కల్యాణ్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది. ఆశిష్‌, ఆషిమా సహా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

కెమెరామెన్‌ అంజి మాట్లాడుతూ - ''నాటకం మంచి స్టోరీ లైన్‌తో తెరకెక్కింది. గరుడవేగ తర్వాత నా హార్ట్‌కు టచ్‌ అయిన సినిమా ఇది. సాయికార్తీక్‌ కథ వినమంటే విన్నాను. వెంటనే నచ్చింది. చాలా తక్కువ డేస్‌లో సినిమాను పూర్తి చేశాం. చీరాల, బాపట్ల లొకేషన్స్‌లో సినిమాను పూర్తి చేశాం. టీం అంతా సినిమా కోసం బాగా కష్టపడ్డాం. ఆశిష్‌, ఆషిమా చాలా బాగా చేశారు. కొత్త నటీనటులైనా.. చాలా చక్కగా నటించారు. కల్యాణ్‌ షూటింగ్‌ వెళ్లకముందే అందరికీ ట్రయినింగ్‌ ఇచ్చి సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశారు. అందరి నుండి మంచి అవుట్‌పుట్‌ను రాబట్టుకున్నారు. హిట్‌ సినిమాకు పనిచేశామని అనిపిస్తుంది'' అన్నారు.

కల్యాణ్‌ జి.గోగణ మాట్లాడుతూ - ''మా సినిమాను అర్జున్‌ రెడ్డి, ఆర్‌.ఎక్స్‌ 100 సినిమాలతో పోల్చడం ఆనందంగా ఉంది. కంటెంట్‌ సినిమాలకు ఆదరణ లభిస్తున్న ఈ తరుణంలో మా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. 15 రోజుల్లో కథను పూర్తి చేశాను. సాయికార్తీక్‌గారు మా అందరికీ కంటే ఎక్కువగా ప్రేమించారు. ఆయనే అంజిగారిని మాకు పరిచయం చేసి సినిమా చేయమని ఒప్పించారు. ఆశిష్‌ అనే వ్యక్తి నాలుగేళ్లుగా పరిచయం. యాటిట్యూడ్‌ బేస్‌డ్‌ మూవీ'' అన్నారు.

ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ - ''దర్శకుడు కల్యాణ్‌ వల్లే సినిమా ఈ స్థాయికి వచ్చింది. అలాగే సాయికార్తీక్‌ అన్న అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అంజిగారు ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్‌ ఇచ్చారు. రిజ్వాన్‌, ఖుషిగారు ట్రైలర్‌ చూసి సినిమా తీసుకున్నారు'' అన్నారు.

హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ - ''నిర్మాతలు రిజ్వాన్‌, ఖుషి ఈ సినిమా కొంటున్నామని చెప్పగానే 'ఎందుకండీ.. రెండు సినిమాలు చేస్తున్నారు కదా.. కాస్త ఎక్స్‌పీరియెన్స్‌ వచ్చిన తర్వాత ఇలాంటివి ఆలోచించండి' అన్నాను. అయితే ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాకు మంచి హైప్‌ వచ్చింది. ఇప్పుడు మంచి చాయిస్‌. కచ్చితంగా మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ అని అర్థమవుతుంది. ఎనర్జీ కనపడుతుంది. ఆశిష్‌గాంధీ చాలా బావున్నాడు. చాలా చక్కగా నటించాడు. తను అనంతపురం మూవీలో జైలాగా కనపడ్డారు. పది సినిమాలు చేసిన హీరోలా నటించాడు. డైరెక్టర్‌ కల్యాణ్‌కి అభినందనలు. ఆషిమా సహా ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved