pizza
Anaganaga O Premakatha press meet
'అనగనగా ఓ ప్రేమకథ' ప్రెస్‌ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 December 2018
Hyderabad

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ'. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో...

నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజు మాట్లాడుతూ - ''సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్‌ యు సర్టిఫికేట్‌ పొందింది. డిసెంబర్‌ 14న సినిమాను విడుదల చేస్తున్నాం. క్లీన్‌ లవ్‌స్టోరీ. మంచి సస్పెన్స్‌ కూడా ఉంటుంది. సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేస్తున్నారు. హీరో విరాజ్‌, హీరోయిన్స్‌ రిద్దికుమార్‌, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్‌ ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఎడిటర్‌ మార్తాండ్‌ వెంకటేశ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె.సి.అంజన్‌ తదితరులు సినిమా మంచి అవుట్‌పుట్‌ కోసం బాగా కేర్‌ తీసుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాను గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ విడుదల చేస్తుంది'' అన్నారు.

కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ - ''కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు ఎన్నో సినిమాలకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ఎన్నో చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఆయన నిర్మాణంలో రూపొందిన 'అనగనగా ఓ ప్రేమకథ' సాంగ్స్‌, ట్రైలర్‌ చాలా బావున్నాయి. ప్రతాప్‌ సినిమాను చక్కగా తెరకెక్కించారు. మార్తాండ్‌ వెంకటేశ్‌గారి మేనల్లుడు హీరో విరాజ్‌ హ్యండ్‌సమ్‌గా ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ మాట్లాడుతూ -''మా విరాజ్‌ను హీరోను చేసిన కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి సహాయాన్ని మరచిపోలేను. సాంగ్స్‌, ట్రైలర్స్‌ అందరికీ నచ్చాయి. సినిమా కూడా అందరినీ మెప్పిస్తుంది'' అన్నారు.

విరాజ్‌ జె.అశ్విన్‌ మాట్లాడుతూ - ''హీరో కావాలనే నా కల నిజమైంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి నిర్మాతగా చేసిన సినిమా ద్వారా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతాప్‌ నా క్యారెక్టర్‌ను ఫుల్‌ ఎనర్జీతో తీర్చిదిద్దారు. మా యూనిట్‌ కుటుంబ సభ్యుల్లా నాకు అండగా నిలబడ్డారు. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.

దర్శకుడు ప్రతాప్‌ తాతం శెట్టి మాట్లాడుతూ - ''ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయ్యింది. మంచి లవ్‌ స్టోరీ. టచ్‌ హేస్‌ ఎ మెమరీ అనే ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా నిర్మాత కె.ఎల్‌.ఎన్‌.రాజుగారు లేకుంటే ఈ సినిమాయే లేదు. ఆయనకి థాంక్స్‌. ఆయన కుమారుడు సతీష్‌గారు, కోడలు సునైనగారు ఎంతగానో ఎంకరేజ్‌ చేస్తూ వచ్చారు. కొత్త వాళ్లతో సినిమా చేయడం చాలా గొప్ప విషయం. వారికి థాంక్స్‌. ఇప్పుడున్న వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఎడిటర్స్‌లో ఒకరైన మార్తాండ్‌ కె.వెంకటేశ్‌గారు బెస్ట్‌ ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. అంతే కాకుండా ఆయన మేనల్లుడిని హీరోగా కూడా ఇచ్చారు. డిసెంబర్‌ 14న సినిమా విడుదలవుతుంది. మా ప్రయతాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved