pizza
24 Kisses press meet
'24 కిస్సెస్‌' ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


22 November 2018
Hyderabad

సిల్లీ మాంక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అరుణ్‌ ఆదిత్‌, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం '24 కిస్సెస్‌'. అయోధ్యకుమార్‌ క్రిష్ణంశెట్టి దర్శకుడు. సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల, అయోధ్యకుమార్‌ క ష్ణంసెట్టి నిర్మాతలు. నవంబర్‌ 23న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

హీరో అరుణ్‌ అదిత్‌ మాట్లాడుతూ ''ఆల్‌ రెడీ సినిమా బుకింగ్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. ఇప్పటికే 70-80 శాతం థియేటర్స్‌ బుక్‌ అయిపోయాయి. లెక్క పెట్టుకోలేనన్ని సందేశాలు వస్తున్నాయి. సినిమా బావుంటుంది.. ఏం పలానా థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నామంటూ ప్రేక్షకులు మెసేజ్‌లు పెడుతున్నారు. లవర్స్‌తో అయినా, ఫ్యామిలీతో అయినా సినిమాను థియేటర్‌లోనే చూడండి. మరచిపోలేని లవ్‌స్టోరి. మంచి అనుభూతినిస్తుంది'' అన్నారు.

హెబ్బా పటేల్‌ మాట్లాడుతూ - ''చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. చాలా హార్డ్‌వర్క్‌ చేశాం. ప్రేక్షకులు మా సినిమాను బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.

దర్శకుడు అయోధ్యకుమార్‌ కృష్ణం శెట్టి మాట్లాడుతూ - ''బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. అద్భుతమైన మ్యూజిక్‌, విజువల్స్‌ కుదిరాయి. టైటిల్‌ను బట్టి ఇదేదో వల్గారిటీ ఉన్న సినిమా అనుకోవద్దు. అడల్డ్‌ సినిమా కూడా కాదు. ఇదొక మంచి ప్రేమకథా చిత్రం. డైరెక్టర్‌గా నేనెప్పుడూ దిగజారి సినిమాలు చేయను. ముద్దులు ఎమోషన్స్‌ను క్యారీ చేస్తాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ పెళ్ళి, దాని చుట్టూ ఉన్న పరిస్థితులు, యూత్‌ ఎలా ఉన్నారనే విషయాలను ఇందులో చూపిస్తున్నాం. రావు రమేశ్‌, నరేశ్‌గారు మా సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచారు. లైటర్‌వేలో అహ్లాదకంగా సాగే ప్రేమకథా చిత్రం. రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుండి ఓ తీపి గుర్తుతో బయటకు వస్తారు. మా రెండేళ్ల కష్టం. జెన్యూన్‌ ఎఫర్ట్‌తో చేశాం. ఫలితం కూడా బావుంటుందని నమ్ముతున్నాం. రొటీన్‌ సినిమా కాదు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. అన్నీ వర్గాల ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుంది. సినిమాను అందరూ ఆదరించండి'' అన్నారు.

ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: హ‌రి వ‌ర్మ‌, సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, మ‌నోజ్ యాద‌వ్, ఎడిట‌ర్: ఆల‌యం అనిల్, బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్, సంగీతం: జోయ్ బ‌రువా, సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఉద‌య్ గుర్రాల‌, లైన్ ప్రొడ్యూస‌ర్: చ‌ందా గోవింద రెడ్డి, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి, ద‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణం శెట్టి

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved