pizza
Anaganaga O Premakatha press meet
డిసెంబ‌ర్ 14న `అన‌గ‌న‌గా ఓ ప్రేమ‌క‌థ‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 December 2018
Hyderabad

థౌజెండ్‌ లైట్స్‌ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్‌.రాజు నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఓ ప్రేమకథ'. విరాజ్‌ జె.అశ్విన్‌, రిద్దికుమార్‌, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్‌ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్‌ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత కె.ఎల్‌.ఎన్ రాజు మాట్లాడుతూ - ``మంచి ప్రేమ‌క‌థ‌. అశ్విన్‌, రిద్ది, రాధా బంగారు స‌హా న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హకారంతో మంచి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఓ కూతురుని మంచి దారిలో పెట్ట‌డానికి తండ్రి ఏం చేశాడ‌నేదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్‌. డిసెంబ‌ర్ 14న సినిమాను గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ స‌హ‌కారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తాతం శెట్టి మాట్లాడుతూ - ``మంచి క్యూట్ ల‌వ్ స్టోరీ. అహ్లాద‌క‌రంగా ఉంటుంది. కె.ఎల్‌.ఎన్‌.రాజుగారి స‌హాయంతో సినిమాను పూర్తి చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డిసెంబ‌ర్ 14న విడుద‌లవుతోన్న మా ప్ర‌య‌త్నాన్ని ఆదరిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

సున‌య‌న మాట్లాడుతూ - ``మా మామ‌గారు కె.ఎల్.ఎన్ రాజుగారు చిన్న సినిమాల‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దేశంతో.. ఈ సినిమా చేశాం. సినిమా కోసం అంద‌రం క‌ష్ట‌పడ్డాం. ఈ నెల 14న మా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది`` అన్నారు.

విరాట్‌జె.అశ్విన్ మాట్లాడుతూ - ``రాజుగారు లేకుంటే సినిమా లేదు. ఆయ‌న బ్యాన‌ర్‌లో హీరోగా ప‌రిచ‌యం కావ‌డం ఆనందంగా ఉంది. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను. మావ‌య్య మార్తాండ్ కె.వెంక‌టేశ్‌గారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. డిసెంబ‌ర్ 14న విడుద‌ల‌వ‌తున్న మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

రిద్ది కుమార్ మాట్లాడుతూ - ``తెలుగులో నేను సైన్ చేసిన తొలి చిత్ర‌మిది. మంచి పాత్ర చేశాను. ఇన్నోసెంట్ అమ్మాయిగా మెప్పిస్తాను`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved