pizza
Aloukika release on 23 April
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 April 2015
Hyderabad

23న విడుదలవుతున్న ’అలౌకిక‘

మనోజ్ నందం, మాదాల రవి, బ్రహ్మాజీ ప్రధానపాత్రల్లో శ్రీ హయగ్రీవ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో డా.జె.ఆర్.రావు రూపొందించిన చిత్రం అలౌకిక. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా...

దర్శకుడు చల్లా భానుకిరణ్ మాట్లాడుతూ ‘’కథ వినగానే ఎక్కడా ఖర్చుకి ఆలోచించకుండా, మంచి సినిమా చేయాలనే తపనతో ఈ చిత్రాన్ని నిర్మించిన డా.జె.ఆర్.రావుగారికి థాంక్స్. ఆయన ఈ బ్యానర్ ను మంచి చిత్రాలు తీయాలనే తలంపుతోనే స్టార్ట్ చేశారు. ఆయన నమ్మకాన్ని అలౌకిక చిత్రం నిలబెడుతుందని ఆశిస్తున్నాను. కామెడి సినిమా దీంట్లో హర్రర్ కలిసి ఉంటుంది. మనోజ్ నందం, తాగుబోతు రమేష్ లకు ఈ చిత్రం మంచి పేరు తీసుకొస్తుంది. సినిమా బాగా రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. సినిమా 23న విడుదలవుతుంది. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది’’ అన్నారు.

నిర్మాత డా.జె.ఆర్.రావు మాట్లాడుతూ ‘’దర్శకుడు భానుకిరణ్ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఊర్మిళ పేరుతో విడుదల చేస్తున్నాం. 23న విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం’’ అన్నారు.

మాదాల రవి మాట్లాడుతూ ‘’భానుకిరణ్ తో మంచి అనుబంధం ఉంది. గతంలో తన దర్శకత్వంలో పంచముఖి చిత్రాన్ని చేశాను. అలాగే ఈ చిత్రంలో కూడా మంచి రోల్ చేశాను. నిర్మాతగారు మంచి ఫ్యాషన్ తో సినిమా రంగంలోకి వచ్చారు. ఇటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం ఉంది. సినిమాని అందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

మనోజ్ నందం మాట్లాడుతూ ‘’ఇప్పటి వరకు చేసిన విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ట్రై చేసిన సినిమా ఇది. వంద థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుండటం చాలా హ్యపీగా ఉంది. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.

ఈ కార్యక్రమలో రాకెట్ రాఘవ, మిత్ర, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved