pizza
Next Enti pre release function
`నెక్ట్స్ ఏంటి` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 December 2018
Hyderabad

తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా ప్ర‌ధాన తారాగ‌ణంగా వైకింగ్ మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై.లి, అక్ష‌య్ పురి ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై కునాల్ కొహ్లి ద‌ర్శ‌క‌త్వంలో రైనా జోషి నిర్మాత‌లుగా నిర్మించిన చిత్రం `నెక్ట్స్ ఏంటి`. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ``నిర్మాత అక్ష‌య్ పూరి చాలా పాజిటివ్ ప‌ర్స‌న్‌. సినిమాను చ‌క్క‌గా తీయ‌డ‌మే కాదు.. బాగా బిజినెస్ కూడా చేసుకున్నారు. ఇక డైరెక్ట‌ర్ కునాల్ కొహ్లి డైరెక్ట్ చేసిన హ‌మ్ తుమ్‌, ఫ‌నా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో త‌మ‌న్నాతో క‌లిసి ఈ సినిమా చేయ‌డం హ్యాపీ. సినిమాను బాగా తీశాం. ఎంత బాగా తీసినా ప్రేక్ష‌కుల‌ను దృష్టిలో పెట్టుకునే సినిమా చేశాం. నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నం. సినిమాను సినిమాగా క‌థ‌కు ఏమ‌వ‌స‌ర‌మో దాన్నే తెర‌కెక్కించాం. ల‌వ్‌, సెక్స్ గురించి ఈ సినిమా ఉంటుంది. చాలా స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తూ సినిమా తీశాం. సెక్స్ వ‌ల్ల కొట్టుకునే బాయ్‌ఫ్రెండ్‌, గ‌ర్ల్‌ఫ్రెండ్.. ఫ‌స్ట్ డ్రింక్ నాతోనే తాగాల‌ని కూతుర్ని అడిగే తండ్రి.. ఇలాంటి మూమెంట్స్‌ను కునాల్‌గారు త‌న‌దైన స్ట‌యిల్‌లోతెర‌కెక్కించారు. మనీష్ భ‌ట్‌, లియోన్‌కి థాంక్స్‌. రెండు క్యారెక్ట‌ర్స్‌ను ట్రావెలింగ్ స్టోరీ ఇన్ ఎంట‌ర్ టైనింగ్ వే. సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది`` అన్నారు.

అక్ష‌య్ పురి మాట్లాడుతూ - ``సాంగ్స్‌, ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత కునాల్‌గారు త‌న‌దైన స్ట‌యిల్‌లో సినిమాను ఎంత బాగా తెర‌కెక్కించార‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

త‌మ‌న్నా మాట్లాడుతూ - ``సినిమాపై ప‌డ్డ ట్యాగ్స్ అన్నింటిని బ్రేక్ చేసి మంచి సినిమాగా అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. లియోన్ అద్భుత‌మైన సంగీతం అందించారు. సందీప్‌, న‌వ‌దీప్ చాలా కూల్ కోస్టార్స్‌. అక్ష‌య్‌పురితో క‌లిసి సినిమా చేయాల‌నుకున్నాను. అది ఈ సినిమాతో నేర‌వేరింది. కునాల్‌గారు చాలా నైస్ ప‌ర్స‌న్‌. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ లియోన్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను మ్యూజిక్ చేసిన తొలి సినిమా కాబ‌ట్టి ఇది నాకు స్పెష‌ల్ మూవీ. ఐదు సాంగ్స్ డిప‌రెంట్స్ ల‌వ్ సాంగ్స్‌. చ‌క్క‌గా వ‌చ్చాయి. సినిమాను డిసెంబ‌ర్ 7న అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

రైనా జోషి మాట్లాడుతూ - ``మంచి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌తో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. సినిమా అంద‌రూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది` అన్నారు.

నటీనటులు: తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: కునాల్ కోహ్లీ
నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి
సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్
సంగీతం: లియోన్ జేమ్స్
సాహిత్యం రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్ (UK)
డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి
సౌండ్ డిజైన్: దారా సింగ్
అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల
PRO: వంశీ-శేఖర్
రిలీజ్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved